తెలంగాణ

telangana

ETV Bharat / technology

మీ గూగుల్ 'యాక్టివిటీ'ని​ డిలీట్​ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - How to Delete Google Search History - HOW TO DELETE GOOGLE SEARCH HISTORY

How to Delete Google Search History : గూగుల్​లో మీ పర్సనల్​ యాక్టివిటీకి సంబంధించిన డేటా మొత్తం స్టోర్ అవుతుంటుంది. దీని వల్ల కొన్ని సార్లు మీ ప్రైవసీ దెబ్బతినే అవకాశం ఉంది. అయితే ఈ డేటాను చాలా సులువుగా డిలీట్​ చేయవచ్చు? అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

How to Delete All My Activity and Google History
how to Delete my google activity by date or product (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 8, 2024, 10:13 AM IST

How to Delete Google Search History :మనకు ఏ చిన్న సందేహం వచ్చినా గూగుల్​ను ఆశ్రయిస్తుంటాం. ఇలా సెర్చ్ చేసినప్పుడు ఆటోమేటిక్​గా మన డేటా గూగుల్​లో సేవ్​ అయిపోతూ ఉంటుంది. అందువల్ల గూగుల్​కు మన గురించి అనేక విషయాలు తెలిసిపోతుంటాయి. దీని వల్ల మన ప్రైవసీకి భంగం ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే దీని కోసం మీరేమీ చింతించాల్సిన పనిలేదు. గూగుల్​లో స్టోర్ అయిన మన యాక్టివిటీని, సమాచారాన్ని చాలా సులువుగా డిలీట్ చేయవచ్చు.

సాధారణంగా గూగుల్ సైట్స్​, యాప్స్​ సేవలను వినియోగించినప్పుడు, మనకు సంబంధించిన యాక్టివిటీ మొత్తం Google Account లోని My Activityలో సేవ్​ అవుతాయి. ఇందులో స్టోర్​ అయ్యే మన పర్సనల్​ డేటాను ఎలా తొలగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండివిడ్యువల్​ యాక్టివిటీని డిలీట్​ చేయాలంటే?
Delete Individual Items :గూగుల్​ అకౌంట్​లోని My Activityలో సేవ్​ అయిన డేటాలో, మీరు కోరుకున్న ఇండివిడ్యువల్ ఐటెమ్​ను డిలీట్ చేయవచ్చు. లేదా మీరు కావాలనుకుంటే మొత్తం డేటాను కూడా డిలీట్ చేయవచ్చు. దీని కోసం,

  • ముందుగా myactivity.google.com.లోకి వెళ్లండి.
  • మీరు డిలీట్​ చేయాలనుకుంటున్న స్పెసిఫిక్​ ఐటమ్​ను సెలెక్ట్​ చేసుకోండి.
  • తరువాత డిలీట్​ బటన్​ను నొక్కండి.
  • అంతే సింపుల్​! మీరు తొలగించాలని అనుకున్న యాప్​ లేదా సైట్​కి సంబంధించిన సేవ్డ్​ హిస్టరీ మొత్తం డిలీట్ అయిపోతుంది.

అన్నింటినీ ఒకేసారి డిలీట్​ చేయాలంటే!
Delete It All : ఒకవేళ అన్ని సైట్స్, యాప్స్​లో ఉన్న మీ డేటా మొత్తాన్ని ఒకేసారి డిలీట్​ చేయలనుకుంటే,

  • ముందుగా myactivity.google.com లోకి వెళ్లండి.
  • స్క్రీన్​ టాప్​లో Your Activityపైన Delete ఆప్షన్​ ఉంటుంది. దానిపై ట్యాప్​ చేసి అక్కడే కనిపించే All Timeను సెలెక్ట్​ చేయండి.
  • అనంతరం Next>Deleteను నొక్కండి.
  • అంతే సింపుల్​! అప్పటి వరకు గూగుల్​లో సేవ్​ అయివున్న మీ యాక్టివిటీ వివరాలన్నీ డిలీట్​ అయిపోతాయి.

ఆటోమెటిక్​ డిలీషన్​
Set Up Automatic Deletion : మీరు ఇలా మాన్యువల్​గా కాకుండా, ఆటోమేటిక్​ మీ సెర్చ్​ యాక్టివిటీ డిలీట్​ అయ్యేలా చేసుకోవచ్చు. అది ఎలా అంటే?

  • మీ ఆండ్రాయిడ్​ ఫోన్​లోని సెట్టింగ్స్​ యాప్​ను ఓపెన్​ చేయండి.
  • ఇక్కడ Google > Manage Your Google Accountను సెలెక్ట్​ చేసుకోండి.
  • తరువాత Data & Privacy > History Settingsపై ట్యాప్​ చేయండి.
  • మీరు Auto-Delete చేయాలనుకుంటున్న Activityను సెలెక్ట్​ చేసుకోండి.
  • ఆ తర్వాత Auto-Deleteను ఎనేబుల్​ చేయండి.
  • ఈ క్రమంలో టైంఫ్రేమ్​ను కూడా ఎంచుకోండి. (అంటే ఎన్ని రోజులకోసారి మీరు డేటాను డిలీట్​ కావాలో సెలక్ట్ చేసుకోండి)
  • చివరగా Next > Confirmపై క్లిక్​ చేయండి.

మరి ఐఫోన్​లో ఎలా?
Delete My Activity On iphone : పైన తెలిపిన సెట్టింగ్స్​ అన్నీ మీకు iPhoneలోని Gmail యాప్​లో ఉంటాయి. ఇందులోకి వెళ్లి మీ పర్సనల్​ డేటాను గూగుల్​ నుంచి డిలీట్​ చేసుకోవచ్చు.

కంప్యూటర్​లో ఇలా!
Delete My Activity On Computer :వెబ్​ బ్రౌజర్​ ద్వారా Google Accountలోకి వెళ్లి, మీ యాక్టివిటీ డేటాను డిలీట్​ చేసుకోవచ్చు.

ఫోన్​ అడిక్షన్​తో బాధపడుతున్నారా? ఈ సింపుల్​ చిట్కాలతో సమస్యకు చెక్ పెట్టండి! - How To Overcome Phone Addiction

హై-స్పీడ్, బెస్ట్​​ పెర్ఫామెన్స్ ఇచ్చే​ బిజినెస్ ల్యాప్​టాప్​ కొనాలా? టాప్​ ఆప్షన్స్​ ఇవే! - Best Performance Laptops

ABOUT THE AUTHOR

...view details