తెలంగాణ

telangana

ETV Bharat / technology

మంచి స్మార్ట్​వాచ్​ కొనాలా? రూ.2,500 బడ్జెట్లోని టాప్​-10 ఆప్షన్స్ ఇవే!

Best Smart Watches Under 2500 : మీరు మంచి స్మార్ట్​వాచ్ కొనాలని అనుకుంటున్నారా? మీ బడ్జెట్​ రూ.2500 మాత్రమేనా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో సుమారు రూ.2500 ధరలో లభిస్తున్న టాప్​-10 స్మార్ట్​వాచ్​లపై ఓ లుక్కేద్దాం రండి.

Best Smart Watches Under 2000
Best Smart Watches Under 2500

By ETV Bharat Telugu Team

Published : Mar 8, 2024, 3:25 PM IST

Best Smart Watches Under 2500 :కోవిడ్​ మహమ్మారి తరువాత చాలా మంది శారీరక శ్రమను మొదలుపెట్టారు. వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది సైక్లింగ్​, ఏరోబిక్స్​, ఎక్సర్​సైజ్​, యోగా చేస్తున్నారు. పైగా తమ హార్​బీట్​, బ్లడ్​ ప్రెజర్​, పల్స్​ రేట్​ను తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. వీటన్నింటిని ట్రాక్ చేయడానికి స్మార్ట్​ వాచ్​లు బాగా ఉపయోగపడతాయి. మరి మీరు కూడా ఇలాంటి ఫీచర్స్ ఉన్న మంచి స్మార్ట్​వాచ్​ కొనాలని అనుకుంటున్నారా? అయితే మరెందుకు ఆలస్యం. రూ.2,500 బడ్జెట్లో మంచి హెల్త్, ఫిట్​నెస్ ఫీచర్లు ఉన్న టాప్​-10 స్మార్ట్​వాచ్​ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. Fire-Boltt Quest :అదిరిపోయే ఫీచర్స్​తో ఫైర్​-బోల్ట్​​ బ్రాండ్​ స్మార్ట్​ వాచ్​ తక్కువ ధరకే మార్కెట్​లో అందుబాటులో ఉంది. దీనికి సంబంధించి స్పెక్స్​ అండ్​ ఫీచర్స్ వివరాలు ఇలా ఉన్నాయి.

  • బ్రాండ్​ - ఫైర్​బోల్ట్​
  • రేటింగ్​ - 4.1/5
  • డిస్​ప్లే టైప్​ - ఫుల్ టచ్​
  • డిస్​ప్లే సైజ్ ​- 1.39 అంగుళాలు
  • బ్యాటరీ లైఫ్​ - 7 రోజులు
  • డిస్​ప్లే రిజల్యూషన్​ - 360x360 పిక్సల్స్
  • ధర - రూ.2,329

Fire-Boltt Quest Functions : జీపీఎస్​ ట్రాకింగ్​, యాక్యురేట్​ స్పోర్ట్స్​ మానిటరింగ్​, బ్లూటూత్ కాలింగ్​, 100+ స్పోర్ట్స్​ మోడ్స్​

2. TIMEX iConnect EVO+ :ఈ టైమెక్స్​ ఐకనెక్ట్​​ ఈవీఓ+ మోడల్​​ స్మార్ట్​ వాచ్​లో సూపర్ ఫీచర్స్ ఉన్నాయి. అవి ఏమిటంటే?

  • బ్రాండ్ ​- టైమెక్స్​
  • రేటింగ్​ - 4.3/5
  • డిస్​ప్లే టైప్​ - అమోలెడ్​
  • డిస్​ప్లే సైజ్ ​- 2.04 అంగుళాలు
  • బ్యాటరీ లైఫ్ ​- 7 రోజులు
  • డిస్​ప్లే రిజల్యూషన్ ​- 368x448 పిక్సల్స్
  • ధర - రూ.2,395

TIMEX iConnect EVO+ Functions :బ్లూటూత్ కాలింగ్, ఏఐ వాయిస్​ అసిస్ట్​, 24x7 హార్ట్​ రేట్​ మానిటర్​, SpO2 మానిటర్, స్లీప్​ ట్రాకర్​, బీపీ కెమెరా కంట్రోల్​, మ్యూజిక్​ కంట్రోల్​

3. Noise Vivid Call 2 Smart Watch : ఐపీ68 వాటర్​ప్రూఫ్​ రేటింగ్​తో వస్తున్న నాయిస్​ వివిడ్​ కాల్​ 2 స్మార్ట్​ వాచ్​​ అతి తక్కువ ధరకే మార్కెట్​లో అందుబాటులో ఉంది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

