2024 BMW M2 Launched:మార్కెట్లోకి BMW నుంచి అదిరే లగ్జరీ కారు వచ్చింది. కంపెనీ తన అప్డేటెడ్ 'BMW M2' కూపే కారును ఇండియన్ మార్కెట్లో లాంఛ్ చేసింది. అదిరే కలర్ ఆప్షన్లతో స్టన్నింగ్ లుక్‌లో ఈ కారు ఎంట్రీ ఇచ్చింది. మరెందుకు ఆలస్యం దీని ధర, అప్డేటెడ్ ఫీచర్లపై ఓ లుక్కేద్దాం రండి.
పవర్‌ట్రెయిన్:ఈ కారులో BMW టర్బోచార్జ్డ్ 3.0-లీటర్ స్ట్రెయిట్ సిక్స్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 480hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది దీని ప్రీవీయస్ మోడల్ కంటే 20hp పవర్ ఎక్కువ. ఈ ఇంజిన్ 2,650-6,130rpm వద్ద 600Nm టార్క్ ఇస్తుంది. ఇది దీని పాత మోడల్ కంటే 50Nm టార్క్ ఎక్కువ.
అప్డేటెడ్ ఇంజిన్‌తో ఈ కారు 0.1 సెకన్లలో 0-100kph వేగాన్ని అందుకోగలదని BMW చెబుతోంది. ఈ ఇంజిన్‌కి 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జోడించారు. దీని ఆప్షనల్ 6-స్పీడ్ మాన్యువల్ మోడల్ 4.2 సెకన్లలో 0-100kph వేగాన్ని అందుకోగలదు. ఈ కారు టాప్ స్పీడ్ 250కిలోమీటర్లకు పరిమితం చేశారు. అయితే దీని స్పీడ్‌ను M డ్రైవర్ ప్యాకేజీ ఆప్షనల్తో 285kph వరకు పెంచుకోవచ్చు.
డిజైన్:2024 BMW M2 డిజైన్‌లో పెద్దగా మార్పులు ఏమీ చేయలేదు. కానీ ఈ కారు ఇప్పుడు అనేక కలర్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.
కలర్ ఆప్షన్స్:
- సావో పాలో ఎల్లో
- ఫైర్ రెడ్
- పోర్టిమావో బ్లూ
- స్కైస్క్రాపర్ గ్రే