తెలంగాణ

telangana

ETV Bharat / technology

రూ.2000 బడ్జెట్లో మంచి ఇయర్​బడ్స్ కొనాలా? టాప్-10 ఆప్షన్స్ ఇవే! - Best Earbuds Under 2000

Best Earbuds Under 2000 : మీరు మంచి ఇయర్​బడ్స్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.2000 మాత్రమేనా? అయితే ప్రస్తుతం మీ బడ్జెట్లో అందుబాటులో ఉన్న టాప్-10 ఇయర్​బడ్స్ గురించి, వాటి ప్రత్యేకతలు గురించి తెలుసుకుందాం.

Earbuds Under 2000 in India
best earbuds under 2000 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 16, 2024, 12:48 PM IST

Best Earbuds Under 2000 :ఈ స్మార్ట్ ​యుగంలో చాలా మంది వైర్​లెస్​ ఇయర్​ఫోన్స్​ను వాడేందుకు ఇష్టపడుతున్నారు. అందుకే ప్రముఖ కంపెనీలు అన్నీ ఇయర్​బడ్స్ మార్కెట్లోకి తెస్తున్నాయి​. వీటికి మార్కెట్​లో ఉన్న డిమాండ్​ అంతా ఇంతా కాదు. మరి మీరు కూడా రూ.2000లోపు మంచి ఇయర్​​బడ్స్ ​కొనాలని అనుకుంటున్నారా? అయితే ఈ ఆర్టికల్​​లో మీ బడ్జెట్లో వచ్చే బెస్ట్​ ఇయర్ ​బడ్స్​ గురించి తెలుసుకుందాం.

1. Wings Phantom 410 Specifications : ఈ మోడల్ ఎయిర్ బడ్స్ 5.2 బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తాయి. ఈ ఇయర్​బడ్స్​ను పెట్టుకుని 10 మీటర్ల వరకు ఎలాంటి అంతరాయం లేకుండా ఫోన్​లో మాట్లాడవచ్చు. పాటలను వినవచ్చు. అలాగే దీనికి ఆటో పెయరింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఈ ఇయర్​బడ్స్​ను మొబైల్ ఫోన్​, పీసీ, ట్యాబెట్లకు కనెక్ట్ చేసుకోవచ్చు.

  • బ్రాండ్- వింగ్స్
  • డిజైన్- ఇన్ఇయర్ కెనాల్ ఫోన్​
  • బరువు- 150 గ్రాములు
  • బ్యాటరీ టైప్- Li-ion
  • ఛార్జింగ్ టైప్- యూఎస్​బీ
  • ధర- రూ.1,532

2. OPPO Enco Buds 2 Specifications : ఒప్పో ఎన్కో బడ్స్ 2లో నాయిస్​ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంది. దీంతో మీరు మరింత హ్యాపీగా సంగీతాన్ని ఎంజాయ్​ చేయవచ్చు. ఇది ఫోల్డబుల్ డిజైన్​తో వస్తుంది.

  • బ్రాండ్- ఒప్పో
  • డిజైన్- ఎన్కో బడ్స్ 2
  • వారంటీ- ఒక సంవత్సరం
  • బ్లూటూత్- 5.2 వెర్షన్
  • ప్లేబ్యాక్ టైమ్- 28గంటలు
  • ఛార్జింగ్ టైప్- యూఎస్​బీ టైప్-సి
  • ఛార్జింగ్ టైమ్- 90 నిమిషాలు
  • ధర- రూ.1,799

3. Boat Airdopes 141 ANC Specifications :ఈ మోడల్ ఇయర్​బడ్స్​ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 42 గంటలు పనిచేస్తాయి. గంటన్నరలో ఈ ఇయర్​డోబ్స్​ ఫుల్ ఛార్జింగ్ అవుతాయి. ఆటో పెయిరింగ్ ఆప్షన్ ఈ ఎయిర్​బడ్స్​లో ఉంది. మొబైల్ ఫోన్స్, పీసీ, ట్యాబ్లెట్స్​కు దీనిని కనెక్ట్ చేసుకోవచ్చు. 10 మీటర్ల ఆటో పెయరింగ్ ఆప్షన్ ఉంది.

  • బ్రాండ్ - బోట్
  • మోడల్- ఎయిర్ పాడ్స్ 141 ఏఎన్​సీ
  • వారంటీ- 1 సంవత్సరం
  • బ్యాటరీ టైప్- Li-ion
  • ప్లేబ్యాక్ టైమ్- 42 గంటలు
  • ఛార్జింగ్ టైప్- యూఎస్​బీ టైప్-సి
  • ధర- రూ.1,599

4. Realme Buds Q2 Neo Specifications : ఈ మోడల్ ఇయర్​బడ్స్​లో నాయిస్​ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంది. ఈ ఇయర్​బడ్స్​కు ఒక సంవత్సరం వారెంటీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 20 గంటలు మాట్లాడుకోవచ్చు. ఆటో పెయిరింగ్ ఆప్షన్ కూడా ఉంది.

