తెలంగాణ

telangana

ETV Bharat / technology

శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్​పై భారీ డిస్కౌంట్- ఏకంగా రూ.21వేల వరకు అదిరే బెనిఫిట్స్! - GALAXY S25 SERIES DISCOUNT

గెలాక్సీ S25 సిరీస్​ ప్రీ-బుకింగ్​పై ఆఫర్లే ఆఫర్లు- వివరాలు ఇవే!

Galaxy S25 Series
Galaxy S25 Series (Photo Credit- Samsung)

By ETV Bharat Tech Team

Published : Jan 27, 2025, 2:47 PM IST

Galaxy S25 Series Pre Order Discount:శాంసంగ్ ఫ్లాగ్​షిప్ స్మార్ట్​ఫోన్ సిరీస్​ ఇటీవలే గ్లోబల్​ మార్కెట్​లో లాంఛ్ అయింది. కంపెనీ 'శాంసంగ్ గెలాక్సీ S25' పేరుతో తీసుకొచ్చిన ఈ సిరీస్​లో 'గెలాక్సీ S25', 'గెలాక్సీ S25 ప్లస్', 'గెలాక్సీ S25 అల్ట్రా' అనే మూడు మోడల్స్​ను విడుదల చేసింది.

శాంసంగ్ అదిరే బెనిఫిట్స్, ఆఫర్లతో మార్కెట్లో వీటి ప్రీ-బుకింగ్స్​ను కూడా ఈ నెల 23 నుంచే ప్రారంభించింది. దీంతో వీటి ప్రీ-బుకింగ్స్​లో కస్టమర్లు ఏకంగా రూ. 21,000 వరకు విలువైన ప్రయోజనాలను పొందొచ్చు. 'గెలాక్సీ S25 అల్ట్రా'ను ముందుగా బుక్​చేసుకుంటే ఈ ప్రీమియం డివైజ్​పై దాదాపు రూ.12,000 ప్రయోజనాలను పొందొచ్చు. ఈ సందర్భంగా ఈ సిరీస్​లో స్మార్ట్​ఫోన్​ల ధరలు, ప్రీ-బుకింగ్​ ఆఫర్​ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం రండి.

1. గెలాక్సీ S25 ధర:

  • ఈ మోడల్ 12GB RAM అండ్ 256GB స్టోరేజ్​తో బేస్ వేరియంట్ ధర: రూ. 80,999
  • 12GB RAM అండ్ 512GB స్టోరేజ్​తో సెకండ్ వేరియంట్ ధర: రూ. 92,999

కలర్ ఆప్షన్స్:

  • ఐసీ బ్లూ
  • సిల్వర్ షాడో
  • నేవీ
  • మింట్

2. గెలాక్సీ S25+ ధర:

  • 12GB RAM అండ్ 256GB స్టోరేజ్​తో ఈ ఫోన్ ధర: రూ.99,999
  • అదేవిధంగా 12 GB RAM అండ్ 512 GB స్టోరేజ్​ ఉన్న వేరియంట్ ధర: రూ.111,999
  • ఈ గెలాక్సీ S25+ ఫోన్‌ను నేవీ, సిల్వర్ షాడో కలర్ ఆప్షన్‌లలో ప్రీ-బుక్ చేసుకోవచ్చు.

3. గెలాక్సీ S25 అల్ట్రా ధర:

  • 12GB RAM అండ్ 256GB స్టోరేజ్ కలిగిన అత్యంత ప్రీమియం మోడల్ బేస్ వేరియంట్ ధర: రూ.1,29,999
  • 12 GB RAM అండ్ 512 GB స్టోరేజ్ కలిగిన సెకండ్ వేరియంట్ ధర: రూ.1.41,999
  • ఈ ఫోన్ టైటానియం సిల్వర్ బ్లూ, టైటానియం గ్రే, టైటానియం వైట్ సిల్వర్, టైటానియం బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
  • 12GB RAM అండ్ 1TB స్టోరేజ్ కలిగిన టాప్ వేరియంట్ ధర: రూ. 1.56,999. దీన్ని టైటానియం సిల్వర్ బ్లూ కలర్ ఆప్షన్​తో కూడా కొనుగోలు చేయొచ్చు.

కంపెనీ ఈ కొత్త గెలాక్సీ S25 సిరీస్​ ప్రీ-ఆర్డర్​పై రూ.21,000 వరకు ఆఫర్​లను అందిస్తోంది. 'గెలాక్సీ S25 అల్ట్రా', 'గెలాక్సీ S25+' మోడల్స్​లో కస్టమర్లు రూ.12,000 వరకు విలువైన స్టోరేజ్ అప్​గ్రేడ్​లను పొందొచ్చు. దీనితో పాటు కంపెనీ రూ. 9,000 అప్‌గ్రేడ్ బోనస్‌ను కూడా అందిస్తోంది.

అంతేకాక నో-కాస్ట్ EMI ప్లాన్‌తో 'గెలాక్సీ S25 అల్ట్రా' మోడల్​ను కొనుగోలు చేస్తే రూ.7,000 క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందొచ్చు. శాంసంగ్ ఈ ఫ్లాగ్‌షిప్ సిరీస్​పై రూ.11,000 వరకు అప్‌గ్రేడ్ బోనస్, రూ.7,000 వరకు క్యాష్‌బ్యాక్ కూడా అందిస్తోంది. ఈ ఆఫర్లపై మరిన్ని వివరాల కోసం https://www.samsung.com/in/samsung-live/ ని సందర్శించండి.

ఎయిర్​టెల్ యూజర్లకు గుడ్​న్యూస్- అవే ప్రయోజనాలతో ఆ ప్లాన్​ల ధరలు తగ్గింపు- ఏకంగా రూ.110!

రాయల్​ ఎన్​ఫీల్డ్ డిమాండ్ లేదుగా- ఏకంగా 5లక్షల మంది కొన్న మోడల్ ఇదే!​

గ్లోబల్ మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్- చౌక ధరకు ఎక్కడ లభిస్తాయంటే?

ABOUT THE AUTHOR

...view details