తెలంగాణ

telangana

ETV Bharat / technology

ఇకపై నో వర్క్ ఫ్రమ్​ హోమ్- దిగ్గజ టెక్ కంపెనీ అల్టిమేటం

'ఆఫీస్​కు రావాల్సిందే- లేకుంటే వేరే జాబ్ చూసుకోండి'

By ETV Bharat Tech Team

Published : 4 hours ago

Amazon AWS CEO on Work From Home Culture
Amazon AWS CEO on Work From Home Culture (ANI)

Work From Home Culture:కొవిడ్ విజృంభణ సమయంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్​ ఫ్రమ్​ హోమ్ వెసులుబాటు కల్పించాయి. ఆ తర్వాత వైరస్ ప్రభావం తగ్గడంతో ఆఫీసులకు రావాలని సూచించాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలు సంస్థలు.. ఉద్యోగులను ఆఫీసులకు రావాలంటూ పిలుపునిచ్చాయి. అయితే ప్రస్తుతం చాలా మంది వర్క్​ ఫ్రమ్ హోమ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఇంటి నుంచి పని చేయడానికే ఎక్కువశాతం మక్కువ చూపుతున్నారు.

అలాంటి ఉద్యోగులకు దిగ్గజ టెక్ సంస్థ అమెజాన్‌ఏడబ్ల్యూఎస్‌ షాక్ ఇచ్చింది. వారానికి ఐదు రోజులు కచ్చితంగా ఆఫీసుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. వర్క్​ ఫ్రమ్​ హోమ్​ కావాలంటే వేరే ఉద్యోగం వెతుక్కోవాల్సిందేనంటూ తేల్చి చెప్పింది. ఈ మేరకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు స్వస్తి పలకాలంటూ అమెజాన్‌ ఏడబ్ల్యూఎస్‌ సీఈవో మాట్ గార్మాన్ బహిరంగంగా వెల్లడించారు. ఈ నిర్ణయంపై ఇష్టం లేనివారు ఉద్యోగం వదిలేయొచ్చని ఆఫీస్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆయన అన్నారు.

"వారంలో ఐదు రోజులు తప్పనిసరిగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలి. 10 మంది ఉద్యోగుల్లో 9 మంది ఈ విధానాన్ని స్వాగతించారు. ఆఫీస్ వాతావరణంలో పనిచేయడానికి ఇష్టపడనివారు, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కావాలనుకునే వారికి బయట చాలా కంపెనీలు ఉన్నాయి. ఈ మేరకు కొత్త విధానాల అమలుకు కృషి చేస్తున్నాం. రిమోట్‌ వర్క్‌ కారణంగా కొత్త ఆవిష్కరణలు తీసుకురావడంలో సహకారం కష్టంగా మారుతోంది. మూడు రోజులు కార్యాలయానికి వచ్చి పనిచేస్తే కంపెనీ లక్ష్యాలను చేరుకోవడం చాలా కష్టం." - మాట్‌ గార్మాన్‌, అమెజాన్‌ ఏడబ్ల్యూఎస్‌ సీఈవో

ఈ కొత్త విధానం ఎప్పటినంచంటే?:అమెజాన్‌ సీఈవోగా యాండీ జెస్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానానికి ముగింపు పలకాలని నిర్ణయించారు. వారంలో మూడు రోజులు తప్పనిసరిగా కార్యాలయానికి రావాలని ఆయన ఆదేశించారు. కంపెనీలో ఆవిష్కరణలను మెరుగుపరచడానికి ఐదు రోజులు ఆఫీస్​కు రావడం చాలా అవసరమని ఆండీ జాస్సీ గత నెలలో ప్రకటించారు. ఈ కొత్త విధానాన్ని వచ్చే ఏడాది నుంచి అమలులోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం అమెజాన్​లో వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాలనే విధానం అమల్లో ఉంది.

కొత్త చీఫ్​ టెక్నాలజిస్ట్​ను నియమించిన గూగుల్- ఆయన ఎవరో తెలుసా?

యూత్​ఫుల్ లుక్​లో బజాజ్ పల్సర్​ N125- రిలీజ్ ఎప్పుడంటే?

ABOUT THE AUTHOR

...view details