  • బ్రాండ్- రియల్ మీ
  • మోడల్- బడ్స్ క్యూ 2 నియో
  • బ్యాటరీ టైప్- Li-ion
  • ప్లే బ్యాక్ టైమ్- 20 గంటలు
  • బ్యాటరీ కెపాసిటీ- 480 mAh
  • ఛార్జింగ్ టైమ్- 2గంటలు
  • ధర- రూ.1,598

5. OnePlus Nord Buds 2R Specifications :ఈ మోడల్ ఇయర్​బడ్స్​ను మొబైల్ ఫోన్, పీసీ, ట్యాబ్లెట్​కు కనెక్ట్ చేసుకోవచ్చు. 5.3 బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ ఉంది.

  • బ్రాండ్- వన్ ప్లస్
  • మోడల్- వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 2ఆర్
  • వారంటీ- 1 సంవత్సరం
  • ప్లే బ్యాక్ టైమ్- 20 గంటలు
  • ఛార్జింగ్ టైప్- యూఎస్​బీ టైప్​-సీ
  • ధర- రూ.1,998

6. Jlab Go Air Pop Specifications : ఈ ఇయర్​బడ్స్​​ను ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 32 గంటల ప్లేబ్యాక్​ టైమ్ ఉంటుంది. రెండు గంటల ఛార్జ్ చేస్తే బ్యాటరీ ఫుల్ అయిపోతుంది. ఈ ఇయర్​బడ్స్ స్వెట్ ప్రూఫ్​గా పని చేస్తాయి. ఈ ఇయర్​బడ్స్​కు రెండేళ్ల వారెంటీ ఉంది.

  • బ్రాండ్- జ్లాబ్
  • మోడల్- గో ఎయిర్ పోప్
  • వారంటీ- 2 సంవత్సరాలు
  • స్టాండ్ బై టైమ్- 60 గంటలు
  • బ్యాటరీ టైప్- Li-Polymer
  • ధర- రూ.1,649

7. Blaupunkt BTW07 ANC Moksha Specifications : ఈ మోడల్ ఇయర్​బడ్స్ ఫోల్డబుల్ డిజైన్​తో వస్తాయి. అలాగే నాయిస్​ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా ఉంది. మొబైల్, పీసీ, ట్యాబ్లెట్​కు సులువుగా కనెక్ట్ చేసుకోవచ్చు.

  • బ్రాండ్- బ్లౌపున్కట్
  • మోడల్- BTW07 ANC మోక్ష
  • బ్యాటరీ టైప్- Li-Polymer
  • ప్లేబ్యాక్ టైమ్- 40 గంటలు
  • ఛార్జింగ్ టైప్- యూఎస్​బీ
  • ఛార్జింగ్ టైమ్- 90 నిమిషాలు
  • ధర- రూ.1,999

8. Noise Buds VS104 Pro Specifications : ఈ మోడల్ ఇయర్​బడ్స్​​లో నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్​ ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 33.5 గంటల పాటు ప్లేబ్యాక్ టైమ్ వస్తుంది. వీటికి అదనంగా 5.2 బ్లూటూత్ కనెక్టివిటీ ఈ ఎయిర్​బడ్స్​లో ఉంది.

  • బ్రాండ్- నోయిస్​
  • మోడల్- బడ్స్ వీస్ 104 ప్రో
  • వారంటీ- ఒక సంవత్సరం
  • ఛార్జింగ్ టైప్- యూఎస్​బీ టైప్-సి
  • ఛార్జింగ్ టైమ్- 90 నిమిషాలు
  • ధర- రూ.1,699

9. PTron Zenbuds Pro1 Max Specifications : ఈ మోడల్ ఇయర్​బడ్స్​లో నాయిస్ క్యాన్సిలేషన్​ ఫీచర్​ ఉంది. ఈ ఇయర్​బడ్స్​​ను ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 80 గంటల ప్లేబ్యాక్​ టైమ్ ఉంటుంది. టైప్​-సీ ఛార్జింగ్, 5.3 బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ కూడా దీనిలో ఉంది.

  • బ్రాండ్- పీట్రాన్
  • మోడల్- జెన్ బడ్స్ ప్రో1 మ్యాక్స్
  • వారంటీ- ఒక సంవత్సరం
  • ఛార్జింగ్ - యూఎస్​బీ
  • ధర- రూ.1,673

10. Hungama HiLife Bounce 101 Specifications : ఈ మోడల్ ఇయర్ బడ్స్​ను మొబైల్ ఫోన్స్, పీసీ, ట్యాబ్లెట్​కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఒక సంవత్సరం వారెంటీ ఉంది. దీంతో పాటు 5 బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ కూడా ఉంది.

  • బ్రాండ్- హంగామా హైలైఫ్
  • మోడల్- బౌన్స్ 101
  • వారంటీ- ఒక సంవత్సరం
  • బ్యాటరీ టైప్- Li-ion
  • ప్లే బ్యాక్ టైమ్- 30 గంటలు
  • ఛార్జింగ్ టైమ్- 90 గంటలు

సైబర్ నేరగాళ్లు మీ ఐడెంటిటీని దొంగిలిస్తారు - పారా హుషార్! - What Is Identity Theft

మీ ఐఫోన్​కు 2 జతల AirPods​ కనెక్ట్ చేసుకోవచ్చు - ఎలాగో తెలుసా? - AirPods Share Audio Feature

ABOUT THE AUTHOR

...view details