  • బ్రాండ్​ - నాయిస్​
  • రేటింగ్​ - 4.1/5
  • డిస్​ప్లే టైప్ ​- హెచ్​డీ డిస్​ప్లే
  • డిస్​ప్లే సైజ్ ​- 1.85 అంగుళాలు
  • బ్యాటరీ లైఫ్​ - 7 రోజులు
  • ధర - రూ.1,499

Noise Vivid Call 2 Smart Watch Functions : బ్లూటూత్ కాలింగ్​, స్లీప్​ ట్రాకింగ్​, 150+ వాచ్​ ఫేసెస్​

4. Vibez By Lifelong Smart Watch :స్టెయిన్​లెస్​ స్టీల్​ డయల్​ప్యాడ్​తో పాటు అడ్వాన్స్​డ్​ ఫీచర్స్​తో మార్కెట్​లో అందుబాటులో ఉంది వైబెజ్​​ బ్రాండ్​ స్మార్ట్​ వాచ్​ దీనికి సంబంధించిన స్పెక్స్ అండ్ ఫీచర్స్​ వివరాలు.

  • బ్రాండ్​ - Vibez
  • రేటింగ్​ - 4.8/5
  • డిస్​ప్లే టైప్ ​- అల్ట్రా హెచ్​డీ, 900 NITS
  • డిస్​ప్లే సైజ్ ​- 2.02 అంగుళాలు
  • బ్యాటరీ లైఫ్ ​- 60 రోజులు
  • ధర - రూ.2,499

Vibez By Lifelong Smart Watch Functions : బ్లూటూత్ కాలింగ్​, స్టెయిన్​లెస్​ స్టీల్​ డయల్​ప్యాడ్​, క్రిస్టల్​ క్లియర్ డిస్​ప్లే

5. Fire-Boltt Avalanche Luxury Watch : ఐపీ67 రెసిస్టెన్స్​తో సూపర్​ ఫీచర్స్​ కలిగిన ఫైర్​-బోల్డ్​ అవలాంచ్​ లగ్జరీ వాచ్​ మోడల్​​ తక్కువ ధరకే మార్కెట్​లో అందుబాటులో ఉంది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

  • బ్రాండ్ ​- ఫైర్​బోల్ట్​
  • రేటింగ్​ - 4.2/5
  • డిస్​ప్లే టైప్​ - హెచ్​డీ డిస్​ప్లే
  • డిస్​ప్లే సైజ్ ​- 1.28 అంగుళాలు
  • బ్యాటరీ లైఫ్ ​- 7 రోజులు
  • ధర - రూ.2,209

Fire-Boltt Avalanche Luxury Watch Functions :బ్లూటూత్ కాలింగ్, 2 బటన్​ పుషర్స్​, మల్టిపుల్​ స్పోర్ట్స్​ మోడ్స్​, IP67 వాటర్​ప్రూఫ్​

6. Noise Vortex Plus :స్లీక్​ మెటల్​ ఫినిష్​, స్టైలిష్​ సిల్వర్​ లింక్ డిజైన్​, హెల్త్ సూట్​తో అదిరిపోయే ఫీచర్స్​తో నాయిస్​ వార్టెక్స్​ ప్లస్​ మోడల్​ తక్కువ ధరకే మార్కెట్​లో అందుబాటులో ఉంది. దీనికి సంబంధించి స్పెక్స్​ అండ్​ ఫీచర్స్​ వివరాలు.

  • బ్రాండ్​ - నాయిస్​
  • రేటింగ్​ - 4.1/5
  • డిస్​ప్లే టైప్​ - అమోలెడ్​, AoD
  • డిస్​ప్లే సైజ్​ - 1.46 అంగుళాలు
  • బ్యాటరీ లైఫ్ ​- 7 రోజులు
  • ధర - రూ.2,499

Noise Vortex Plus Functions : బ్లూటూత్ కాలింగ్, 100+ వాచ్​ ఫేసెస్​,

7. pTron Reflect Classic Smartwatch :ఫుల్​ టచ్​ డిస్​ప్లే, మెటల్​ ఫ్రేమ్​, హెల్త్​ మానిటరింగ్​ ఫీచర్స్​తో వస్తుంది పీట్రాన్​ రిఫ్లెక్ట్ ​క్లాసిక్​ స్మార్ట్​వాచ్. దీనికి సంబంధించి వివరాలు.

