iPhone SE 4 First Look: యాపిల్ త్వరలో తన సరికొత్త ఐఫోన్‌ను లాంఛ్ చేయనుంది. 'ఐఫోన్ SE 4' లేదా 'ఐఫోన్ 16E' పేరుతో దీన్ని ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో తీసుకురానుంది. సాధారణంగా యాపిల్ ఈ లైనప్‌ను SE పేరుతో రిలీజ్ చేసేది. కానీ ఈసారి ఈ చౌకైన ఐఫోన్ మోడల్‌ను 'ఐఫోన్ SE 4'గా కాకుండా 'ఐఫోన్ 16E'గా లాంఛ్ చేయొచ్చని కొన్ని నివేదికలు వెల్లడించాయి. ఇక ఐఫోన్ ఫస్ట్ గ్లింప్స్‌లో యాపిల్ ఈ అప్‌కమింగ్ ఫోన్ డమ్మీ బయటపడింది.
ఐఫోన్ SE 4 డమ్మీ లీక్:ఈ డమ్మీలో 'ఐఫోన్ SE 4' మోడల్‌ను రెండు కలర్స్‌లో చూడొచ్చు. అవి వైట్, బ్లాక్. అంటే దీన్ని బట్టి యాపిల్ ఈ ఫోన్‌ను రెండు కలర్ ఆప్షన్లలో లాంఛ్ చేయొచ్చు. స్మార్ట్‌ఫోన్‌ల గురించి సమాచారం అందించే పాపులర్ టిప్‌స్టర్ సోనీ డిక్సన్ తన X అకౌంట్ లో దీనిపై ఓ పోస్ట్ షేర్ చేశారు. ఆ పోస్ట్‌లో ఈ అప్‌కమింగ్ యాపిల్ ఐఫోన్‌కు చెందిన రెండు ఫొటోలను పంచుకున్నారు. ఈ ఫొటోలో అప్‌కమింగ్ ఐఫోన్ తెలుపు, నలుపు రంగులో లాంఛ్ అవుతుందని తెలియజేస్తుంది.
ఈ ఫొటోలో ఫోన్ బ్యాక్, సైడ్ యాంగిల్ కన్పిస్తుంది. మొదటి చూపులో ఈ ఫోన్ ఐఫోన్ 14 మాదిరిగానే ఉంటుంది. గత కొన్ని నెలలుగా అనేక మీడియా కథనాల్లో కూడా ఇదే చర్చించారు.
ఊహించినట్లుగానే ఈ ఫోన్ వెనక భాగంలో టాప్ లెఫ్ట్ కార్నర్లో సింగిల్ కెమెరా కన్పిస్తుంది. బ్యాక్ కెమెరా పక్కనే పెద్ద LED ఫ్లాష్ లైట్ ఉంది. ఇది తక్కువ కాంతిలో కూడా మంచి ఫొటోలను తీసేందుకు సహాయపడుతుంది. ఈ ఫోన్ వెనక డిజైన్ పూర్తిగా ఫ్లాట్ సైడ్స్‌తో వస్తుంది.
ఫోన్ ఎడమ వైపున వాల్యూమ్ బటన్స్, మ్యూట్ స్విచ్ ఉన్నాయి. దిగువన సిమ్ ట్రే కూడా ఉంది. దీనిలో ఉన్న మ్యూట్ బటన్‌ను యాక్షన్ బటన్ అని కొన్ని మునుపటి నివేదికలలో చెప్పుకొచ్చారు. అయితే ఇది సాధ్యమయ్యేలా కన్పించడం లేదు.