Screen Time Reduction Tips:ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరి వద్దా స్మార్ట్‌ఫోన్ ఉంటుంది. మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించే వరకు ఇది పక్కన ఉండాల్సిందే. స్మార్ట్‌ఫోన్ అందుబాటులో లేకుంటే పూట గడవని పరిస్థితి. ఎంటర్‌టైన్‌మెంట్, పేమెంట్స్, షాపింగ్ అంటూ రోజులో చాలా సమయం మనకు తెలియకుండా మొబైల్‌లోనే గడిపేస్తున్నాం.
తీరా రాత్రి పడుకోబోయే ముందు అసలు ఎంతసేపు ఫోన్ ఉపయోగించామా? అంటూ స్క్రీన్ టైమ్ చూశాక కంగుతింటాం. దీంతో స్క్రీన్ టైమ్‌కు చెక్ పెట్టాలని చాలామంది భావిస్తుంటారు. మీరూ అదే ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే. మీ మొబైల్‌లో చిన్న సెట్టింగ్ మార్పుతో స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ టైమ్‌ను తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
సెట్టింగ్ మార్చటం ఎలాగంటే?:
- ఈ సెట్టింగ్ మార్చకోవటం కోసం మొదట మీ స్మార్ట్‌ఫోన్‌లో Settingsలోకి వెళ్లి Digital Wellbeing and Parental Controls అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అక్కడే రోజులో ఏ అప్లికేషన్‌ను ఎంత సమయం వినియోగించారో స్పష్టంగా కనిపిస్తుంది.
- ఆ స్క్రీన్‌ను అలా కిందకు స్క్రోల్ చేయగానే App Limits అనే ట్యాబ్ మనకు కనిపిస్తుంది.
- దానిపై క్లిక్ చేయగానే మీ మొబైల్‌లోని యాప్స్ అన్నీ కన్పిస్తాయి.
- అందులో మీరు ఏ అప్లికేషన్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారని భావిస్తున్నారో దాన్ని ఎంచుకొని దానికి స్క్రీన్ టైమ్‌ను సెట్ చేసుకోండి.
- ప్రతీ యాప్‌ను ఎంచుకొని ఇలా ప్రత్యేకంగా సమయాన్ని ఎంచుకోవచ్చు.
- ఆ రోజులో మీరు సెట్ చేసుకున్న టైమ్ లిమిట్ పూర్తయితే వెంటనే ఆ యాప్ గ్రే కలర్‌లోకి మారిపోతుంది.
- మళ్లీ మరుసటిరోజు మాత్రమే యాక్టివేట్ అవుతుంది.
- ఒకవేళ టైమ్ లిమిట్ పూర్తయినా కూడా మీరు యాప్ వినియోగించాలంటే తిరిగి సెట్టింగ్స్‌కు వచ్చి సమయాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది.
- ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.
ఈ పండగకి స్మార్ట్‌ఫోన్ కొనే ప్లాన్ చేస్తున్నారా?- 15వేల లోపు టాప్ ఇవే! - Best Smartphones Under 15K
ఈ పండగకి కొత్త స్మార్ట్‌ఫోన్ కొనే ప్లాన్‌లో ఉన్నారా?- ముందు వీటిని చెక్ చేయండి! - THINGS TO DO BEFORE BUYING PHONE