Google Wallet Work In India : టెక్ దిగ్గజం గూగుల్ ఎప్పటికప్పుడు సరికొత్త సేవలను పరిచయం చేస్తూ నెటిజన్లు ఆకట్టుకుంటోంది. అందులో ఒకటి గూగుల్ వాలెట్. గూగుల్ వాలెట్ యాప్ అందరి దృష్టిని ఆకర్షించింది. గూగుల్ వాలెట్ అనేది సాధారణంగా మీ వాలెట్ లేదా పర్స్‌లో తీసుకెళ్లే క్రిడిట్, డెబిట్ కార్డులు, ఈవెంట్ టిక్కెట్స్, ఎయిర్‌లైన్ బోర్డింగ్ పాసులు, స్టూడెంట్ ఐడీ వంటి వాటిని గూగుల్ వాలెట్లో డిటిజల్ వెర్షన్లో స్టోర్ చేసుకోవచ్చు. అలా మీరు క్రెడిట్, డెబిట్ కార్డ్స్ కోసం ప్రత్యేకంగా పర్సు తీసుకెళ్లాల్సిన అవసరం రాదు.
ఈ యాప్ సేవలను గూగుల్ ఇప్పటికే కొన్ని దేశాల్లో అందిస్తోంది. అయితే భారతదేశంలో మాత్రం గూగుల్ వాలెట్ సర్వీసులు అందుబాటులో లేవు. అయినప్పటికీ కొంతమంది యూజర్లు థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా గూగుల్ వాలెట్ సేవలను వినియోగించుకుంటున్నారు.
అయితే గత మూడు నెలలుగా కొంతమంది ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ వాలెట్‌ను తమ ఫోన్లలో వాడుతున్నట్లు చెబుతున్నారు. ఈ యాప్ ద్వారా కొన్ని చెల్లింపులు, రివార్డులు, పాస్‌లు, టిక్కెట్లను WearOS అనే థర్డ్ యాప్ సాయంతో వాడుతున్నట్లు తెలిపారు. అయితే గూగుల్ వాలెట్ భారత్‌లో మాత్రం అధికారికంగా అందుబాటులో లేదు.