తెలంగాణ

telangana

By ETV Bharat Tech Team

Published : 22 hours ago

Updated : 19 hours ago

ETV Bharat / technology

దేశంలోనే ఫస్ట్ ఎయిర్​ ట్రైన్- ఉచితంగానే ప్రయాణం- ప్రారంభం ఎప్పుడంటే? - India First Air Train

India First Air Train: దేశంలోనే ఫస్ట్ ఎయిర్​ ట్రైన్ సర్వీస్ త్వరలో ప్రారంభం కానుంది. డ్రైవర్ లేకుండానే పట్టాలపై పరుగులు తీయడం ఈ రైలు స్పెషాలిటీ. అంతేకాకుండా ఈ ఎయిర్​ ట్రైన్​లో ప్రయాణికులకు ఉచితంగానే ప్రయాణం కల్పించనున్నారు.

India First Air Train
India First Air Train (PTI)

India First Air Train:దేశంలోనే తొలి ఎయిర్ ట్రైన్ త్వరలో అందుబాటులోకి రానుంది. డ్రైవర్ లేకుండానే ఈ రైలు పట్టాలపై ఆటోమేటిక్​గా ప్రయాణించనుంది. అంతేకాక ఈ రైలులో ప్రయాణికులకు ఉచితంగానే ప్రయాణం కల్పించనున్నారు. ఈ ఎయిర్​ ట్రైన్ పట్టాలు ఎక్కితే ప్రయాణికులకు మరింత సులభంగా ప్రయాణం సాగించటం సాధ్యమవుతుంది. ఈ సందర్భంగా ఏంటీ ఎయిర్​ ట్రైన్? దీన్ని ఎక్కడ ప్రారంభించనున్నారు? వంటి వివరాలు మీకోసం.

దీన్ని ఎక్కడ ప్రారంభించనున్నారు?:

  • దిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మన దేశంలోనే అత్యంత రద్దీ అయిన ఎయిర్​పోర్ట్.
  • ఏటా 7 కోట్లకుపైగా ప్రయాణికులు ఈ ఎయిర్‌పోర్ట్‌ నుంచి రాకపోకలు సాగిస్తుంటారు.
  • వచ్చే 6 నుంచి 8 ఏళ్లలో ప్రయాణికుల సంఖ్య 13 కోట్లకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
  • దిల్లీ ఎయిర్‌పోర్టుకు వచ్చే వారిలో 25శాతం మంది ప్రయాణికులు టెర్మినల్ 1, టెర్మినల్ 2, టెర్మినల్ 3 మధ్య రాకపోకలు సాగిస్తూ ఉంటారు.
  • ఎయిర్‌పోర్టులో విమానం దిగిన ప్రయాణికులు బయటికి వచ్చేందుకు బస్సు సర్వీసులను ఉపయోగించాల్సి ఉంటుంది.
  • ప్రయాణికులు ఒక టెర్మినల్ నుంచి మరో టెర్మినల్‌కు వెళ్లేందుకు చాలా ఆలస్యం అవుతోంది.
  • ఈ నేపథ్యంలోనే దిల్లీ ఎయిర్‌పోర్టులోని 3 టెర్మినల్స్ మధ్య మొత్తం 7.7 కిలోమీటర్ల పొడవున ఈ ఎయిర్ ట్రైన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
  • ఎయిర్‌పోర్టులోని 3 టెర్మినళ్ల మధ్య ప్రయాణికుల ప్రయాణం సులభతరం చేసేందుకు రూ.2 వేల కోట్లతో ఈ ఎయిర్ ట్రైన్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
  • 2027 నాటికి ఈ ఎయిర్ ట్రైన్‌ను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
  • ఈ ఎయిర్ ట్రైన్‌ను ఆటోమేటెడ్ పీపుల్ మూవర్ (APM) అని కూడా పిలుస్తారు.
  • ఈ తొలి ఎయిర్ టైన్‌ ప్రాజెక్టుకు సంబంధించిన బిడ్లను ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో స్వీకరించనున్నారు.
  • ఇందులో ప్రాజెక్ట్ దక్కించుకున్న వారికి ఈ ఆర్థిక సంవత్సరం చివరిలోగా ప్రాసెస్ మొత్తం పూర్తి చేసి పనులు అప్పగించనున్నారు.

ఎయిర్​ ట్రైన్ ప్రత్యేకతలు:

  • ఈ ఎయిర్‌ ట్రైన్‌ అనేది పరిమిత సంఖ్యలో కంపార్ట్‌మెంట్‌లను కలిగి ఉంటుంది.
  • చూడటానికి మెట్రో రైలు మాదిరిగానే ఉండే ఈ ట్రైన్ డ్రైవర్ అవసరం లేకుండానే ట్రాక్​పై ఆటోమేటిక్‌గా ప్రయాణం చేస్తుంది.
  • నిర్ణీత ట్రాక్‌లో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సులువుగా, వేగంగా ప్రయాణించేందుకు ఉపయోగపడుతుంది.
  • దిల్లీ ఎయిర్‌పోర్టులోని ఇతర టెర్మినళ్లు, పార్కింగ్, క్యాబ్ పికప్ పాయింట్లు, హోటళ్లు మొదలైన వాటిని చేరుకోవడానికి ఈ ఎయిర్‌ ట్రైన్‌ను నడపనున్నారు.
  • ఈ ఎయిర్ ట్రైన్‌లో ఇంటర్నేషనల్ ప్రయాణికులకు ఉచితంగానే ప్రయాణాన్ని అందించనున్నారు.

సూసైడ్‌ మెషీన్​లో ఫస్ట్ డెత్!- పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు - Suicide Capsule

కళ్లు చెదిరే ఫీచర్లతో వివో సరికొత్త ఫోన్ లాంచ్- ధర ఎంతంటే? - Vivo V40e Launched

Last Updated : 19 hours ago

ABOUT THE AUTHOR

...view details