Huge Discounts on Samsung Phones:ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ తెచ్చింది. వినియోగదారుల కోసం శాంసంగ్ A సిరీస్‌లో అదిరిపోయే డిస్కౌంట్లను ప్రకటించింది. పాపుల్ ఫోన్స్ అయిన గెలాక్సీ A55, గెలాక్సీ A35 మోడల్స్‌పై లిమిటెడ్ పీరియడ్ డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ ఎన్నిరోజులు ఉంటుంది? ఏ మోడల్‌పై ఎంత ఆఫర్? డిస్కౌంట్స్ పొందాలంటే ఏం చేయాలి? వంటి వివరాలు మీ కోసం.
శాంసంగ్ గెలాక్సీ A55 మోడల్‌పై ఆఫర్ ఎంత?:
- గెలాక్సీ A55 మోడల్‌పై గరిష్ఠంగా రూ.6వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు.
- అంటే 8GB+128 స్టోరేజీ వేరియంట్లో ఈ మోడల్ మొబైల్ రూ.35,999కు లభిస్తుంది.
- ఈ మోడల్ మొబైల్‌ను హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ కార్డులతో కొనుగోలు చేయటం ద్వారా ఆఫర్ పొందొచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఏ55 ఫీచర్లు:ఈ ఏడాది మార్చిలో రిలీజైన ఈ ఫోన్ల స్పెసిఫికేషన్ల వివరాలు కింది విధంగా ఉన్నాయి.
- డిస్‌ప్లే: 6.6 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ సూపర్ అమోలెడ్
- ప్రాసెసర్:ఎగ్జినోస్ 1480
- మెయిన్ కెమెరా: 50 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా:32 ఎంపీ
శాంసంగ్ గెలాక్సీ A35 మోడల్‌పై ఆఫర్ ఎంత?:
- శాంసంగ్ గెలాక్సీ A35 మోడల్‌పై రూ.5వేలు వరకు డిస్కౌంట్ ఉంటుంది.
- అంటే కేవలం రూ.25,999లకే ఈ మోడల్ మొబైల్ కొనుగోలు చేయొచ్చు.