తెలంగాణ

telangana

ETV Bharat / technology

స్పామ్ కాల్స్​/మెసేజ్​లతో విసిగిపోయారా? ట్రాయ్ DND యాప్​లో ఫిర్యాదు చేయండిలా! - How To Complain About Spam Calls - HOW TO COMPLAIN ABOUT SPAM CALLS

How To Complain About Spam Calls In India : మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్. స్పామ్ కాల్స్, మెసేజ్​లకు అడ్డుకట్టవేసేందుకు ట్రాయ్​ DND 3.0 అనే యాప్​ను తీసుకొచ్చింది. దీని ద్వారా స్పామ్ కాల్స్​, మెసేజ్​లపై ఎలా ఫిర్యాదు చేయాలో ఈ ఆర్టికల్​ ద్వారా తెలుసుకుందాం.

How to activate DND In your mobile
How to complain about spam calls (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 16, 2024, 12:30 PM IST

How To Complain About Spam Calls In India : మొబైల్‌ ఫోన్ వాడే వారిని ప్రధానంగా వేధించే సమస్యలో స్పామ్‌ కాల్స్‌ ఒకటి అని చెప్పొచ్చు. ముఖ్యమైన పనిలో ఉండగా గుర్తు తెలియని నంబర్ల నుంచి ఈ తరహా కాల్స్‌ వచ్చి విసిగిస్తుంటాయి. ఇందులో కొన్ని వాయిస్‌ కాల్స్‌ కాగా, మరికొన్ని రికార్డెడ్‌ కాల్స్‌ లేదా రోబో కాల్స్ అయ్యుంటాయి. ఆ నంబర్​ను బ్లాక్ చేసినా, వేరే నంబర్‌ నుంచి స్పామ్ కాల్స్ వస్తుంటాయి. దీని వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఈ స్పామ్ కాల్స్​ను అరికట్టేందుకు ట్రాయ్‌ ఓ యాప్​ను తీసుకొచ్చింది. అదే డీఎన్​డీ 3.0 (DND 3.0). మరి ఈ యాప్​ను ఎలా ఉపయోగించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

డీఎన్​డీ 3.0 యాప్​ను వాడే ప్రాసెస్ ఇదే!

  • ఆండ్రాయిడ్‌ యూజర్లు డీఎన్​డీ 3.0 యాప్​ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి డౌన్​లోడ్‌ చేసుకోవాలి.
  • ఆ తర్వాత కాల్స్, మేసేజ్​లు, కాంటాక్టులు తదితర అవసరమైన పర్మిషన్లు ఇవ్వాలి.
  • ఆ తర్వాత ఓటీపీ వెరిఫికేషన్​తో లాగిన్‌ కావాల్సి ఉంటుంది.
  • యాప్​లోకి లాగిన్ అయిన తరువాత మీకు నచ్చిన డీఎన్‌డీ ప్రిఫరెన్సులను ఎంచుకోవచ్చు.
  • బ్యాంకింగ్‌/ ఇన్సూరెన్స్‌, రియల్‌ ఎస్టేట్‌, ఎడ్యుకేషన్‌, హెల్త్‌ ఇలా నచ్చిన కేటగిరీని ఎంచుకోవచ్చు.
  • అప్పుడు మీరు ఎంచుకున్న కేటగిరీ నుంచి మాత్రమే మీకు కాల్స్‌ వస్తాయి. మిగతా కేటగిరీల కాల్స్​ మీకు రాకుండా ఉంటాయి.
  • ఒక వేళ అప్పటికీ మీకు స్పామ్ కాల్స్/ మెసేజులు వస్తుంటే, రిపోర్ట్‌ యూసీసీ అనే ఆప్షన్‌ ద్వారా సదరు ఫోన్​ నంబర్​పై టెలికాం సర్వీసు ప్రొవైడర్​కు ఫిర్యాదు చేయాలి.
  • వాయిస్‌, SMSలపై కంప్లైంట్ చేయాలనుకుంటే, ఆ ఆప్షన్​పై క్లిక్‌ చేయగానే మీ కాల్‌/ మెసేజ్‌ హిస్టరీ ఓపెన్‌ అవుతుంది. అక్కడి నుంచే ఈజీగా కంప్లైంట్ చేయవచ్చు.

బగ్స్ ఉన్నాయ్​!
వాస్తవానికి డీఎన్​డీ 3.0 యాప్​ను చాలా రోజుల క్రితమే ట్రాయ్​ తీసుకువచ్చింది. కానీ ఇందులోని బగ్స్​పై యూజర్ల నుంచి తీవ్రమైన అసంతృప్తి వచ్చింది. దీంతో ట్రాయ్‌ సెక్రటరీ రఘునందన్‌ ఓ సందర్భంలో దీనిపై స్వయంగా స్పందించాల్సి వచ్చింది. బగ్స్‌ ఉన్నమాట వాస్తవమేనని, వాటిని తొలగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఫలితంగా ఇప్పుడు ఈ డీఎన్​డీ యాప్​ సేవల్లో మెరుగుదల కనిపిస్తోంది. కంప్లైంట్ చేసిన తర్వాత, సదరు స్పామర్స్​పై ఏమేం చర్యలు తీసుకున్నారో, ఆ వివరాలు యాప్​లోనే చూపిస్తున్నారు. అయితే స్టేటస్‌ తెలుసుకునే విషయంలో, కాల్‌ హిస్టరీ చూసే విషయంలో ఇంకా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నట్లు కొంత మంది యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details