తెలంగాణ

telangana

ETV Bharat / technology

స్పామ్ కాల్స్ వేధిస్తున్నాయా?- డోంట్​ వర్రీ- కేంద్రం పక్కా స్కెచ్​తో వచ్చిందిగా..! - SPAM TRACKING SYSTEM

స్పామ్ ట్రాకింగ్ సిస్టమ్ తీసుకొచ్చిన కేంద్రం- ఇక ఫేక్ కాల్స్​ టెన్షన్​కు ఫుల్​స్టాప్!!!

Spam Tracking System
Spam Tracking System (IANS)

By ETV Bharat Tech Team

Published : Oct 23, 2024, 11:10 AM IST

Spam Tracking System:దేశంలో సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో రోజుకో వేషంతో సైబర్ మోసగాళ్లు అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ మధ్య కొన్ని కొత్త నంబర్ల నుంచి వస్తున్న కాల్స్‌ను గుర్తించడం చాలా కష్టంగా మారింది. ఒకవేళ పొరపాటున ఈ నంబర్ల నుంచి వచ్చిన కాల్స్‌ లిఫ్ట్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చామో ఇక అంతే. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త 'స్పామ్ ట్రాకింగ్ సిస్టమ్'​ను తీసుకొచ్చింది.

ఈ సిస్టమ్​ ఇండియన్ నంబర్లతో వచ్చే ఇంటర్నేషనల్ ఫేక్ కాల్స్​ను ఆటోమేటిక్​గా బ్లాక్​ చేసేస్తుంది. దీంతో అమాయకులు మోసపోకుండా ఉండొచ్చు. ప్రభుత్వం మంగళవారం తీసుకొచ్చిన ఈ కొత్త ట్రాకింగ్ సిస్టమ్ అద్భుతంగా పనిచేయడం ప్రారంభించింది. దీన్ని తీసుకొచ్చిన 24 గంటల్లోనే ఇది దాదాపు 1.35 కోట్లు లేదా 90 శాతం ఇన్‌కమింగ్ ఇంటర్నేషనల్ ఫేక్ కాల్స్​ను గుర్తించింది. దీంతో టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు (TSPs) ఆ స్కామ్ కాల్స్ ఇండియన్ టెలికాం సబ్​స్క్రైబర్లకు రాకుండా బ్లాక్ చేయగలిగారు.

ఎలా మోసం చేస్తారంటే?:సైబర్ నేరగాళ్లు ఇండియన్ మొబైల్ నంబర్​ +91 నంబర్​తో ఇంటర్నేషనల్ ఫేక్కాల్స్ చేస్తారు. అవి మనకు దేశీయ కాల్స్​గానే కన్పిస్తాయి. కానీ వాస్తవానికి కాలింగ్ లైన్ ఐడెంటిఫికేషన్ (CLI) మార్చడం ద్వారా విదేశాల నుంచి కాల్స్ చేయగలుగుతారు. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు లేదా ఇతర నమ్మదగిన సంస్థల నుంచి చేస్తున్నట్లు నమ్మిస్తారు. దీంతో ఇది నిజమేనని నమ్మి వ్యక్తిగత సమాచారాన్ని పంచుకుని అమాయక ప్రజలు మోసపోతున్నారు.

కంప్లయింట్ చేయండిలా?:సైబర్ నేరాలను ఆపేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కేటుగాళ్లు మళ్లీ ఏదో ఒక కొత్త మార్గంలో మోసాలకు పాల్పడే అవకాశాలున్నాయి. అలాంటి సందర్భాల్లో కేంద్రం ప్రభుత్వం ఇంతకుముందు తీసుకొచ్చిన సాతి వెబ్‌సైట్‌లో చక్షు (Chakshu) పోర్టల్​ను సందర్శించొచ్చు. ఈ పోర్టల్​లో ఫేక్ కాల్స్, మెసేజెస్​పై కంప్లయింట్ చేయొచ్చు. ఈ పోర్టల్​లో ఫిర్యాదు చేయడం వల్ల ఇతరులు కూడా వారిలా సైబర్ మోసగాళ్ల వలలో పడకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు సహాయపడొచ్చు.

ఫేస్​బుక్​, ఇన్​స్టాలో ఫేషియల్ రికగ్నైజేషన్​ ఫీచర్​- ఇకపై ఆన్​లైన్​ మోసాలకు చెక్​..!

స్మార్ట్​ఫోన్ యూజర్స్​కు బంపర్​ ఆఫర్- వాటికి లైఫ్​ టైమ్​ ఫ్రీ స్క్రీన్​ రీప్లేస్మెంట్..!

ABOUT THE AUTHOR

...view details