Discounts on iPhone 16 Series:ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. టెక్ దిగ్గజం యాపిల్ తన లేటెస్ట్ 'ఐఫోన్ 16' సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ ఆఫర్లో 'ఐఫోన్ 16', 'ఐఫోన్ 16 ప్లస్', 'ఐఫోన్ 16 ప్రో', 'ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్' వంటి మోడల్స్‌పై గరిష్టంగా రూ. 5,861 వరకు తగ్గింపును పొందొచ్చు.
ఈ ఆఫర్ ఎక్కడంటే?:అమెరికాకు చెందిన యాపిల్ సంస్థ ఈ ఆఫర్లను చైనాలో ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా తన లేటెస్ట్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. వాస్తవానికి యాపిల్ చైనాలోని హువావే వంటి దేశీయ బ్రాండ్‌ల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. ఈ కారణంగా కంపెనీ చైనాలో మాత్రమే ఈ ఆఫర్లను అందిస్తోంది. ఇందులో గరిష్టంగా ఐఫోన్లపై 500 యువాన్ ($68.50 లేదా సుమారు రూ. 5,861) వరకు తగ్గింపు ఉంటుంది.
చైనాలో ఐఫోన్లపై ఆఫర్లే.. ఆఫర్లు:యాపిల్ వెబ్సైట్ ప్రకారం..ఎంపిక చేసిన పేమెంట్ ప్రాసెస్ ద్వారా కస్టమర్లు ఈ ఆఫర్లను పొందగలరు. వారు లేటెస్ట్ ఐఫోన్ మోడల్స్‌పై గరిష్టంగా 500 యువాన్ల వరకు తగ్గింపును పొందొచ్చు. కంపెనీ.. 'ఐఫోన్ 16 ప్రో', 'ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్'పై 500 యువాన్ల తగ్గింపును అందిస్తుంది. అదే సమయంలో 'ఐఫోన్ 16', 'ఐఫోన్ 16 ప్లస్' మోడల్స్‌ను కొనుగోలు చేసే వినియోగదారులు 400 యువాన్ల (సుమారు రూ. 4,690) డిస్కౌంట్‌ను పొందగలరు. అయితే ఈ డిస్కౌంట్లు పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. ఈ సేల్ జనవరి 4 నుంచి ప్రారంభమై 7వ తేదీ వరకు నాలుగు రోజులపాటు కొనసాగనుంది.
చైనా టాప్-5 లిస్ట్‌లో యాపిల్:గతేడాది లాస్ట్ క్వార్డర్లో యాపిల్ మరోసారి చైనా మార్కెట్‌లోని స్మార్ట్‌ఫోన్ తయారీదారుల టాప్-5 లిస్ట్‌లో చేరింది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (IDC) అందించిన డేటా ప్రకారం.. 2024 చివరి త్రైమాసికంలో యాపిల్ 15.6% మార్కెట్ వాటాతో చైనీస్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రెండో స్థానంలో నిలిచింది. అయితే ఇది 2023 మూడో త్రైమాసికంలో యాపిల్ వాటా కంటే తక్కువ. 2023 థర్డ్ క్వార్డర్లో యాపిల్ మార్కెట్ వాటా 16.1%.
2024 చివరి త్రైమాసికంలో చైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వివో అత్యధికంగా 18.6% వాటాను కలిగి టాప్ వన్‌లో నిలించింది. 15.6% మార్కెట్ వాటాతో యాపిల్ రెండో స్థానంలో, 15.3% వాటాతో హువావే మూడో స్థానంలో నిలిచాయి. షావోమీ (14.8%) నాలుగో స్థానంలో, హానర్ (14.6%) ఐదో స్థానంలో ఉన్నాయి. ఇవి కాకుండా చైనాలో ఇతర బ్రాండ్ల మొత్తం మార్కెట్ వాటా 21.1%.