YSRCP Social Media Activist Apology Letter : ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు నోటికి ఏది వస్తే అది.. సమాజం ఏం అనుకుంటుందో కూడా ఆలోచించకుండా టీడీపీ, జనసేన నాయకులు, వారి కుటుంబ సభ్యులపై ఇష్టారాజ్యంగా కొందరు నోరు పారేసుకునేవారు. ఇప్పుడు వారంతా యూటర్న్ అవుతున్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కేసులు, అరెస్టుల నేపథ్యంలో కాళ్ల బేరానికే వస్తున్నారు. తప్పయింది.. క్షమించండి అంటూ సోషల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేయడంతో పాటు లెటర్లు సైతం రాస్తున్నారు. మరికొంత మందైతే సోషల్ మీడియాలో అకౌంట్లను డీ యాక్టివేట్ చేస్తున్నారు.
మరికొంత మంది అజ్ఞాతంలోకి వెళ్లి తమను, తమ కుటుంబ సభ్యులను క్షమించి వదిలేయాలంటూ పేజీలకు పేజీల లెటర్లను రాస్తున్నారు. ఇప్పటికీ పక్కోడి మీద పడి నోటికి వచ్చిన మాటలు అన్నవారు వారి మీదకు వచ్చేసరికి ఇలా లేఖలను రాస్తున్నారు. ఈ తరుణంలో ఓ వైఎస్సార్సీపీ సానుభూతి పరురాలు, నటి తనను క్షమించి విడిచిపెట్టాలంటూ బహిరంగంగానే లేఖ లేఖ రాశారు. తనను ఇక వదిలేయాలంటూ ఐదు రోజుల క్రితం ఓ వీడియోను సైతం విడుదల చేసిన ఆమెపై అనంతరం కేసు నమోదు అయింది.
వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్‌కు కానీ, పార్టీకి కానీ వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మాట్లాడితే, పోస్టులు చేస్తే చాలు పచ్చి బూతుల పురాణాలు అందుకుంటూ రెచ్చిపోయి వీడియోలు విడుదల చేసిన ఓ నటి.. ఇప్పుడు లోక్‌శ్ అన్నా.. క్షమించు అంటూ కాళ్ల బేరానికి వచ్చింది. తన వల్ల తప్పయిందని మళ్లీ జీవితంలో ఇటువంటి తప్పు చేయనంటూ లేఖను రాసింది. అప్పుడు తెలియలేదు.. ఇప్పుడు నా వరకు వచ్చేసరికి ఏంటో అర్థమవుతుందంటూ క్షమించమని వేడుకుంది.