Google Releases Android 15 : గూగుల్ కంపెనీ ఆండ్రాయిడ్ 15 గురించి పెద్ద అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతానికి ఫస్ట్ డెవలపర్ ప్రివ్యూను మాత్రమే రిలీజ్ చేసిన గూగుల్, త్వరలోనే దీని సెకండ్ ప్రివ్యూ, బీటా వెర్షన్లను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. గూగుల్ కంపెనీ ఈ ఆండ్రాయిడ్ 15 అప్డేట్లో 3 కీలకమైన అంశాలపై దృష్టి కేంద్రీకరించింది. అవి ఏమిటంటే,
- ప్రైవసీ/సెక్యూరిటీ ఇంప్రూవ్మెంట్
- సపోర్టింగ్ క్రియేటర్స్ అండ్ డెవలపర్స్
- మాక్సిమైజింగ్ యాప్ పెర్ఫార్మెన్స్
Android 15 Special Features :
- ప్రైవసీ/ సెక్యూరిటీ : గూగుల్ కంపెనీ యూజర్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్పై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. అందులో భాగంగానే ఆండ్రాయిడ్ ఏడీ సర్వీసెస్‌ను ఎక్స్టెన్షన్ లెవల్ 10 వరకు పెంచుతోంది. దీని వల్ల యూజర్ల ప్రైవసీ మెరుగుపడుతుంది. పైగా మొబైల్ యాప్స్‌లో యూజర్లకు అవసరమైన పర్సనలైజ్డ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడానికి వీలవుతుంది.
- స్క్రీన్ షేరింగ్ : ప్రస్తుతానికి మనం ఫుల్ స్క్రీన్‌ను మాత్రమే షేర్ చేయగలుగుతున్నాము. అదే ఆండ్రాయిడ్ 15 ద్వారా పార్షియల్ స్క్రీన్ షేరింగ్ కూడా చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.
- హెల్త్ కంటెంట్ : గూగుల్ కంపెనీ ఆండ్రాయిడ్ 15 అప్డేట్లో హెల్త్ కనెక్ట్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా యూజర్లకు ఉపయోగపడే ఫిట్నెస్, న్యూట్రిషన్ డేటాను ఇచ్చేందుకు కృషి చేస్తోంది.
- మాల్వేర్ డిటెక్షన్ : నేడు సైబర్ నేరగాళ్లు మాల్వేర్లను చొప్పించి యూజర్ల డేటాను దొంగిలిస్తున్నారు. దీనిని అరికట్టేందుకు ఆండ్రాయిడ్ 15లో సెక్యూరిటీ మెజర్స్‌ను పెంచుతున్నారు. దీని వల్ల మాల్వేర్ల నుంచి మన ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లోని డేటాకు రక్షణ ఏర్పడుతుంది.
- కెమెరా ఛేంజెస్ : ఆండ్రాయిడ్ 15లో అనేక కెమెరా ఛేంజెస్ కూడా చేస్తున్నారు. దీనితో తక్కువ వెలుతురులోనూ, కెమెరా ప్రివ్యూ బ్రైట్నెస్ పెంచుకోవచ్చు. కెమెరా ఫ్లాష్‌ను కూడా కంట్రోల్ చేయవచ్చు.
- మ్యూజిక్ క్రియేటర్స్ కోసం : గూగుల్ కంపెనీ మ్యూజిక్ క్రియేటర్ల కోసం ఆండ్రాయిడ్ 15లో UMP సపోర్ట్ కూడా కల్పిస్తోంది. దీని ద్వారా వర్చువల్ ఎంఐడీఐ యాప్స్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. మ్యూజిక్ కంపొజిషన్, సింథసైజర్ యాప్‌లను చక్కగా వాడుకోవచ్చు.
- సూపర్ పెర్ఫార్మెన్స్ కోసం : ఆండ్రాయిడ్ 15ను 'ఆండ్రాయిడ్ డైనమిక్ పెర్ఫార్మెన్స్ ఫ్రేమ్‌వర్క్' (ADPF)కు అప్డేట్ చేస్తున్నారు. దీని వల్ల బ్యాక్‌గ్రౌండ్ వర్క్ లోడ్ ఎంత ఎక్కువ ఉన్నా, యాప్ పెర్ఫార్మెన్స్ ఏ మాత్రం తగ్గదు. అంతేకాదు దీనిలో థర్మల్ థ్రోట్లింగ్ను తగ్గించే థర్మల్ థ్రెషోల్డ్స్ కూడా ఉన్నాయి.
ఆండ్రాయిడ్ 15 రిలీజ్ డేట్
ఆండ్రాయిడ్ ఫస్ట్ ప్రివ్యూ ఇప్పటికే విడుదలైంది. మార్చి నెలలో సెకండ్ డెవలపర్ ప్రివ్యూ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. బీటా వెర్షన్ మాత్రం ఏప్రిల్-జులై నెలల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక పుల్ ఆండ్రాయిడ్ 15 వెర్షన్ అనేది బహుశా ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ గూగుల్ మాత్రం రిలీజ్ డేట్‌పై ఎలాంటి ప్రకటన చేయలేదు.