తెలంగాణ

telangana

ETV Bharat / technology

హైబ్రిడ్ ఇంజిన్, కొత్త డిజైన్​తో.. కియా సెల్టోస్ వచ్చేస్తోంది!- రిలీజ్ ఎప్పుడంటే? - 2025 KIA SELTOS HYBRID

ఇండియన్ మార్కెట్లోకి 2025 కియా సెల్టోస్- వివరాలివే..!

2025 Kia Seltos Hybrid SUV Launched Soon
2025 Kia Seltos Hybrid SUV Launched Soon (Photo Credit- Kia Motors)

By ETV Bharat Tech Team

Published : Jan 1, 2025, 3:46 PM IST

2025 Kia Seltos Hybrid: కియా మోటార్స్ ఇండియా ఇటీవలే సైరాస్​ SUVని తీసుకొచ్చింది. ఇప్పుడు కంపెనీ సెల్టోస్ హైబ్రిడ్ వెర్షన్‌ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగా ఈ హైబ్రిడ్ కారును అనేక సార్లు పరీక్షించారు. కియా మోటార్స్ ఈ సెల్టోస్ నయా వెర్షన్​ను భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో లాంఛ్ చేయొచ్చు. ఈ కారు లుక్ దీని ప్రీవియస్ మోడల్ కంటే భిన్నంగా ఉంటుంది. దీని స్టైల్ అండ్ డిజైన్​లో కంపెనీ అనేక మార్పులు చేసింది.

కియా సెల్టోస్ హైబ్రిడ్ ప్రత్యేకత ఏంటి?:ఇది స్క్వేర్- షేప్డ్ హెడ్​ల్యాంప్స్​, LED డేటైమ్ రన్నింగ్ లైట్లను కలిగి ఉంటుంది. కంపెనీ దీని ఇంజిన్ గురించి ఇంకా ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు. అయితే ఇది టర్బో పెట్రోల్, టర్బో డీజిల్, పెట్రోల్ హైబ్రిడ్ వంటి ఫ్యూయల్ ఆప్షన్లతో వస్తుంది.

మార్కెట్లోకి ఎంట్రీ ఎప్పుడు?:కియా సెల్టోస్ రెండో వెర్షన్‌ను హైబ్రిడ్ ఇంజిన్‌తో భారత మార్కెట్లో విడుదల చేయొచ్చు. కియా ఇండియా 2025 మధ్యలో ఈ కొత్త సెల్టోస్ సేల్స్​ను ప్రారంభించొచ్చని సమాచారం. ఈ కియా సెల్టోస్ కొత్త వెర్షన్ కంటే ముందు కంపెనీ ఇండియన్ మార్కెట్లో దాదాపు 3 కొత్త మోడళ్లను విడుదల చేయనుంది.

ఇందులో కియా నుంచి కొత్త కాంపాక్ట్ SUV, కారెన్స్ ఫేస్‌లిఫ్ట్, కారెన్స్ EV ఉన్నాయి. ఇటీవల కంపెనీ కియా సైరాస్​ను తీసుకొచ్చింది. ఈ కారులో కంపెనీ పలు మార్పులు చేసింది. దీంతో ప్రస్తుతం ఇది మరింత విశాలంగా మారింది. అంతేకాక ఇందులో రిక్లైనింగ్ రియర్ సీటు కూడా ఉంది. దీని బుకింగ్స్ జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి నుంచి డెలివరీలు మొదలవుతాయని పేర్కొంది.

కియా సిరోస్ ఎస్‌యూవీ ఫీచర్లు: కియా సైరాస్​ ఎస్‌యూవీలో కంగొత్త ఫీచర్లు ఉన్నాయి. వీటిలో LED లైట్లు, LED DRLలు, పనోరమిక్ సన్‌రూఫ్, LED టెయిల్ లైట్లు, యాంబియంట్ లైట్లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, టెర్రైన్, డ్రైవింగ్ మోడ్స్, వెంటిలేటెడ్ సీట్స్, వైర్‌లెస్ ఛార్జర్, హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, లెవల్-2 ADAS, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. వీటితో పాటు ఈకారులో ABS, EBD, Isofix చైల్డ్ ఎంకరేజ్ కూడా అందించారు.

ఇంజిన్ ఆప్షన్స్:ఈ కొత్త కియా సైరాస్​లో రెండు ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మొదటిది 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్. ఇది 118bhp పవర్, 172Nm టార్క్ అందిస్తుంది. ఇక రెండోది 114bhp పవర్, 250Nm టార్క్ అందించే 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ స్టాండర్డ్‌గా అందుబాటులో ఉంటుంది. అయితే 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్, 7-స్పీడ్ DCT యూనిట్ ఆప్షన్లుగా అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు కియా సిరోస్ పూర్తి వివరాలను తెలుసుకునేందుకుఇక్కడ క్లిక్ చేయండి.

నో సబ్​స్క్రిప్షన్: 'యాపిల్ TV+'లో ఫ్రీ స్ట్రీమింగ్- న్యూఇయర్ ఆఫర్ అదిరిందిగా!

యాపిల్ లవర్స్​కు క్రేజీ అప్డేట్​- త్వరలో మార్కెట్లోకి మొట్ట మొదటి ఫోల్డబుల్ ఐఫోన్!

ఈ న్యూఇయర్​కి కొత్త కారు కొనాలా?- ఐతే ఈ SUVలపై ఓ లుక్కేయండి- వీటిలో మీ ఫ్యామిలీతో కూడా హాయిగా వెళ్లొచ్చు!

2025లో ఎన్ని గ్రహణాలు ఏర్పడతాయి? అవి ఏ రాశులపై ప్రభావం చూపిస్తాయి?

ABOUT THE AUTHOR

...view details