OpenAI Tasks Virtual Assistant Feature: ఏఐ ఆధారిత చాట్‌జీపీటీని తీసుకొచ్చి సంచలనం సృష్టించిన ఓపెన్ఏఐ తాజాగా మరో అద్భుతమైన ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. 'Tasks' పేరుతో పరిచయం చేసిన ఈ ఫీచర్ చాట్‌జీపీటీ వినియోగదారులకు ఫ్యూచర్ యాక్షన్స్, రిమైండర్స్‌ను షెడ్యూల్ చేయడంలో సహాయపడుతుంది. ఈ ఫీచర్ లాంఛ్‌తో ఓపెన్ఏఐ సంస్థ గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి, అమెజాన్ అలెక్సాకు పోటీగా వర్చువల్ అసిస్టెంట్ రంగంలోకి ప్రవేశించాలని యోచిస్తోంది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్ బీటా యూజర్లకు అందుబాటులో ఉంది.
ఈ 'Tasks' ఫీచర్ ద్వారా చాట్‌జీపీటీ వినియోగదారులు కొన్ని స్పెసిఫిక్ టాస్క్‌లను నిర్వహించొచ్చు. అంటే ఉదాహరణకు మీకు ఇష్టమైన ఆర్టిస్ట్ కన్సర్ట్ కోసం టిక్కెట్లు కొనాలనుకుంటే, వాటి సేల్స్ ప్రారంభమైనప్పుడు మీకు గుర్తుచేయమని ఈ ఫీచర్‌కు చెప్పొచ్చు. దీనితో పాటు వీక్లీ న్యూస్ బ్రీఫింగ్స్, రోజువారీ వాతావరణ అప్డేట్స్ వంటి వాటిని తెలుసుకునేందుకు దీన్ని ఉపయోగించొచ్చు.
చాట్‌జీపీటీలో 'Tasks' ఫీచర్‌ను ఉపయోగించడం ఎలా?:
- చాట్‌జీపీటీలో ఈ ఫీచర్‌ను ఉపయోగించేందుకు మొదట సబ్‌స్క్రైబర్‌లు అందుబాటులో ఉన్న మోడల్స్ నుంచి '4o with scheduled tasks'ను సెలెక్ట్ చేసుకోవాలి.
- ఆ తర్వాత చాట్‌జీపీటీలో ఏం చేయాలనుకుంటున్నారో, ఎప్పుడు చేయాలనుకుంటున్నారో టైప్ చేయొచ్చు.
- ఈ ఫీచర్ మీ చాట్‌ల ఆధారంగా మీకు సూచనలను అందిస్తుంది. అయితే ఈ ఏఐ సూచనలను యాక్సెప్ట్ లేదా డిక్లైన్ చేసేందుకు కూడా మీకు అవకాశం ఉంటుంది. అన్ని టాస్క్‌లను నేరుగా చాట్ థ్రెడ్‌లలో లేదా ప్రొఫైల్ మెనూలోని 'Tasks' సెక్షన్ ద్వారా నిర్వహించొచ్చు.
ఫ్రీ చాట్‌జీపీటీ యూజర్లకు 'Tasks' అందుబాటులో ఉందా?: గతంలో ఓపెన్ఏఐ తన పెయిడ్ సబ్స్క్రైబర్ల కోసం చాట్‌జీపీటీ ఆధారిత వెబ్ సెర్చ్ ఫంక్షన్ 'SearchGPT'ని తీసుకొచ్చింది. దీన్ని ఫ్రీ యూజర్లకు కూడా అందిస్తామని హామీ ఇచ్చింది. 'SearchGPT' ఇప్పుడు రిజిస్ట్రర్డ్ చాట్‌జీపీటీ యూజర్లందరికీ అందుబాటులో ఉంది. అయితే 'Tasks' ఫీచర్ మాత్రం ప్రస్తుతం ఏఐ చాట్‌బాట్ పెయిడ్ సబ్స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఈసారి కాలిఫోర్నియాకు చెందిన ఈ AI రీసెర్చ్ కంపెనీ భవిష్యత్తులో ఫ్రీ యూజర్లకు కూడా దీన్ని తీసుకొస్తుందా లేదా అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అంటే 'Tasks' ఫీచర్ పెయిడ్ సబ్స్క్రైబర్లకు మాత్రమే పరిమితం చేసిన ప్రీమియం ఆఫర్ కావచ్చు.
ఆంపియర్ మాగ్నస్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంఛ్- ఒక్కసారి ఛార్జ్ చేస్తే 70-80 కి.మీ ప్రయాణం!
టాటా పంచ్ ధరల పెంపు- ఇప్పుడు అదనంగా రూ.17,090 ఖర్చు చేయాల్సిందే!
'మహా కుంభ్'పై గూగుల్ గులాబీ రేకుల వర్షం!- మీరు కూడా ట్రై చేయొచ్చు- అదెలాగంటే?
పండగ వేళ చౌకైన రీఛార్జ్ ప్లాన్ లాంఛ్- రోజుకు రూ.8 కంటే తక్కువ ఖర్చుతో అన్లిమిటెడ్ బెనిఫిట్స్!