తెలంగాణ

telangana

ETV Bharat / technology

ఎయిర్‌టెల్‌ యూజర్లకు షాక్- 'వింక్​ మ్యూజిక్​ యాప్​కు గుడ్​బై' - Airtel to Shut Down Wynk Music App - AIRTEL TO SHUT DOWN WYNK MUSIC APP

Airtel to Shut Down Wynk Music App: స్మార్ట్​ ఫోన్ దిగ్గజం యాపిల్​తో భాగస్వామ్యం అయిన ఎయిర్​టెల్ కీలక నిర్ణయం తీసుకుంది. యూజర్లకు ఉచితంగా అందిస్తున్న వింక్ మ్యూజిక్​ యాప్​ సేవలకు గుడ్​బై చెప్పనున్నట్లు సమాచారం.

Airtel_to_Shut_Down_Wynk_Music_App
Airtel_to_Shut_Down_Wynk_Music_App (Etv Bharat)

By ETV Bharat Tech Team

Published : Aug 28, 2024, 12:47 PM IST

Airtel to Shut Down Wynk Music App:ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ యూజర్లకు షాక్ ఇచ్చింది. తన వినియోగదారులకు ఉచితంగా అందిస్తున్న వింక్ మ్యూజిక్(Wynk) సర్వీసులకు స్వస్తి పలికేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. యూజర్లకు మెరుగైన సేవలను అందించేందు ఈ సంస్థ టెక్​ దిగ్గజం యాపిల్​తో​ భాగస్వామ్యం అయినట్లు మంగళవారం ప్రకటించింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

'2 నెలల్లో Wynk Music Appకు స్వస్తి':వింక్ మ్యూజిక్ యాప్​కు స్వస్తి పలికి, అందులోని ఉద్యోగులందరినీ ఎయిర్​టెల్​లోకి తీసుకుని రానున్నారు. మరో రెండు నెలల్లో వింక్ మ్యూజిక్ యాప్​ మూసివేసే ప్రణాళికపై పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే వింక్ ప్రీమియం సబ్​స్క్రిప్షన్​ తీసుకున్నవారి కోసం కోసం ఎయిర్‌టెల్‌ ప్రత్యేక ఆఫర్‌ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇకపై యాపిల్‌ మ్యూజిక్‌ ద్వారా ఎయిర్‌టెల్‌ వినియోగదారులు మ్యూజిక్ వినొచ్చు. ఈ విషయాన్ని కంపెనీ వర్గాలు వెల్లడించినట్లు నేషనల్ మీడియా సంస్థ పీటీఐ తెలిపింది.

"త్వరలోనే వింక్‌ మ్యూజిక్‌కు నిలిపివేయనున్నాం. దీంతో Wynk మ్యూజిక్‌లోని ఉద్యోగులను ఎయిర్‌టెల్‌లో సర్దుబాటుచేయనున్నాం. ఇకపై ఎయిర్‌టెల్ వినియోగదారులు యాపిల్‌ మ్యూజిక్‌ ద్వారా సంగీతం వినొచ్చు. అయితే ఇప్పటికే Wynk ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న వారికి ఎయిర్‌టెల్‌ ప్రత్యేక ఆఫర్‌ ఇవ్వనుంది." - కంపెనీకి చెందిన ఓ అధికారి

ఇకపై యాపిల్ మ్యూజిక్ ద్వారానే:కాగా యాపిల్ భాగస్వామ్యంతో ఎయిర్‌టెల్‌ ఐఫోన్‌ వినియోగదారులకు ప్రత్యేక ప్రయోజనాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఎయిర్​టెల్​ కస్టమర్లు యాపిల్‌ టీవీ+, యాపిల్‌ మ్యూజిక్‌ కంటెంట్‌ను యాక్సెస్​ను చేసే అందించనుంది. ఈ సర్వీసులు ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి రానున్నట్లు ఎయిర్​టెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అమృత్‌ త్రిపాఠి వెల్లడించారు. యాపిల్ మ్యూజిక్ యాప్ ఫీచర్లో యాపిల్ మ్యూజిక్ సింగ్, టైమ్-సింక్డ్ లిరిక్స్, లాస్‌లెస్ ఆడియో, స్పేషియల్ ఆడియో కంటెంట్లు ఉంటాయి. ఎయిర్‌టెల్‌ యూజర్లు ఇకపై యాపిల్‌ మ్యూజిక్‌ ద్వారా సంగీతం వినొచ్చు. దీనిపై మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఐఫోన్ లవర్స్​కు గుడ్​ న్యూస్- యాపిల్ ఈవెంట్ డేట్ వచ్చేసిందోచ్​ - iphone 16 launch date

యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్- సబ్​స్క్రిప్షన్ ధరల పెంపు - youtube premium plans price hike

ABOUT THE AUTHOR

...view details