Best Google Search Tricks :ప్రస్తుత రోజుల్లో ఏ చిన్న సందేహం వచ్చినా ప్రతి ఒక్కరికీ గుర్తుకు వచ్చే సెర్చ్ ఇంజిన్ గూగుల్. అంతలా మన జీవితాల్లో ఇది భాగమైపోయింది. అయితే రెగ్యులర్‌గా గూగుల్ సెర్చ్ ఇంజిన్ వాడేవారికి కూడా కొన్ని సెర్చింగ్ ట్రిక్స్ తెలియవు. కానీ వీటిని తెలుసుకుంటే, మీ పని మరింత సులువుగా అయిపోతుంది. అందుకే ఈ ఆర్టికల్‌లో టాప్-10 గూగుల్ సెర్చ్ ట్రిక్స్ గురించి తెలుసుకుందాం.
1. కొటేషన్
గూగుల్‌లో మీరు సెర్చ్ చేసే పదానికి కొటేషన్ (" ") పెట్టడం ద్వారా మీకు కావాల్సిన కచ్చితమైన సమాచారం సులువుగా తెలుసుకోవచ్చు. అయితే, ఇలా కోట్స్ పెట్టే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే మీకు అవసరమైన సెర్చ్ రిజల్ట్స్ రాకపోవచ్చు. గూగుల్‌లో మీరు సెర్చ్ చేసే అంశానికి సంబంధించి సరైన సమాచారం రాకపోయినప్పుడు మాత్రమే ఈ ట్రిక్‌ను వాడవచ్చు. ఉదాహరణకు : "Tesla Phone" అని టైప్ చేస్తే, టెస్లా ఫోన్‌కు సంబంధించిన కచ్చితమైన సమాచారం మీకు లభిస్తుంది.
2. కేటగిరీ వైజ్ సెర్చ్
గూగుల్ సెర్చ్ బాక్స్‌లో మీరు టైప్ చేసిన కీవర్డ్‌కు సంబంధించి అనేక అంశాలు హోం స్క్రీన్‌పై కనబడతాయి. ఒకవేళ మీరు ఇచ్చిన పదానికి సంబంధించి ఫొటోలు చూడాలనుకుంటే ఇమేజెస్ సెక్షన్, వార్తలు చూడాలనుకుంటే న్యూస్ కేటగిరీ, వీడియోలు, షాపింగ్, మ్యాప్స్ ఇలా వివిధ విభాగాల్లో మీకు నచ్చిన దానిని మీరు చూడవచ్చు. ఉదాహరణకు : Computer Desk Shoppingకి బదులు Computer Desk అని టైప్ చేసి షాపింగ్ సెక్షన్‌పై క్లిక్ చేస్తే సరి. వివిధ కంపెనీల మోడల్స్ అన్నింటినీ మీకు తెరపై చూపిస్తుంది.
3. సింపుల్ కీవర్డ్స్
గూగుల్‌కు లెంథీ కీవర్డ్స్ ఇవ్వకండి. సాధ్యమైనంత వరకు సులువుగా అర్థమయ్యే విధంగా ఉండే షార్ట్ కీవర్డ్స్ ఇవ్వండి. మీకు కావాల్సిన సమాచారంతో సంబంధమున్న కీవర్డ్స్‌ను మాత్రమే ఇచ్చేందుకు ప్రయత్నించండి. అలా అయితే మీ సెర్చ్ రిజల్ట్స్ మెరుగ్గా వస్తాయి. ఉదాహరణకు మీ ఐఫోన్ పోయింది అనుకుందాం. అప్పుడు గూగుల్‌ను I Lost My iPhone What To Doకి బదులుగా Lost iPhone, Iam Looking For New Mobilesకి బదులు New Android Phones లాంటి కీవర్డ్స్‌ను ఇవ్వండి. అప్పుడే మీకు కావాల్సిన రిజల్ట్స్ వస్తాయి.
4. కోలన్
కేవలం మీకు కావాల్సిన ప్రోడక్ట్‌కి సంబంధించిన స్పెసిఫిక్ వెబ్సైట్ కావాలంటే మీరు 'కోలన్' వాడాలి. ఉదాహరణకు Wooden Clocks Sitesకి బదులు Wooden Clocks Site : allmodern.com అనే సరైన వెబ్‌సైట్‌ను ఎంటర్ చేయడం ద్వారా మీ సమయం ఆదా అవుతుంది. మీకు కావాల్సిన కలెక్షన్స్‌ను ఒకే పోర్టల్‌లో చూసుకోవచ్చు.
5. హైఫన్
గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌లో మీకు నచ్చిన రిజల్ట్స్ పదేపదే కనిపిస్తున్నాయని అనుకోండి. అప్పుడు వాటిని హైఫన్ ఉపయోగించి, రాకుండా చేయవచ్చు. ఇందుకోసం మీరు చూడకూడదని అనుకుంటున్న కంపెనీ పేరుకు ముందు హైఫన్(-)ను జోడించండి. దానికి ముందు మీకు కావాల్సిన ప్రోడక్ట్ పేరు, వెబ్సైట్ వివరాలను టైప్ చేయండి. ఉదాహరణకు Buy Dishwasher - Website : Walmart.Com ఇలా కీవర్డ్ ఇస్తే, ఇకపై వాల్‌మార్ట్ సైట్‌కు సంబంధించిన ఎటువంటి డిష్వాషర్ రిజల్ట్స్ మీకు కనిపించవు.