Passphrases For Extra Security : టెక్నాలజీ పెరిగిన తరువాత ఆర్థిక లావాదేవీలు అన్నీ ఆన్లైన్లోనే చేసేస్తున్నాం. యువతీ, యువకులు అయితే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో తమ క్రియేటివిటీని ప్రదర్శిస్తున్నారు. అందుకే సైబర్ క్రిమినల్స్ వీరందరినీ టార్గెట్ చేస్తున్నారు. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి, ఆన్లైన్ బ్యాంకింగ్ కోసం ఉపయోగించే పాస్‌వర్డ్‌లను సులభంగా క్రాక్ చేస్తున్నారు. సోషల్ మీడియా అకౌంట్ల పాస్‌వర్డ్‌లను కూడా చాలా సింపుల్‌గా కనిపెట్టేస్తున్నారు.
పాస్కీ అథంటికేషన్ (passkey authentication) అందుబాటులోకి వచ్చినప్పటికీ, దీనిని అందరూ ఉపయోగించుకోవడం లేదు. కొందరు స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను పెడుతుంటారు. కానీ వాటిని గుర్తుంచుకోలేక ఇబ్బందిపడుతూ ఉంటారు. అందుకే చాలా మంది సింపుల్‌గా ఉండే పాస్‌వర్డ్‌లనే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అంటే రోజు ఉపయోగించే, డిక్షనరీలో ఉండే పదాలనే ఎక్కువగా వాడుతుంటారు. దీనిని అవకాశంగా తీసుకుని సైబర్ నేరగాళ్లు 'డిక్షనరీ ఎటాక్స్' చేస్తున్నారు.
మరికొందరు f7y88956wo*NLK# లాంటి స్ట్రాంగ్ పాస్వర్డ్లు పెడుతుంటారు. కానీ అన్ని అకౌంట్లకు ఒకే పాస్వర్డ్ ఉపయోగిస్తూ ఉంటారు. ఇది కూడా ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఫిషింగ్ సైట్లలో మీ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే, దానిని సైబర్ విలన్స్ చాలా సులువుగా కనిపెట్టేస్తారు. అలాగని ప్రతి అకౌంట్‌కు వేర్వేరు స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకుంటే, వాటిని గుర్తుంచుకోవడం చాలా కష్టమైపోతుంది. అందుకే ఇలాంటి సమస్యలను అధిగమించడానికి 'పాస్‌ఫ్రేజ్' ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు.
What Is A Passphrase?
ఫ్రేజ్‌ను తెలుగుతో పదబంధం అంటారు. అంటే కొన్ని పదాల కలయిక అని చెప్పుకోవచ్చు. ఉదాహరణకు that's not a big deal అనే ఫ్రేజ్ ఉంది. దీనిని మీరు లెటర్స్, నంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్‌లోకి మార్చాలి. అంటే 2081#TON127deaL అని మార్చుకోవాలి. దీనినే leetspeak అని అంటారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఇక్కడ క్రియేట్ చేసిన పాస్ఫ్రేజ్లో not అనే పదాన్ని TON అని మార్చి రాయడం జరిగింది. ఇలా చేయడం వల్ల, హ్యాకర్ మీ పదబంధాన్ని తెలివిగా కనిపెట్టినా, దానిని క్రాక్ చేయడం చాలా కష్టమవుతుంది.
చూశారుగా, ఈ విధంగా మీకు బాగా గుర్తుండే పదబంధాన్ని పాస్ఫ్రేజ్గా పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల హ్యాకర్లు దీనిని ఎప్పటికీ కనిపెట్టలేరు. అలాకాకుండా మీ పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నంబర్లు, లక్కీ నంబర్లు పెట్టుకుంటే, వాటిని ఈజీగా క్రాక్ చేయగలుగుతారు.