తెలంగాణ

telangana

ETV Bharat / technology

BSNL యూజర్లకు షాకింగ్ న్యూస్!- సంక్రాంతి నుంచి ఆ సర్వీసులు బంద్! - BSNL 3G SERVICES

తన సేవల్లో ఒకదాన్ని నిలిపివేయనున్న BSNL- అదేంటో తెలుసా?

BSNL New Logo
BSNL New Logo (Photo Credit- BSNL)

By ETV Bharat Tech Team

Published : Jan 3, 2025, 12:44 PM IST

BSNL 3G Services:BSNL కస్టమర్లకు షాకింగ్ న్యూస్. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన సర్వీసుల్లో ఒకదాన్ని నిలిపివేస్తోంది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం లక్షలాది మంది వినియోగదారులపై ప్రభావం చూపనుంది. అదేంటో తెలుసుకుందాం రండి.

BSNL 3G సర్వీసులు బంద్:పలు మీడియా కథనాల ప్రకారం.. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL తన 3G సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా బిహార్ రాజధాని పాట్నాతో సహా పలు జిల్లాల్లో తన 3G సేవలను నిలిపివేస్తోంది. మొదటి దశలో మోతీహరి, కతిహార్, ఖగారియా, ముంగేర్ వంటి జిల్లాల్లో 3Gని నిలిపివేసింది. జనవరి 15 అంటే సంక్రాంతి నుంచి పాట్నా, ఇతర జిల్లాలలో ఈ సేవలను పూర్తిగా బంద్ చేయనున్నారు.

బీఎస్​ఎన్​ఎల్ 3G సర్వీస్ షట్‌డౌన్.. ఇప్పటికే​ 3G SIMలు ఉన్న కస్టమర్‌లను ప్రభావితం చేస్తుంది. ఈ సర్వీసులను నిలిపివేసిన తర్వాత వారు తమ మొబైల్స్​లో ఇంటర్నెట్ డేటాను పొందలేరు. కాల్స్, SMSలు మాత్రమే చేయగలరు. మీడియా కథనాల ప్రకారం.. బిహార్ రాష్ట్రంలో 4G నెట్‌వర్క్‌ను అప్‌డేట్ చేసినట్లు బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే 3G సేవలను నిలిపివేస్తున్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేసి, 5G సేవలను ప్రారంభించే ప్రణాళికలతో కంపెనీ ముందుకు సాగుతోంది.

మరి ఇప్పటికే ఉన్న 3G SIM పరిస్థితి ఏంటి?:బీఎస్​ఎన్​ఎల్ 3G సిమ్ వినియోగదారులు డేటాను పొందాలనుకుంటే వారు తమ సిమ్​ను మార్చుకోవాల్సి ఉంటుంది. వీరికి కంపెనీ ఎటువంటి ఖర్చు లేకుండానే 3G సిమ్‌కు బదులుగా 4G సిమ్‌ను అందిస్తోంది. భవిష్యత్తులో ఈ SIMలో 5G డేటా కూడా పని చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తమ వద్ద 3G సిమ్ ఉన్న యూజర్లు బీఎస్​ఎన్​ఎల్ ఆఫీస్​ను సందర్శించాలి. తద్వారా వారు తమ సిమ్​ను 4G నెట్​వర్క్​కు మార్చుకోవచ్చు. ఇందుకోసం వారు తమ వెంట గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి. పాట్నా మాత్రమే కాకుండా దేశంలోని అనేక ఇతర ప్రాంతాల్లో కంపెనీ తన 3G సేవలను జనవరి 15 నుంచి పూర్తిగా నిలిపివేయనుంది.

BSNLకు పెరిగిన కస్టమర్ల సంఖ్య: ప్రస్తుతం ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బీఎస్​ఎన్​ఎల్​ కస్టమర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రైవేట్ టెలికాం కంపెనీల ఖరీదైన రీఛార్జ్ ప్లాన్లే ఇందుకు కారణం. ప్రైవేట్ కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధరను చాలాసార్లు పెంచాయి. దీంతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులు బీఎస్​ఎన్​ఎల్​ సర్వీసులను ఎంచుకుంటున్నారు.

లో కాస్ట్.. హై పెర్ఫార్మెన్స్: ఈ బైక్స్ వేరే లెవల్​ బ్రో- 400cc సెగ్మెంట్లో టాప్ ఇవే!

జియో, ఎయిర్​టెల్​తో పోటీకి వొడాఫోన్ ఐడియా రెడీ- త్వరలో 5G సేవలు!

USB-C పోర్ట్​, యాపిల్ మోడెమ్​, న్యూ డిజైన్​తో 'ఐఫోన్ SE 4'- ధర ఎంత ఉంటుందంటే?

హైబ్రిడ్ ఇంజిన్, కొత్త డిజైన్​తో.. కియా సెల్టోస్ వచ్చేస్తోంది!- రిలీజ్ ఎప్పుడంటే?

ABOUT THE AUTHOR

...view details