తెలంగాణ

telangana

ETV Bharat / technology

గూగుల్​ మ్యాప్స్​లో AI ఫీచర్స్- ఇకపై ట్రిప్​ ప్లానింగ్ సూపర్ ఈజీ! - GOOGLE MAPS NEW AI FEATURES

గూగుల్ మ్యాప్స్​లో కొత్త ఫీచర్స్​- AI ద్వారా ట్రిప్స్​లో ఆ పనులు ఇంకా ఈజీ!

google maps
google maps (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Nov 2, 2024, 1:59 PM IST

Google Maps New AI Features : గూగుల్‌ మ్యాప్స్‌ వినియోగం ప్రస్తుతం అనివార్యంగా మారింది. తెలిసిన అడ్రస్​ను కూడా గూగుల్‌ మ్యాప్స్‌లో చూస్తూ వెళ్తున్న రోజులివి. జర్నీకి ఎంత టైమ్ పడుతుంది? ఏవైనా షార్ట్‌కర్ట్స్‌ ఉన్నాయా? లాంటి వివరాలను తెలుసుకుంటూ వెళ్లేందుకు మ్యాప్స్‌ను అనేక మంది ఉపయోగిస్తున్నారు. అయితే మ్యాప్స్ యాప్​ను వినియోగదారులకు మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చే ప్రయత్నంలో గూగుల్ కొంతకాలంగా కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ భాగస్వామ్యంతో వినియోగదారుల అవసరాలను తీర్చడానికి అనేక ఫీచర్స్​ను తీసుకొస్తున్నామని గూగుల్ ఇటీవల తెలిపింది. వాటి ద్వారా కొత్త ప్రాంతాల్లో పర్యటన మరింత సౌకర్యవంతం కానుంది. ఆ ఫీచర్స్ ఏంటంటే?

సాధారణంగా తెలిసిన రెస్టారెంట్​కు వెళ్లాలనుకుంటే ఆ పేరును మ్యాప్స్​లో సెర్చ్ చేసి అది చూపించిన రూట్ ద్వారా వెళ్లిపోతాం. అదే కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు మ్యాప్స్​లో రెస్టారెంట్స్ లేదా డేట్ నైట్ స్పాట్స్ అని సెర్చ్ చేస్తే ఆ ప్రాంతంలో ఉన్న బెస్ట్​ ఔట్​లెట్స్​ను ఇకపై చూపిస్తుంది. గ్రూప్ డిన్నర్​కు వెళ్లాలనుకన్నా సజెస్ట్ చేస్తోంది. రెస్టారెంట్‌లు, కేఫ్‌లను ఈజీగా పిన్ చేసి దారి చూపిస్తుంది.

ఎంజాయ్ చేయాల్సిన మూమెంట్స్ ఏంటి?
అవే కాకుండా ఏం చేయాలో తెలియకపోయినా ఇకపై గూగుల్ మ్యాప్స్ మీకు సహాయం చేస్తుంది. చలికాలంలో మనం వెళ్లబోయే ట్రిప్​లో ఎంజాయ్ చేయాల్సిన మూమెంట్స్ ఏంటి? ఏ ప్రదేశాలకు వెళ్తే సరదాగా గడపవచ్చు? బాగా ఎంజాయ్ చేయవచ్చు? ఒకవేళ వర్షం పడుతుంటే ఏం చేయాలి? అనే కొన్ని ప్రశ్నలకు కూడా మ్యాప్స్ సమాధానాలు ఇస్తుంది. వెళ్లే అవకాశం ఉన్న ప్రాంతాలను సజెస్ట్ చేస్తుంది.

వందల రివ్యూలను ఒకే చోట!
సాధారణంగా గూగుల్ ఇచ్చిన బోలెడు రివ్యూలను చూసి ట్రిప్​లో మనం ఎక్కడికి వెళ్లాలో చాలా మంది నిర్ణయించుకుంటాం. అన్నీ పరిశీలించి ఫిక్స్ అవుతాం. ఇకపై గూగుల్ మ్యాప్స్​ వందల రివ్యూస్​ను సమ్మరైజ్ చేస్తుంది. స్పష్టంగా చిన్న పేరాగ్రాఫ్​లో విషయాన్ని చెబుతుంది. దాని తర్వాత సమయం ఆదా అవుతుంది. అదే సమయంలో ఎక్కువ ప్రాంతాల గురించి తెలుసుకోవచ్చు.

వాతావరణ పరిస్థితులు కూడా!
కొన్ని టూరిస్ట్ స్పాట్​లు వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. క్లైమేట్ అనుకూలంగా లేకుంటే మనం ఎంజాయ్ చేయలేం. ఇకపై గూగుల్ మ్యాప్స్​లో వాతావరణ పరిస్థితిని కూడా తెలుసుకోవచ్చు. దాని బట్టి మనం సరైన రీతిలో ప్లాన్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనం వెళ్లాలనుకునే ప్రాంతంలో రద్దీ ఉందో లేదో కూడా గూగుల్ మ్యాప్స్ చెప్పేస్తుంది. అలా అనేక రకాల ఫీచర్స్​ను గూగుల్ అందుబాటులోకి తీసుకొస్తుంది.

ABOUT THE AUTHOR

...view details