ETV Bharat / state

ఈ బాధలు భరించలేకపోతున్నాం - వంతెన ఎత్తు పెంచండి మహాప్రభో - VEMULURU BRIDGE PROBLEMS IN KADAPA

వైఎస్సార్ జిల్లాలోని వేములూరు వంతెనను ముంచెత్తిన సోమశిల వెనుక జలాలు, సగిలేరు నది నీరు - రాకపోకలు సాగించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు

Vemuluru Bridge Submerged due to Backwaters of Somasila
Vemuluru Bridge Submerged due to Backwaters of Somasila (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 19, 2024, 4:52 PM IST

Vemuluru Bridge Submerged Due to Backwaters of Somasila : వైఎస్సార్ జిల్లాలోని వేములూరు వంతెనను సోమశిల వెనక జలాలు, సగిలేరు నది నీరు ముంచెత్తాయి. దీంతో వంతెనపై ప్రజలు రాకపోకలు సాగించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎగువన కురిసిన వర్షాలు కారణంగా పెన్నా నది నీరు సోమశిల జలాశయంలో వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు జలాశయంలో 73 టీఎంసీల నీటిని నిలువరించారు.

జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు. సోమశిల జలాశయంలో నీటిమట్టం పెరిగినప్పుడల్లా వెనక వైపున ఉన్న వేములూరు వంతెన పూర్తిగా మునిగిపోతుంది. ఇలా కొన్ని నెలల పాటు నీరు నిలబడి ఉంటంవల్ల వంతెనపై పాచిపట్టి పాదచారులు ప్రమాదవశాత్తు కిందపడి ఒళ్లు హూనం చేసుకుంటున్నారు.

15 ఏళ్లుగా ఇదే దుస్థితి : అట్లూరు మండలంలోని ఏటికి అవతలో ఉన్న మన్యంవారిపల్లి, మాడపూరు, ముత్తుకూరు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీరు పెరిగినప్పుడల్లా 40 కిలోమీటర్లు బద్వేలు చుట్టి అట్లూరు మండల కేంద్రానికి చేరుకోవలసిన దుస్థితి ఏర్పడింది. రాను పోను 20 రూపాయలు అయ్యే రవాణా ఖర్చు ఇప్పుడు రూ. 200 అవుతోంది. దీంతో పేద ప్రజలకు భారంగా మారింది.

రుషికొండలో తేలియాడే వంతెన-సాధ్యాసాధ్యాల పరిశీలన

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ వంతెనను నిర్మించకుండా నిర్లక్ష్యం వహించడంతో ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వమైనా స్పందించి వంతెన ఎత్తు పెంచాలని కోరుతున్నారు.

"సోమశిల జలాశయం నిండినప్పుడల్లా వెనుకవైపున ఉన్న వేములూరు వంతెన మునిగిపోతుంది. దీంతో వంతెనపై రాకపోకలు సాగించలేక పోతున్నాం. దీంతో 40 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది. 20 రుపాయలు అయ్యే రవాణా ఖర్చు రూ.200 అవుతోంది. గత 15 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి ఉంది. ఈ సమస్యపై అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వంతెన ఎత్తును పెంచాలని కోరుతున్నాం." - స్థానికులు

శ్రీశైలం సిగలో మరో ఐకానిక్‌ వంతెన - పర్యాటకుల మనసు దోచేలే ప్రయాణం

గౌతమి మధ్యలంక ప్రాంతాల్లో చిరుత అలజడి! - డ్రోన్లతో గాలింపు చేపట్టిన అటవీ శాఖ - Leopard movement in East Godavari

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.