తెలంగాణ

telangana

ETV Bharat / technology

ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్లు- రూ. 64,499కే కొనుగోలు చేయొచ్చు!- ఎక్కడంటే? - IPHONE 16 PRICE DROP

ఐఫోన్ 16 కొనాలంటే ఇదే సరైన సమయం- ఫ్లిప్​కార్ట్​లో భారీ డిస్కౌంట్లు!

Apple iPhone 16
Apple iPhone 16 (Photo Credit- Apple)

By ETV Bharat Tech Team

Published : Jan 15, 2025, 2:06 PM IST

iPhone 16 at Lowest Ever Price:ఫ్లిప్‌కార్ట్ ఈ ఏడాది నిర్వహిస్తున్న తన మాన్యుమెంటల్ సేల్‌లో ఐఫోన్​ 16పై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. మరికొన్ని రోజుల్లో రానున్న రిపబ్లిక్​ డే సందర్భంగా కంపెనీ ఈ ఐఫోన్ మోడల్​పై అదిరే ఆఫర్లు తీసుకొచ్చింది. దీంతో ఈ సేల్​లో ఐఫోన్ 16ను భారీ తగ్గింపుతో కొనుగోలు చేయొచ్చు.

రూ. 64,499కే ఐఫోన్ 16!:'ఐఫోన్ 16' 128GB మోడల్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ యాప్, వెబ్‌సైట్‌లో రూ.67,999కి అందుబాటులో ఉంది. అయితే ఈ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్ ప్లస్, ప్రీమియం సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉంది. నాన్-మెంబర్స్​కు అయితే ఈ ఐఫోన్​ రూ.69,999 తగ్గింపు ధరతో లభిస్తుంది. అంతేకాక ఎంపిక చేసిన బ్యాంక్ డిస్కౌంట్లతో మీరు ఈ ఐఫోన్ 16 మోడల్​ను రూ. 64,499కే పొందొచ్చు.

బ్యాంక్ ఆఫర్ల వివరాలు ఇవే!:యాపిల్ ఐఫోన్ 16 కొనుగోలుదారులు ఎంపిక చేసిన బ్యాంక్ ఆఫర్‌లతో రూ. 3,500 వరకు అదనపు తగ్గింపును పొందొచ్చు. దీంతో ఈ స్మార్ట్​ఫోన్ ధర మరింత తగ్గుతుంది. మీరు ఫ్లిప్‌కార్ట్ ప్లస్/ప్రీమియం సభ్యులు అయితే, ఐఫోన్ 16 బేస్ మోడల్‌ను రూ. 64,499కే పొందొచ్చు. అదే సమయంలో నాన్-మెంబర్స్​ ఈ సెల్‌లో దీన్ని రూ.66,499కు పొందొచ్చు. ఈ ఆఫర్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.

ఐఫోన్ 16 డెలివరీ ఆఫర్లు:పైన పేర్కొన్న డిస్కౌంట్లతో పాటు, ఫ్లిప్‌కార్ట్ఐఫోన్ 16 మోడల్​తో 16 నిమిషాలు, ఒక రోజు ఎక్స్‌ప్రెస్ డెలివరీని అందిస్తోంది. అయితే ఈ సర్వీస్ ఎంపిక చేసిన పిన్ కోడ్‌లలో ఉన్నవారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఐఫోన్ 16 ఫీచర్లు:

డిస్​ప్లే: 6.1-అంగుళాల OLED స్క్రీన్

రిజల్యూషన్: 2556x1179 పిక్సెల్స్

డెన్సిటీ: 460 ppi పిక్సెల్

వాటర్, స్ప్లాషెస్, డస్ట్​ ప్రొటెక్షన్​తో ఈ ఐఫోన్ IP68 రేటింగ్​తో వస్తుంది.

