Android Smartphones Hidden Features: ప్రస్తుతం చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి వద్దా స్మార్ట్‌ఫోన్ ఉంటోంది. అయితే కొంతమంది వాటిని కేవలం కాల్స్, మెసెజెస్ కోసం మాత్రమే వినియోగిస్తుంటారు. మరికొందరు అయితే యూట్యూబ్ వీడియోస్, ఇన్‌స్టా రీల్స్ వరకు మాత్రమే పరిమితం. కానీ ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో మనకు తెలియని ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.
స్పామ్ టెక్స్ట్‌లను బ్లాక్ చేయటం:ప్రస్తుతం టెలికాం యూజర్లను స్పామ్ కాల్స్, మెసేజ్‌ల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. అయితే ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో ఉండే ఈ ఫీచర్‌తో స్పామ్ కాల్స్, మెసెజెస్ రాకుండా బ్లాక్ చేసుకోవచ్చు. ఇందుకోసం మెసెజెస్ యాప్ ఓపెన్ చేసి మూడు డాట్స్ ఐకాన్‌ను ట్యాప్ చేసి సెట్టింగ్స్‌ను ప్రెస్ చేయండి. ఆ తర్వాత Spam Protectionను సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు Enable Spam Protection ఆప్షన్‌ను ఆన్ చేసుకుంటే మీ సెట్టింగ్ పూర్తవుతుంది.
వైఫై పాస్‌వర్డ్ షేర్ చేయకుండానే:ఎవరికైనా మనం Wi-Fi షేర్ చేయాల్సి వస్తే పాస్‌వర్డ్ చెప్పాలి. లేకుంటే వారి మొబైల్‌ను తీసుకుని మనం అయినా ఎంటర్ చేయాల్సి వస్తుంది. పాస్‌వర్డ్ వేరే వారితో షేర్ చేసుకోవాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అయితే అలాంటి సమయంలో QR కోడ్ స్కాన్ చేస్తే చాలు పాస్‌వర్డ్‌తో పనిలేదు. ఇందుకోసం సెట్టింగ్స్‌లో Connections > Wi-Fi > Current Network > QR code option మీద క్లిక్ చేయగానే మీ Wi-Fi తాలూగా QR కోడ్ కనిపిస్తుంది. పాస్‌వర్డ్ ఇవ్వాల్సిన సమయంలో వారి మొబైల్ నుంచి కోడ్‌ని స్కాన్ చేస్తే చాలు. అయితే ఈ ఆప్షన్ ఒక్కో మొబైల్లో ఒక్కోలా ఉంటుంది. చాలా వరకు స్మార్ట్ఫోన్లలో ఈ ఫెసిలిటీ ఉంది.
స్మార్ట్ లాక్: మీ ఫోన్‌ను లాక్ చేయడం అనేది ఒక ముఖ్యమైన భద్రతా ప్రమాణం. అయితే విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు ఇది మీకు తలనొప్పిగా మారే అవకాశం ఉంది. అలాంటి సమయంలో మీరు సురక్షితంగా భావించే ప్రదేశాల్లో మీ లాక్ స్క్రీన్‌ను డిసేబుల్ చేసేయొచ్చు. ఆండ్రాయిడ్‌లో ఉన్న ఈ ఫెసిలిటీతో మీరు మొబైల్‌ను ఈజీగా ఓపెన్ చేయొచ్చు. ఈ ఫీచర్ గూగుల్ మ్యాప్స్‌తో పనిచేస్తుంది. కాబట్టి మీకు ఖచ్చితంగా ఆ ప్రదేశంలో ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం.