తెలంగాణ

telangana

ETV Bharat / technology

మీ స్మార్ట్​ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? ఈ సింపుల్ టిప్స్​తో అంతా సెట్!

How To Stop Background Running Apps in Android : మీ స్మార్ట్​ఫోన్ ఛార్జింగ్ వేగంగా డ్రైన్​ అవుతోందా? అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ సింపుల్ ట్రిక్స్​తో మీ ఫోన్​ ఛార్జింగ్ ఎక్కువ టైమ్​ వచ్చేటట్లు చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దామా మరి.

smartphone power savining tips
How to Stop Background Apps

By ETV Bharat Telugu Team

Published : Feb 10, 2024, 7:22 AM IST

How To Stop Background Running Apps in Android : ప్రస్తుత కాలంలో చాలా మంది ఆండ్రాయిడ్​ ఫోన్​లను ఉపయోగిస్తున్నారు. అయితే కొన్నిసార్లు ఆండ్రాయిడ్ ఛార్జింగ్ చాలా ఫాస్ట్​గా డ్రైన్ అయిపోతుంది. మీకు కూడా ఇలాంటి సమస్యే ఎదురైందా? మన మొబైల్​ బ్యాక్​ గ్రౌండ్​లో రన్​ అవుతుండడం వల్ల ఇలా జరగడానికి ప్రధాన కారణమని టెక్​ నిపుణులు చెబుతున్నారు. మరి మన ఫోన్​ఛార్జింగ్​ ఎక్కువ సమయం రావాలంటే ఏం చేయాలి? ఫోన్ బ్యాక్​ గ్రౌండ్​ రన్నింగ్​ను ఏవిధంగా క్లోజ్ చేయాలి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

బ్యాంక్​ గ్రౌండ్​లో ఏయే యాప్​లు రన్​ అవుతున్నాయో తెలుసుకోవడం ఎలా?

  1. Settingsను ఓపెన్ చేసి స్క్రోల్​ డౌన్​ చేయండి.
  2. About Phone ఆప్షన్​పై క్లిక్ చేయండి.
  3. Software information ఆప్షన్​లోని Build Number ఆప్షన్​పై క్లిక్​ చేయండి.
  4. ఏడుసార్లు బిల్డ్​ నంబర్​ ఆప్షన్​పై క్లిక్ చేస్తే డెవలపర్​ ఆప్షన్లు ఎనెబుల్​ అవుతాయి.
  5. ఇప్పుడు మీ పిన్​ను ఎంటర్ చేయండి(డివైస్​ పాస్​కోడ్​)
  6. పాస్​కోడ్​ ఎంటర్ చేసిన వెంటనే మీకు You're now a developer అనే మెసేజ్​ వస్తుంది.
  7. స్క్రోల్​ డౌన్​ చేస్తే Running services అనే ఆప్షన్​ కనిపిస్తుంది. ఆ ఆప్షన్​పై క్లిక్ చేయండి. మీ రన్నింగ్ సర్వీసెస్​ ఆప్షన్​ కనిపిస్తుంది.
  8. ఆయా యాప్​ల మెమరీ యూసేజ్​ వివరాలు కూడా మీరు గమనించవచ్చు.
  9. మీ ఆండ్రాయిడ్​లోని బ్యాటరీ యూసేజ్ మెనూ లకి వెళ్లి ఏయే యాప్​లు ఎక్కువగా బ్యాటరీని ఉపయోగిస్తున్నాయో తెలుసుకోవచ్చు.

ఆండ్రాయిడ్​ యాప్స్​లో బ్యాంక్​గ్రౌండ్​ రన్నింగ్​ను ఆఫ్ చేయడం ఎలా?
ఏదైనా ఒకే యాప్​ వల్ల వేగంగా ఛార్జింగ్ అయిపోతున్నప్పుడు ఆ యాప్​ బ్యాక్​గ్రౌండ్​ను క్లోజ్​ చేయడానికి ఈ విధంగా చేయండి.

  • మొదట మీ స్మార్ట్​ఫోన్​లో సెట్టింగ్స్​ మెనూపై క్లిక్​ చేయండి.
  • సెట్టింగ్స్​లో APPS​ అనే ఆప్షన్​ను సెలక్ట్​ చేయండి.
  • మీరు యాప్​ బ్రాక్​గ్రౌండ్​ రన్నింగ్​ను స్టాప్ చేయాలనుకుంటున్న యాప్​ ఇన్ఫోపై క్లిక్​ చేయండి.
  • యాప్​ ఇన్ఫోలో Force stop అనే ఆప్షన్​ను ఎంచుకోండి.
  • కన్ఫామ్​ చేసేందుకు OK పై క్లిక్​ చేయండి.

Restrict Battery Usage for Apps
ఆండ్రాయిడ్​ ఫోన్​లో బ్యాటరీ ఛార్జింగ్ తరచూ డ్రైన్​ అయిపోతుంటే ఈ ఆప్షన్​ను ఉపయోగించుకోవచ్చు. మీరు అంతగా ఉపయోగించని యాప్​ల బ్యాక్ ​గ్రౌండ్​లో రన్​ అవుతూ ఉన్నట్లయితే ఛార్జింగ్ చాలా వేగంగా డ్రైన్​ అయిపోతుంది. అందువల్ల ఈ సూచనలు పాటించి అలా కాకుండా చేసుకోండి.

  • Settings యాప్​ను ఓపెన్ చేయండి
  • బ్రౌక్​గ్రౌండ్​ రన్నింగ్​ ఆఫ్ చేయాలనుకుంటున్న యాప్​పై క్లిక్​ చేయండి
  • APP Info ఆప్షన్​పై క్లిక్ చేయాలి
  • అక్కడ బ్యాటరీ ఆప్షన్​ కనిపిస్తుంది దానిపై క్లిక్​ చేయండి
  • Restricted అనే ఆప్షన్​ను సెలెక్ట్​ చేసుకోండి.

గమనిక : ఈ ఆప్షన్​ను ఉపయోగించడం వల్ల సంబంధిత యాప్​ నోటిఫికేషన్లు మీకు రావు. అందువల్ల ముఖ్యమైన యాప్​లకు ఈ ఆప్షన్​ను ఉపయోగించకపోవడమే మంచిది.

How To Enable the Adaptive Battery Feature

  • మీ ఆండ్రాయిడ్​లోని Settings​ యాప్​ను క్లిక్​ చేయండి
  • Battery ఆప్షన్​ను ఎంచుకోండి
  • త్రీ డాట్ మెనూపై క్లిక్​ చేసి Adaptive battery అనే ఆప్షన్​ను ఎంచుకొండి.
  • పైన వివరించిన పవర్​ సేవింగ్ ఆప్షన్ ఉపయోగించే క్రమంలో కొన్నిసార్లు మీ మొబైల్​కు నోటిఫికేషన్లు రాకపోయే అవకాశం ఉంది. కనుక మీకు అంతగా ముఖ్యం కానీ యాప్​ల విషయంలో మాత్రమే ఈ ఆప్షన్లను ఉపయోగించుకోవాలి.

మీ ఫోన్​ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా? ఈ ట్రిక్స్ పాటిస్తే ప్రాబ్లమ్ సాల్వ్!

ఐఫోన్​ 15 సిరీస్​ బ్యాటరీ లైఫ్​, ఛార్జింగ్​ స్పీడ్​పై టెక్​ లవర్స్​ అసంతృప్తి!..

ABOUT THE AUTHOR

...view details