Itel Mobiles Launch: మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు వచ్చాయి. గాడ్జెట్ తయారీ సంస్థ ఐటెల్ తన 'ఐటెల్ S25', 'ఐటెల్ S25 అల్ట్రా' మొబైల్స్‌ను ఫిలిప్పీన్స్ మార్కెట్‌లో రిలీజ్ చేసింది. అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో 6.78- అంగుళాల AMOLED స్క్రీన్‌ను కలిగి ఉన్నాయి. ఈ సందర్భంగా వీటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం రండి.
ఐటెల్ S25, ఐటెల్ S25 అల్ట్రా స్పెసిఫికేషన్స్: ఐటెల్ S25, ఐటెల్ S25 అల్ట్రా రెండూ డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు. ఇవి ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతాయి. కంపెనీ 6.78-అంగుళాల AMOLED స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్టాండర్డ్ మోడల్‌ను తీసుకొచ్చింది. అయితే అల్ట్రా వేరియంట్ అదే పరిమాణం, రిఫ్రెష్ రేట్‌తో కర్వ్డ్ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌తో వస్తుంది.
ఐటెల్ S25 చిప్‌సెట్‌కు సంబంధించిన వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే S25 అల్ట్రా Unisoc T620 చిప్‌సెట్‌తో పాటు 8GB LPDDR4X RAM, 512GB వరకు UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. ఐటెల్ S25, ఐటెల్ S25 అల్ట్రా రెండూ బ్యాక్ ప్యానెల్లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం వీటిలో 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.
ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు 5,000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ గురించి సమాచారం అందుబాటులో లేదు. ఐటెల్ S25 డస్ట్, స్ప్లాష్ ప్రొటెక్షన్‌తో IP54 రేటింగ్‌ను కలిగి ఉంది. అయితే ఐటెల్ S25 అల్ట్రా కొంచెం మెరుగైన IP64 రేటింగ్‌ను కలిగి ఉంది. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం రెండు ఫోన్‌లు ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉన్నాయి. అంతేకాక వేరియస్ డివైజస్‌ను కంట్రోల్ చేసేందుకు అల్ట్రా మోడల్‌లో ఇన్‌ఫ్రారెడ్ ట్రాన్స్‌మిటర్ ఉన్నట్లు కూడా సమాచారం.