తెలంగాణ

telangana

ETV Bharat / technology

యూజర్స్​కు షాక్​ ఇచ్చిన అమెజాన్- ఇకపై ప్రైమ్​ వీడియోలో యాడ్స్..! - AMAZON PRIME VIDEO

ఆదాయార్జనే ధ్యేయంగా అమెజాన్ కొత్త ప్లాన్​- యూజర్స్​కు ఇకపై వడ్డింపులే!!!

Amazon Prime Video
Amazon Prime Video (Etv Bharat)

By ETV Bharat Tech Team

Published : Oct 17, 2024, 6:58 PM IST

Amazon Prime Video:ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో తన ఆదాయాన్ని మరింత పెంచుకొనేందుకు కొత్త ప్లాన్​తో వస్తోంది. ఇప్పటివరకు తన స్ట్రీమింగ్‌ వేదికగా ఎటువంటి యాడ్స్‌ అందించని ఈ ప్లాట్‌ఫామ్‌ త్వరలోనే యాడ్స్ జోడించాలని చూస్తోంది. ఈ విషయాన్ని అమెజాన్‌ తన వెబ్‌సైట్‌ ద్వారా అధికారికంగా వెల్లడించింది. ఒకవేళ యాడ్‌- ఫ్రీ కంటెట్‌ కావాలనుకొనేవారు అధిక ధరతో తీసుకొచ్చే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ ఎంచుకోవాల్సి ఉంటుందని తెలిపింది.

వచ్చే ఏడాది నుంచే: ఆస్ట్రేలియా, కెనడా, మెక్సికో, బ్రిటన్‌, అమెరికాతో పాటు పలు యూరోపియన్‌ దేశాల్లోని యూజర్లకు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఇప్పటికే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో యాడ్స్‌ను జోడించింది. ఈ క్రమంలో ఇండియాలోనూ వచ్చే ఏడాది నాటికి ఈ ప్రకటనల్ని ప్రవేశపెట్టాలని చూస్తోంది. అంటే ఇకపై సినిమాలు, షోలు చూస్తున్న సమయంలో మధ్యలో యాడ్స్ రానున్నాయి.

ఆ కారణంగానే ఈ నిర్ణయం​: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ప్లాట్​ఫామ్​లో ఒకవేళ ప్రకటనలు వద్దనుకుంటే యాడ్‌-ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. వేగంగా అభివృద్ధి చెందుతూ పోటీ అధికంగా ఉన్న ఇండియా లాంటి మార్కెట్లలో కంటెంట్ కోసం పెట్టుబడులు అవసరమని, నిధులు సమకూర్చుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే ఇతర స్ట్రీమింగ్ ప్లాట్​ఫారమ్​లు, టీవీల కంటే తక్కువ యాడ్స్‌ తక్కువగానే ప్రసారం అవుతాయని తెలిపింది.

వచ్చే ఏడాదిలో ఎప్పటినుంచి ప్రైమ్‌ వీడియో యాడ్స్‌ జత చేయనుందో అమెజాన్ ప్రైమ్ వీడియో వెల్లడించలేదు. అయితే యాడ్‌-ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ గురించి పూర్తి వివరాలు, ప్రకటనలు యాడ్‌ చేసే ముందే సబ్​స్క్రైబర్స్​కు తెలియజేస్తామని మాత్రం వెల్లడించింది. ప్రకటనల ద్వారా వచ్చిన నిధులను యూజర్స్​కు మరింత కంటెట్‌ను అందించేందుకు ఉపయోగించనున్నట్లు కంపెనీ తన అధికారిక ప్రకటనలో తెలిపింది.

వారికి నో టెన్షన్​:అయితే అమెజాన్ ప్రైమ్​ వీడియో ప్లాట్​ఫామ్​లో వచ్చిన ఈ కొత్త మార్పు అమెజాన్‌ ప్రైమ్‌లైట్‌ మెంబర్లపై ఎటువంటి ప్రభావం చూపదు. ఎందుకంటే అందులో ఇప్పటికే యాడ్స్‌ వస్తున్నాయి. ఇండియాలో నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీ+ హాట్‌స్టార్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు యాడ్‌ ఫ్రీ ప్లాన్‌లు చాలా ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే.

ఆండ్రాయిడ్ 15 అప్​డేట్​ వచ్చేసిందోచ్​- ఈజీగా యాక్టివేట్ చేసుకోండిలా..!

మార్కెట్లోకి ఇన్ఫినిక్స్​ ఫస్ట్ ఫోల్డబుల్ మొబైల్- ధర ఎంతో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details