Best Recharge Plans Under 250: ఇటీవల చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి వద్దా స్మార్ట్‌ఫోన్ ఉంటోంది. అయితే ప్రస్తుతం రీఛార్జ్ పేరు ఎత్తగానే వినియోగదారులు భయపడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మన దేశంలో టాప్ టూ కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్‌తో పాటు మరికొన్ని కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్లను పెంచేశాయి.
దీంతో ఇప్పుడు యూజర్లకు తమ బడ్జెట్‌కు తగిన చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఎంచుకోవడం చాలా కష్టంగా మారింది. మీరు కూడా ఇలాంటి సమస్యతోనే ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్టోరీ. ఇందులో జియో, ఎయిర్‌టెల్ కంపెనీలకు చెందిన ప్రీపెయిడ్ ప్లాన్ల వివరాలు అందించాం. అది కూడా చౌక ధరలో అత్యంత ఉపయోగకరమైన ప్లాన్ల వివరాలు ఇచ్చాం. వీటిలో మీకు ఏ ప్లాన్ సరిగ్గా సెట్ అవుతుందో మీరే సెలక్ట్ చేసుకోండి.
జియో చీపెస్ట్ యూస్ఫుల్ ప్లాన్: జియో రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే అత్యంత ప్రజాదరణ పొందిన కేటగిరీ లిస్ట్‌లో జియో ఉంది. ఇక ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. వినియోగదారులకు రోజుకు 1GB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో రోజువారీ డేటా లిమిట్ అయిపోయిన తర్వాత యూజర్లు 64kbps వేగంతో డేటా సౌకర్యాన్ని పొందుతారు.
వీటితో పాటు ఈ ప్లాన్‌తో వినియోగదారులు అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSల సౌకర్యాన్ని కూడా పొందుతారు. అంతేకాక ఈ ప్లాన్‌తో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ కూడా పొందొచ్చు. అయితే ఈ ప్లాన్‌తో జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ మాత్రం ఉచితంగా అందుబాటులో లేదని గుర్తుంచుకోండి.
ఎయిర్‌టెల్ చీపెస్ట్ యూస్ఫుల్ ప్లాన్: ఎయిర్‌టెల్ కంపెనీ కూడా రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. కానీ దాని వ్యాలిడిటీ 24 రోజులు మాత్రమే. జియో రూ.249 ప్లాన్‌లో అయితే వినియోగదారులు 28 రోజుల వ్యాలిడిటీని పొందుతారు. అయితే ఎయిర్‌టెల్ ఈ రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్‌లో 24 రోజుల పాటు ప్రతిరోజూ 1GB డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌తో పాటు ప్రతిరోజూ 100 SMSల సౌకర్యం లభింస్తుంది. ఈ ప్లాన్‌తో మీరు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ యాప్ ఫ్రీ కంటెంట్‌ను కూడా పొందొచ్చు. కానీ ప్రీమియం కంటెంట్ ప్రయోజనాలు మాత్రం అందుబాటులో ఉండవు. అంతేకాక ఈ ప్లాన్‌తో వినియోగదారులు ఫ్రీ హలోట్యూన్స్ సౌకర్యాన్ని కూడా పొందొచ్చు.
అయితే మీకు ఎయిర్‌టెల్ ఇదే ప్రయోజనాలు 28 రోజుల వ్యాలిడిటీతో కావాలంటే మీరు రూ.299 ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్‌తో జియో మాదిరిగానే ఎయిర్‌టెల్ నుంచి సేమ్ బెనిఫిట్స్ అండ్ వ్యాలిడిటీ పొందొచ్చు. అయితే ఇందుకోసం అదనంగా రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.