ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నారా లోకేశ్​కు జెడ్​ కేటగిరి భద్రత - కేంద్ర హోం శాఖ నిర్ణయం - Z Category Security to Lokesh - Z CATEGORY SECURITY TO LOKESH

Z Category Security for Nara Lokesh : ఎన్నికల వేళ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ భద్రత పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. సీఆర్పీఎఫ్​ వీఐపీ బలగాలతో జెడ్​ సెక్యూరిటీని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కల్పించింది.

Nara Lokesh Security
Nara Lokesh Security

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 31, 2024, 7:31 AM IST

Z Category Security for Nara Lokesh : తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జెడ్ కేటగిరి భద్రత కల్పించింది. సీఅర్పీఎఫ్ (వీఐపీ వింగ్) బలగాలతో జెడ్ కేటగిరి సెక్యూరిటీని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఈ మేరకు కల్పించింది. అక్టోబర్ 2016 ఏఓబీ ఎన్​కౌంటర్​ తరువాత లోకేశ్​కు జెడ్ కేటగిరి భద్రత కల్పించాలని నాటి సెక్యూరిటీ రివ్యూ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే లోకేశ్​కు భద్రత తగ్గించారు. సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫార్సులు పక్కన పెట్టి లోకేశ్​కు రాష్ట్ర ప్రభుత్వం వై కేటగిరి మాత్రమే కల్పిస్తూ వచ్చింది.

తగిన భద్రత కల్పించాలంటూ 14 సార్లు రాష్ట్ర హోమ్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, గవర్నర్​లకు లోకేశ్​ భద్రతా సిబ్బంది లేఖలు రాశారు. భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని అనేక సార్లు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. యువగళం పాదయాత్రలో లోకేశ్​ లక్ష్యంగా అనేక సార్లు వైకాపా ప్రేరేపిత దాడులను రాష్ట్ర హోమ్ శాఖ, కేంద్ర హోమ్ శాఖ, గవర్నర్​లకు లోకేశ్​ భద్రతా సిబ్బంది వివరించారు.

గతంలో మావోయిస్టు హెచ్చరికలు, భద్రతా పరంగా ఉన్న నిఘా వర్గాల సమాచారాన్ని కూడా పరిశీలించిన కేంద్రం లోకేశ్​కు జెడ్ కేటగిరి భద్రత కల్పించింది.

Central Focus On Chandrababu And Lokesh Security: చంద్రబాబు, లోకేశ్ భద్రతపై దృష్టి సారించిన కేంద్రం

ABOUT THE AUTHOR

...view details