Best Budget Gaming Smartphones: ప్రస్తుతం ఎక్కువమంది మొబైల్లో గేమ్స్ ఆడేందుకు ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో మీరు కూడా మంచి గేమింగ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అది కూడా రూ.20వేల లోపు బడ్జెట్ ధరలో ఉండాలా? అయితే మీకోమే ఈ స్టోరీ.
సాధారణంగా మెరుగైన గేమింగ్ ఎక్స్పీరియన్స్ కోసం స్మార్ట్‌ఫోన్‌లో బిగ్ బ్యాటరీ, పవర్ఫుల్ ప్రాసెసర్‌తో పాటు గేమింగ్ సమయంలో మెరుగైన వీక్షణ అనుభవం కోసం మంచి డిస్ప్లే అవసరం. అప్పుడే మీరు మంచి గేమింగ్ అనుభూతిని పొందగలుగుతారు.
ఇలాంటి అన్ని ఫీచర్లతో మార్కెట్లో మోటరోలా, శాంసంగ్, ఐకూ, నథింగ్ వంటి కంపెనీల నుంచి బెస్ట్ గేమింగ్ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి గేమింగ్ కోసం మాత్రమే కాకుండా మీ రోజువారీ పనులకు కూడా బాగా ఉపయోగపడతాయి.
బడ్జెట్ ధరలో మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ గేమింగ్ ఫోన్లు ఇవే:
Moto Edge 50 Neo:గేమర్ల కోసం 'మోటో ఎడ్జ్ 50 నియో' స్మార్ట్‌ఫోన్ బాగుంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మొబైల్ రూ.21,999 ధరకు ఆఫర్లో అందుబాటులో ఉంది. అయితే ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ. 2,000 డిస్కౌంట్ కూడా ఉంది. దీంతో ఈ కార్డుల ద్వారా దీన్ని రూ. 19,999లకే కొనుగోలు చేయొచ్చు.
- ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్
- కెమెరా: ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
- మెయిన్ కెమెరా: 50MP మెయిన్
- అల్ట్రా వైడ్ కెమెరా: 13 MP
- టెలిఫోటో కెమెరా: 10MP
Samsung Galaxy A15 5G: 'శాంసంగ్ గెలాక్సీ A15 5G' అనేది బడ్జెట్- ఫ్రెండ్లీ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూసున్నవారికి బెస్ట్ ఆప్షన్. ఇది అమెజాన్‌లో రూ. 14,998 ధరతో అందుబాటులో ఉంది. అయితే ఈ మొబైల్ సాధారణ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.
- ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్
- కెమెరా సెటప్: ఇది కూడా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.
- మెయిన్ కెమెరా:50MP
- అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్: 5MP కెమెరా
- మాక్రో లెన్స్: 2MP