Google for India:గూగుల్ ఇటీవల తీసుకొచ్చిన సరికొత్త ఏఐ జెమిని లైవ్ ఫీచర్ ఇకపై తెలుగులోనూ అందుబాటులోకి రానుంది. ఏటా నిర్వహించే గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్ 10వ ఎడిషన్ సందర్భంగా నేడు ఈ కీలక ప్రకటనలు చేసింది. ఈ సదుపాయాన్ని నేటి నుంచి హిందీలోనూ వినియోగించుకోవచ్చని గూగుల్ తెలిపింది. అలాగే, తెలుగు, తమిళం, బెంగాలీ, మరాఠీ, ఉర్దూ, గుజరాతీ, మలయాళం, కన్నడ భాషల్లో త్వరలోనే అందుబాటులోకి రానుందని వెల్లడించింది.
గూగుల్‌కు చెందిన జెమిని AIని 40 శాతం మంది వాయిస్ ఇన్‌పుట్ ద్వారా వినియోగిస్తున్నారని గూగుల్ తెలిపింది. కేవలం ఇంగ్లీష్‌కు మాత్రమే పరిమితమైన జెమిని లైవ్ వాయిస్ ఇన్‌పుట్ ఫీచర్‌ను.. నేటి నుంచి హిందీలోనూ అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. మరో 8 స్థానిక భాషలను త్వరలోనే జత చేస్తామని వెల్లడించింది. గూగుల్ ఏఐఓవర్‌వ్యూ సదుపాయం హిందీ భాషలో అందుబాటులో ఉండగా.. బెంగాలీ, తెలుగు, మరాఠీ భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు గూగుల్ పేర్కొంది.
కాగా ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గూగుల్ ఇటీవల సరికొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ ఆధారిత టూ-వే వాయిస్ చాట్ ఫీచర్ 'గూగుల్ జెమినీ లైవ్'ను ప్రారంభించింది. ఈ సరికొత్త ఫీచర్‌తో టైప్ చేయకుండానే దేని గురించి అయినా మాట్లాడొచ్చు. ఈ ఫీచర్‌పై మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.