5 Tips To Secure Your WhatsApp Account :నేడు వాట్సాప్వాడని వారంటూ లేరంటే అది అతిశయోక్తి కాదు. చాలా సులువుగా పర్సనల్ చాట్లు చేయడానికి, ఇతరులతో కమ్యునికేట్ కావడానికి వీలుగా ఉండడమే ఇందుకు కారణం. అయితే సైబర్ దాడులు పెరుగుతున్న నేటి కాలంలో, మీ వాట్సాప్ అకౌంట్‌ను సేఫ్‌గా ఉంచుకోవడం చాలా అవసరం. అందుకే ఈ ఆర్టికల్‌లో మీ వాట్సాప్ ఖాతాను సురక్షితంగా ఉంచుకునేందుకు అవసరమైన 5 టిప్స్ గురించి తెలుసుకుందాం.
1. టూ-స్టెప్ వెరిఫికేషన్ మస్ట్!
మీ వాట్సాప్ అకౌంట్‌కు కచ్చితంగా 'రెండు అంచెల ధ్రువీకరణ' (టూ-స్టెప్ వెరిఫికేషన్)ను ఎనేబుల్ చేసుకోవాలి. అలాగే దానికి పటిష్టమైన 6-అంకెల పిన్ (PIN)ను పెట్టుకోవాలి. ఆ పిన్ ఎవరూ ఊహించలేని విధంగా, చాలా పటిష్టంగా ఉండేలా చూసుకోవాలి. మీరు ఏదైనా కొత్త డివైజ్‌లో, లేదా వేరేవాళ్ల డివైజ్‌లో వాట్సాప్ ఉపయోగించినప్పుడు, ఎస్ఎంఎస్ ద్వారా వెరిఫికేషన్ కోడ్ వచ్చేలా చూసుకోవాలి. అప్పుడే మీ ఖాతా సురక్షితంగా ఉంటుంది.
2. ఫింగర్‌ప్రింట్/ ఫేస్ ఐడీ లాక్
మీ వాట్సాప్ చాట్ ఎవరూ చూడకుండా ఉండాలంటే, మీ ఫింగర్‌ప్రింట్/ ఫేస్ ఐడీ లాక్‌ను ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల, ఇతరులు ఎవ్వరూ మీ అనుమతి లేకుండా, మీ వాట్సాప్ చాట్‌ను చూడలేరు.
3. కంట్రోల్లో ఉంచుకోండి!
మీ వాట్సాప్ ప్రొఫైల్ ఫొటో, స్టేటస్, లాస్ట్ సీన్ స్టేటస్‌లను ఎవరెవరు చూడాలో మీరే నిర్ణయించుకోవాలి. మీ కాంటాక్ట్స్‌లో లేనివారు, అపరిచితులు మీ పర్సనల్ విషయాలు చూడకుండా మీరే స్వయంగా సెట్టింగ్స్ చేసుకోవాలి. ఇందుకోసం వాట్సాప్ ప్రైవసీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి, తగు మార్పులు చేసుకోవాలి.