తెలంగాణ

telangana

ETV Bharat / technology

ఇండియాలో గూగుల్ జెమినీ యాప్ లాంఛ్​​ - తెలుగు సహా 10 భాషలకు సపోర్ట్ - డౌన్​లోడ్ చేసుకోండిలా! - Google Gemini Android App

Google Gemini App : ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ గూగుల్ 'జెమినీ ఏఐ యాప్'​ను భారత ఆండ్రాయిడ్​ ఫోన్​ యూజర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది. ఇది తెలుగు, హిందీ, ఇంగ్లీష్​ సహా మొత్తం 10 భాషలకు సపోర్ట్ చేస్తుంది. త్వరలో ఐఫోన్​ యూజర్లకు కూడా ఈ యాప్​ను అందుబాటులోకి తేనున్నట్లు గూగుల్ తెలిపింది. పూర్తి వివరాలు మీ కోసం.

Gemini app language support
Google's Gemini app (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jun 18, 2024, 4:00 PM IST

Google Gemini App : గూగుల్ కంపెనీజెమినీ ఏఐ యాప్​ను భారత ఆండ్రాయిడ్​ ఫోన్​ యూజర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది. ఇది తెలుగు, హిందీ, ఇంగ్లీష్​ సహా మొత్తం 10 భాషలకు సపోర్ట్ చేస్తుంది. త్వరలో ఐఫోన్​ యూజర్లకు కూడా ఈ యాప్​ను అందుబాటులోకి తేనున్నట్లు గూగుల్ తెలిపింది.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్​ (AI) రంగంలో గూగుల్‌ దూసుకెళ్తోంది. గతేడాది చివర్లో జెమిని (Gemini AI) పేరుతో అత్యంత అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ ఏఐ టూల్‌ను ప్రవేశపెట్టింది. క్రమేణా దానికి పలు ఫీచర్లను జోడిస్తూ వస్తోంది. తాజాగా జెమిని ఆండ్రాయిడ్​ మొబైల్‌ యాప్‌ను భారత్‌లో లాంఛ్ చేసింది. ఈ అప్లికేషన్ ప్రస్తుతం భారత్​లోని ఆండ్రాయిడ్​ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్​, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళం, ఉర్దూ - ఇలా మొత్తం 10 భాషలకు సపోర్ట్‌ చేసేలా దీన్ని రూపొందించింది. అంటే ఇప్పుడు మీకు నచ్చిన భాషలో జెమినీ ఏఐను యాక్సెస్‌ చేయొచ్చన్నమాట.

‘‘జెమినిలో స్థానిక భారతీయ భాషలను జోడించాం. ఇప్పుడు గూగుల్‌ మెసేజెస్‌లో కూడా జెమినీ ఏఐను వినియోగించుకోవచ్చు. రానున్న రోజుల్లో మరిన్ని సరికొత్త ఫీచర్లను దీనికి జోడించనున్నాం’’ అని ఆల్ఫాబెట్, గూగుల్‌ సీఈఓ సుందర్ పిచాయ్ ‘ఎక్స్‌’ ప్లాట్​ఫామ్​లో పోస్ట్‌ చేశారు.

ఐఫోన్ యూజర్లకు కూడా
జెమినీ యాప్​లో మీకు నచ్చిన ఏ అంశం గురించి అయినా సెర్చ్ చేయవచ్చు. దీని కోసం మీ ప్రశ్నను టైప్‌ చేయొచ్చు లేదా వాయిస్‌ అసిస్టెంట్‌ను ఉపయోగించవచ్చు. లేదా ఫొటో సాయంతో కూడా సెర్చ్​ చేసుకునే సదుపాయం ఉంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ యూజర్లకు మాత్రమే పరిమితమైన ఈ యాప్‌ను, రానున్న రోజుల్లో ఐఫోన్‌ వినియోగదారులకు కూడా అందుబాటులోకి తేనున్నామని గూగుల్ పేర్కొంది. ొక వేళ యూజర్లకు మరిన్ని అదనపు ఫీచర్లు కావాలంటే, జెమిని అడ్వాన్స్‌ ప్రీమియం వెర్షన్​ను తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇందుకు కొంత మొత్తం రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఫైల్‌ అప్‌లోడ్‌, డేటా అనలైజ్‌ వంటి ఫీచర్లు ఉంటాయని తెలిపింది.

డౌన్​లోడ్ చేసుకోండిలా!
గూగుల్ ప్లేస్టోర్​ నుంచి జెమిని ఆండ్రాయిడ్ యాప్​ను డౌన్​లోడ్ చేసుకోవచ్చు. దీనిని ఇన్​స్టాల్​ చేసిన తరువాత గూగుల్ అసిస్టెంట్​ను వదిలి జెమినీకి స్విచ్​ కావాలో, వద్దో యూజర్లే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అంటే గూగుల్ అసిస్టెంట్ వాడాలో, జెమిని ఏఐ యాప్​ను వాడాలో మీరే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.


ఫోన్ యూజర్స్​ అందరికీ ఉపయోగపడే​ - ఈ టాప్ 8​ టిప్స్ & ట్రిక్స్ ఇవే! - Useful Phone Tricks

గూగుల్ క్రోమ్ నయా ఫీచర్​ - ఇకపై వెబ్​ పేజ్​లు చదవాల్సిన పనిలేదు - నేరుగా వినేయడమే! - Google Chrome Features

ABOUT THE AUTHOR

...view details