Google Find My Device Network : పొగొట్టుకున్న, స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్‌ను చాలా సులువుగా కనిపెట్టేందుకు గూగుల్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ ఫీచర్‌ను 'ఫైండ్ మై డివైజ్ నెట్వర్క్'ను ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో సోమవారం ప్రారంభించింది. అయితే ప్రస్తుతానికి కెనడా, అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను, త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తామని గూగుల్ తెలిపింది. ఈ ఫీచర్‌తో పొగొట్టుకున్న ఫోన్‌ను చాలా సులువుగా కనిపెట్టేయవచ్చు. అలాగే ఒకవేళ దొంగలు మీ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసినా సరే దానిని ట్రాక్ చేసేవచ్చు. అది కూడా ఇంటర్నెట్, వైఫై కనెక్షన్ లేకపోయినా బ్లూటూత్‌ని ఉపయోగించి ట్రాక్ చేసేలా ఈ కొత్త అప్డేట్ను తీసుకొచ్చింది గూగుల్.
ఈ ఫీచర్ ఉపయోగించి ఆండ్రాయిడ్ ఫోన్స్, ట్యాబ్లెట్స్ మాత్రమే కాదు, వాటితో పెయిర్ చేసిన ఇయర్‌బడ్స్, హెడ్‌ఫోన్స్‌ను కూడా ట్రాక్ చేసుకోవచ్చట. అంతేకాదు ఆండ్రాయిడ్ ఫోన్‌తో లింక్ చేసి ఉన్న వాలెట్స్, కీస్, బైక్‌లను కూడా సులువుగా కనిపెట్టేయవచ్చని గూగుల్ చెబుతోంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 9 నంచి ఆపై వెర్షన్లు ఉన్న మొబైళ్లలో మాత్రమే అందుబాటలో ఉంటుంది. పొగొట్టుకున్న వస్తువులను గుర్తించడానికి ఈ ఫీచర్లో ఐదు రకాలు మార్గాలు ఉన్నాయి. అవేంటంటే.
Locate offline devices: ఆండ్రాయిడ్ ఫోన్, ట్యాబ్లెట్‌ను ఫైండ్ మై డివైజ్‌ను ఆన్ చేయటం వల్ల ఇంటర్నెనెట్ కనెక్షన్ లేకపోయినా గుర్తించవచ్చు. అయితే పిక్సల్ 8, పిక్సల్ 8ప్రో వినియోగదారులకు మాత్రం, మొబైల్ స్వీఛ్ ఆఫ్ అయినా సరే ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది.
Compatible Bluetooth Tags( బ్లూటూత్ ట్యాగ్లు) : చిపోలో, పెబుల్బీ (ట్రాకర్ డివైజ్ కంపెనీలు) లాంటి వాటితో రూపొందించిన బ్లూటూత్ ఆధారిత ట్రాకర్ ద్వారా ట్యాగ్ చేసిన కీస్, వాలెట్స్, లగేజీ వంటి వస్తువులను కూడా గుర్తించవచ్చు. అలాగే బ్లూటూత్ ట్యాగ్ వినియోగదారులను ఏవరైనా ట్రాక్ చేస్తున్నట్లయితే వారిని హెచ్చరించేలా unknown tracker alerts ఆప్షన్ కూడా ఉంది.
Find Nearby Items : వినియోగదారులు వారు పోగొట్టుకున్న వస్తువు దగ్గరగా ఉండి, దాన్ని ట్రాక్ చేయటంలో ఇబ్బంది ఉన్నప్పుడు, 'ఫైండ్ నియర్‌బై' బటన్ నొక్కితే సులభంగా కనిపెట్టవచ్చు. దీని ద్వారా కీస్, వ్యాలెట్ వంటి రోజూవారి వస్తువులను కూడా సులభంగా కనిపెట్టవచ్చు.