AB PM JAY Yojana:ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PM JAY) అనేది సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాలకు నాణ్యమైన ఆరోగ్య భద్రతను అందించేందుకు భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక ముఖ్యమైన కార్యక్రమం. ఈ పథకం కింద అర్హత కలిగిన కుటుంబం ఆసుపత్రిలో సంవత్సరానికి రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్సను పొందవచ్చు. ఈ నేపథ్యంలో ఈ పథకానికి ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వంటి పూర్తి వివరాలు మీకోసం.
Check Eligibility:
- ఈ పథకం సామాజిక-ఆర్థిక కుల గణన (SECC) 2011కి వర్తిస్తుంది.
- ఈ పథకానికి అప్లై చేసేందుకు అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
- హోమ్ పేజీలో https://pmjay.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించిన తర్వాత ఎలిజిబిలిటీ బటన్‌పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మీ ఆధార్‌కు లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ లేదా SECC పేరును ఎంటర్ చేయాలి.
- వివరాలను సబ్మిట్ చేసిన తర్వాత మీకు OTP వస్తుంది.
- ఈ స్కీమ్‌కు మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు అందులో కన్పిస్తాయి.
Required Documents:ఈ పథకానికి మీరు అర్హత కలిగి ఉంటే అప్లికేషన్ కోసం అవసరమైన పత్రాలు ఉన్నాయో లేదా చూసుకోవటం ముఖ్యం.
- Aadhaar Card: ఐడెంటిఫికేషన్, వెరిఫికేషన్ కోసం ఆధార్ కార్డ్ ఉండాలి.
- Ration Card: మీ ఫ్యామిలీ డిటెయిల్స్ సబ్మిట్ చేసేందుకు రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డులో ఉన్న సభ్యులందరికీ ఈ పథకం వర్తిస్తుంది.
- Other ID Proof:ఒకవేళ మీ వద్ద ఆధార్ కార్డు అందుబాటులో లేకుంటే ఓటర్ ID, PAN కార్డ్ లేదా పాస్‌పోర్ట్ ఫొటో వంటి ప్రభుత్వ ID ప్రూఫ్స్‌ను ఉపయోగించొచ్చు.
అప్లై చేసుకోవటం ఎలా?:
- ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హత కలిగిన లబ్ధిదారులు సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ని సందర్శించాలి.
- ఈ కేంద్రాలలో శిక్షణ పొందిన సిబ్బంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో మీకు సహాయం చేస్తారు.
- PM-JAY పోర్టల్‌లో అందుబాటులో ఉన్న అధికారిక CSC లొకేటర్‌ని సందర్శించడం ద్వారా మీకు సమీపంలో ఉన్న CSC సెంటర్‌ను గుర్తించొచ్చు.
- CSCలో ఆపరేటర్ మీ ఎలిజిబిలిటీని వెరిఫై చేస్తారు.
- ఆపై అప్లికేషన్‌ను ఫిల్ చేయటంలో మీకు సహాయం చేస్తారు.