  • బ్రాండ్​ - pTron
  • రేటింగ్​ - 4.5/5
  • డిస్​ప్లే టైప్ ​- స్క్వేర్​ డయల్​, 600 NITS
  • డిస్​ప్లే సైజ్ ​- 2.01 అంగుళాలు
  • బ్యాటరీ లైఫ్ ​- 5 రోజులు
  • ధర - రూ.1,349

pTron Reflect Classic Smartwatch Functions :వాయిస్​ అసిస్ట్​, హార్ట్​ రేట్​ మానిటర్​, SpO2 మానిటర్​, బ్లూటూత్ కాలింగ్

8. Fastrack New Limitless Classic :సులువైన నావిగేషన్​ కోసం ఫంక్షనల్​ క్రౌన్​తో వస్తుంది ఈ ఫాస్ట్రాక్​ స్మార్ట్​ వాచ్​. అదిరిపోయే ఫీచర్స్​తో తక్కువ ధరకే మార్కెట్​లో అందుబాటులో ఉంది. దీనికి సంబంధించి స్పెక్స్​ అండ్​ ఫీచర్స్ వివరాలు ఇలా ఉన్నాయి.

  • బ్రాండ్​ - ఫాస్ట్రాక్​
  • రేటింగ్ ​- 4/5
  • డిస్​ప్లే టైప్ ​- సూపర్​ అల్ట్రాVU
  • డిస్​ప్లే సైజ్ ​- 1.91 అంగుళాలు
  • బ్యాటరీ లైఫ్​ - 7 రోజులు
  • డిస్​ప్లే రిజల్యూషన్ ​- 320x385 పిక్సల్స్
  • ధర - రూ.2,499

Fastrack New Limitless Classic Functions :100+ స్పోర్ట్స్​ మోడ్స్​, సింగిల్​సింక్​ బ్లూటూత్ కాలింగ్​

9. Fire-Boltt Lumos Luxury Smart Watch : స్టెయిన్​లెస్​ స్టీల్​ లగ్జరీ లుక్​లో సూపర్​ ఫీచర్స్​తో వస్తుంది ఫైర్​ బోల్ట్​ ల్యూమస్​ లగ్జరీ​ స్మార్ట్​వాచ్​​. తక్కువ ధరకే ఇది మార్కెట్​లో అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన స్పెక్స్​ అండ్​ ఫీచర్స్​.

  • బ్రాండ్​ - ఫైర్​బోల్ట్​
  • రేటింగ్​ - 4.1/5
  • డిస్​ప్లే టైప్ ​- లార్జ్​ డిస్​ప్లే
  • డిస్​ప్లే సైజ్ ​- 1.91 అంగుళాలు
  • బ్యాటరీ లైఫ్​ - 8 రోజులు
  • ధర - రూ.1,499

Fire-Boltt Lumos Luxury Smart Watch Functions :వాయిస్​ అసిస్టెంట్​, బ్లూటూత్ కాలింగ్, 100+ స్పోర్ట్స్​ మోడ్స్​

10. Redmi Smart Watch : ఎల్​సీడీ డిస్​ప్లే, అదిరిపోయే ఫీచర్స్​తో రెడ్​మీ స్మార్ట్​ వాచ్​ తక్కువ ధరకే మార్కెట్​లో అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన స్పెక్స్ అండ్​ ఫీచర్స్​పై ఓ లుక్కేయండి.

  • బ్రాండ్ ​- రెడ్​మీ
  • రేటింగ్ ​- 4/5
  • డిస్​ప్లే టైప్ ​- లార్జ్​ ఎల్​సీడీ స్క్రీన్​
  • డిస్​ప్లే సైజ్ ​- 1.83 అంగుళాలు
  • బ్యాటరీ లైఫ్ ​- 12 రోజులు
  • కలర్ ​- యాక్టివ్​ గ్రే
  • ధర - రూ.2,999

Redmi Smart Watch Functions : 100+ వర్క్​అవుట్​ మోడ్స్​, హార్ట్​ రేట్​ మానిటర్​

యాపిల్ మ్యాక్​బుక్ ఎయిర్ 13 & 15 లాంఛ్ - ఫీచర్స్ అదుర్స్ - ధర ఎంతంటే?

స్పై కెమెరాలు ఉన్నాయని అనుమానంగా ఉందా? మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండిలా!

ABOUT THE AUTHOR

...view details