తెలంగాణ

telangana

ETV Bharat / technology

ఇన్​స్టాగ్రామ్​లో స్క్రీన్​షాట్​ తీస్తే - ఆ విష‌యం అవతలి వ్యక్తికి తెలుస్తుందా? - Instagram Screenshot - INSTAGRAM SCREENSHOT

Instagram Screenshot Tips : ఇన్​స్టాగ్రామ్​లో మ‌న‌కు న‌చ్చిన కంటెంట్ కోసం కొన్ని సార్లు స్క్రీన్​షాట్ తీస్తుంటాం. అయితే అలా స్క్రీన్​షాట్ తీసిన‌ప్పుడు, దాన్ని పోస్ట్ చేసిన వ్యక్తికి ఆ విషయం తెలుస్తుందా? ఒక వేళ తెలిస్తే పరిస్థితి ఏమిటి? ఎవరికీ తెలియకుండా స్క్రీన్ షాట్ ఎలా తీయాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Instagram Screenshot Tips
How To Stop Instagram Screenshot

By ETV Bharat Telugu Team

Published : Mar 22, 2024, 4:18 PM IST

Instagram Screenshot Tips :ఇన్​స్టాగ్రామ్​కు యువతలో మంచి క్రేజ్ ఉంది. దీనిలో మనకు నచ్చిన ప్రొఫైల్​, స్టోరీస్​, డీఎంలను స్క్రీన్​షాట్ తీస్తూ ఉంటాం. ఇలా తీసినప్పుడు ఆ విషయం, పోస్ట్​ చేసిన వ్యక్తికి తెలుస్తుందా? ఇన్​స్టాగ్రామ్ సదరు వ్యక్తికి నోటిఫికేషన్ ఏమైనా ఇస్తుందా? ఈ సందేహం మీకు ఎప్పుడైనా వ‌చ్చిందా?

ఇన్​స్టాగ్రామ్ 2018లో ఒక ఫీచ‌ర్​ను తీసుకొచ్చింది. దీని వల్ల ఎవ‌రైనా మ‌న స్టోరీని స్క్రీన్ షాట్ తీస్తే, వెంటనే మనకు నోటిఫికేష‌న్ వచ్చేది. కానీ దీన్ని కొన్ని రోజుల‌కే తొల‌గించారు. ప్రస్తుతం మన ప‌ర్స‌న‌ల్ చాట్​ను ఎవ‌రైనా స్క్రీన్​షాట్ తీసుకున్నా అది మ‌న‌కు తెలీదు. ఇది డైరెక్ట్ మెసేజెస్ అండ్ వ‌న్-టు-వ‌న్ మెసేజెస్​కు కూడా వ‌ర్తిస్తుంది. కానీ దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి.

1. వానిష్ మోడ్ ఉప‌యోగిస్తున్న‌ప్పుడు
ఇన్‌స్టాగ్రామ్‌లోని వానిష్ మోడ్ ఉంటుంది. చాట్​ విండోను క్లోజ్ చేసిన వెంటనే, అప్ప‌టి వరకు ఉన్న మెసేజ్​లను ఇది క్లియ‌ర్ చేస్తుంది. ఈ ఫీచ‌ర్​ను స్నాప్​చాట్ నుంచి ఇన్​స్పైర్ అయి తీసుకొచ్చారు. చాట్​పై స్వైప్ చేయడం ద్వారా దీన్ని ఎనేబుల్ చేసుకోవ‌చ్చు. మీరు వానిష్ మోడ్ ఆన్​చేసి ఉన్నప్పుడు స్క్రీన్‌షాట్ తీస్తే, వెంటనే అది అవ‌త‌లి వ్య‌క్తికి నోటిఫికేషన్ వెళ్లిపోతుంది. చాట్ విండోలో మీకు 'You took a screenshot' అనే మెసేజ్ క‌నిపిస్తుంది. అవ‌త‌లి వ్య‌క్తికి మీ యూజ‌ర్ నేమ్​తో సహా took a screenshot అని క‌నిపిస్తుంది. వానిష్ మోడ్ ఆఫ్ అయ్యేంత వ‌ర‌కు ఇలానే జరుగుతుంది.

2. డిస్ అప్పియ‌ర్ ఫొటోస్ లేదా వీడియోస్​
డిస్​అప్పియ‌ర్ ఫొటోలను లేదా వీడియోలను స్క్రీన్​షాట్ తీసిన‌ప్పుడు కూడా అవతలి వ్యక్తికి నోటిఫికేషన్ వెల్లిపోతుంది.

తెలియ‌కుండా స్క్రీన్​షాట్​ తీయాలంటే ఇలా చేయండి
ఎవరైనా మిమ్మల్ని బెదిరించినా, లేదా వేధించినా వాళ్ల స్క్రీన్​షాట్​లను వాళ్లకు తెలియకుండానే తీయవచ్చు. అది ఎలా అంటే?

1. వైఫై/ ఇంటర్నెట్​ ఆఫ్ చేస్తే చాలు!
అఫ్​లైన్​లో ఉండి చాట్ విండోలో మీరు స్క్రీన్‌షాట్ తీసుకుంటే, ఆ విష‌యం అవతలి వారికి తెలియదు. కనుక మీరు మీ WiFi, డేటాను ఆఫ్ చేసి స్క్రీన్‌షాట్‌లను తీసుకోవచ్చు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే - మీ ఫోన్ ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయిన వెంటనే, స్క్రీన్‌షాట్ తీసుకున్న విష‌యం అవతలి వ్యక్తికి నోటిఫికేషన్ ద్వారా తెలిసిపోతుంది.

2. మరొక ఫోన్‌తో ఫొటో తీయ‌డం తీయడం
మీకు వేరే ఫోన్ ఉంటే, దానితో సింపుల్​గా స్క్రీన్​షాట్ తీసుకోవచ్చు.

3. స్క్రీన్ రికార్డింగ్ ఉపయోగించడం
స్క్రీన్‌షాట్ తీయడానికి బదులుగా స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవ‌చ్చు. Instagram స్క్రీన్‌షాట్‌లను మాత్రమే గుర్తిస్తుంది. కాబట్టి మీరు స్క్రీన్ రికార్డింగ్ చేస్తే అది అవ‌త‌లి వ్య‌క్తికి తెలియ‌దు.

ఇది గుర్తుపెట్టుకోండి!
ఒక వేళ మీరు స్క్రీన్​షాట్ తీసుకోవాల‌నుకున్నప్పుడు, కచ్చితంగా అవతలి వ్యక్తి ప్రైవ‌సీకి భంగం కలిగించకూడదు. ఒక‌రి వ్య‌క్తిగ‌త విష‌యాలు ఇంకొక‌రికి షేర్ చేయ‌కూడదు. స్క్రీన్​షాట్స్ తీసి వాటిని దుర్వినియోగం చేయ‌కూడ‌దు. ఒక వేళ తప్పుడు విషయాలకు స్క్రీన్​షాట్​లను వినియోగిస్తే, చట్టపరమైన శిక్షలకు గురికావాల్సి వస్తుందని గుర్తించుకోండి.

తాళం లేకుండానే మీ కారును లాక్​ & అన్​లాక్- ఎలాగో తెలుసా?

మెదడులో 'ఎలాన్ మస్క్​' చిప్- ఆలోచనలతోనే కంప్యూటర్​ను కంట్రోల్ చేసి చెస్​ గేమ్ - Neuralink Brain Chip Chess

ABOUT THE AUTHOR

...view details