కెమెరా:ఐఫోన్ 16లోని ముఖ్యమైన ఫీచర్లలో కెమెరా కంట్రోల్​ ఒకటి. ఇది విజువల్ ఇంటెలిజెన్స్​కు క్విక్​ యాక్సెస్​ను అందిస్తుంది. యూజర్లు ఆబ్జెక్ట్స్, లొకేషన్​లను గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ ఫొటోలు తీసేందుకు, వీడియోలను రికార్డ్ చేసేందుకు త్వరిత కెమెరా యాక్సెస్‌ను అందిస్తుంది.

ఐఫోన్ 16లో 48MP ఫ్యూజన్ కెమెరా ఉంది. ఇందులో 2x టెలిఫోటో లెన్స్, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఇది సెల్ఫీల కోసం ƒ/1.9 ఎపర్చర్‌తో 12MP ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంది.

వీటితో పాటు ఇందులో ఆడియో మిక్స్ వంటి కొత్త ఆడియో ఎడిటింగ్ టూల్స్, ఫోన్ ఫోటో, వీడియో క్యాప్చర్‌ సపోర్ట్​, క్యాప్చర్ తర్వాత ఆడియో ఎడిటింగ్ టూల్స్​ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ మెషిన్ లెర్నింగ్ ద్వారా నాయిస్​ను తగ్గించగలదు. ఇది బ్యాక్​గ్రౌండ్ నాయిస్​ను తగ్గిస్తుంది. వీడియోగ్రఫీకి ఇది ఒక గ్రేట్ ఆప్షన్.

ప్రాసెసర్:A18 బయోనిక్ చిప్ ద్వారా ఆధారితమైన ఈ ఐఫోన్ 16 పెర్ఫార్మెన్స్​ను మెరుగుపరచడానికి యాపిల్ ఇంటెలిజన్స్ సెకండ్ జనరేషన్ 3-నానోమీటర్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. దీని 16-కోర్ న్యూరల్ ఇంజిన్ లార్జ్​ జనరేటివ్ మోడల్స్​ను రన్​ చేసేందుకు ఆప్టిమైజ్ చేశారు. దీంతో ఇది A16 చిప్ కంటే రెండు రెట్లు వేగంగా మెషిన్ లెర్నింగ్ టాస్క్​లను నిర్వహిస్తుంది. అంతేకా 16-కోర్ CPU పనితీరును 30% పెంచుతుంది.

యాపిల్ ఇంటెలిజెన్స్: iOS 18 పై నడుస్తున్న ఈ ఐఫోన్ 16 యాపిల్ ఇంటెలిజెన్స్​ను కూడా కలిగి ఉంది. ఇది ఫ్రీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో లభించే అధునాతన ఫీచర్ల సూట్. యాపిల్ ఇంటెలిజెన్స్ iOS 18కి రైటింగ్ టూల్స్ తీసుకువస్తోంది. ఇవి వినియోగదారులు మెయిల్, నోట్స్, పేజెస్​తో పాటు థర్డ్-పార్టీ ప్లాట్‌ఫామ్‌ల వంటి యాప్‌లలో టెక్స్ట్‌ను రీరైట్ చేసేందుకు, ప్రూఫ్​రీడ్ చేసేందుకు ఉపయోగపడతాయి. అంతేకాక నోట్స్, ఫోన్ యాప్స్​లో యూజర్లు ఆడియోను కూడా రికార్డ్, ట్రాన్స్​స్క్రైబ్​ వంటివి చేయొచ్చు.

టాటా పంచ్ ధరల పెంపు- ఇప్పుడు అదనంగా రూ.17,090 ఖర్చు చేయాల్సిందే!

'మహా కుంభ్'​పై గూగుల్ గులాబీ రేకుల వర్షం!- మీరు కూడా ట్రై చేయొచ్చు- అదెలాగంటే?

పండగ వేళ చౌకైన రీఛార్జ్ ప్లాన్ లాంఛ్- రోజుకు రూ.8 కంటే తక్కువ ఖర్చుతో అన్​లిమిటెడ్ బెనిఫిట్స్!

ABOUT THE AUTHOR

...view details