Sharmila slams Jagan: అరకు ఎమ్మెల్యే ఏమైన పనికి వచ్చాడా ?, అంతా దోపిడీ అంట కదా, అరకు అభివృద్ధి ఏమైనా జరిగిందా అంటూ ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్లూరి జిల్లాలో షర్మిల పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె, సీఎం జగన్పై నిప్పులు చెరిగారు. 600 కోట్లతో అరకు అభివృద్ధి చేస్తామని చెప్పి, కనీసం రూ. 6 లక్షలు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. టూరిజం అభివృద్ధి అయి ఉంటే ఎంతో మందికి జీవనోపాధి దొరికేదని వెల్లడించారు.
జిల్లాకు ట్రైబల్ యూనివర్సిటీ అన్నారు దిక్కులేదు - మెడికల్ కాలేజి అన్నారు పెట్టలేదు - ఇంజనీరింగ్ కాలేజి అన్నారు కట్టలేదు ఇది గిరిజనులపై జగన్ కి ఉన్న ప్రేమ అని షర్మిల పేర్కొన్నారు. వైఎస్ఆర్ హయాంలో రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చారని ఆమె గుర్తుచేశారు. అరకు ప్రాంతంలో యదేచ్ఛగా మైనింగ్ మాఫియా జరుగుతుందని, గుట్టలు గుట్టలు అదానీ, అంబానీలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ గతంలో ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదని, 10 ఏళ్లు రాష్ట్రాన్ని బాబు, జగన్ కలిసి సర్వనాశనం చేశారని షర్మిల మండిపడ్డారు. అభివృద్ధిలో ఏపీ 20 ఏళ్ల వెనక్కు వెళ్ళిపోయిందని షర్మిల ఆరోపించారు.
సొంత చెల్లెలు చీర గురించి సీఎం జగన్ మాట్లాడటం దౌర్భాగ్యం: రామకృష్ణ - CPI Ramakrishna Fire on CM Jagan
రాష్టానికి కనీసం రాజధాని లేదని, మూడు రాజధానులు అని చెప్పి జగన్ మోసం చేశాడని షర్మిల దుయ్యబట్టారు. అమరావతి పేరుతో బాబు భ్రమరావతి చేశాడని ఎద్దేవా చేశారు. ప్రజల అవసరాలు ఏంటో తెలుసుకొనే ముఖ్యమంత్రి లేనే లేడని, ప్రజలను కలిసే సీఎం లేనే లేడన్నారు. ప్రజలకు అపాయింట్ మెంట్ లేదు, ఎమ్మెల్యేలకు, మంత్రులను కలవడని షర్మిల విమర్శించారు. ప్రతిపక్షంలో ఉండగా మద్య నిషేధం అని చెప్పి, అధికారంలోకి రావడంతో మోసం చేశాడని షర్మిల పేర్కొన్నారు. పైగా సర్కార్ మద్యం ఆమ్ముతుంది, అదికూడా కల్తీ మద్యం అంటూ ఎద్దేవా చేశారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారని దుయ్యబట్టారు.
ఐదేళ్లు ఉద్యోగాలివ్వకుండా ఇప్పుడు మేల్కొంటారా - జగన్పై మండిపడ్డ షర్మిల - YS SHARMILA ELECTION CAMPAIGN
బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని మోసం చేసిందని, విభజన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని పేర్కొన్నారు. హోదా 10 ఏళ్లు ఇస్తామని మోసం చేశారని షర్మిల వెల్లడించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని, కాంగ్రెస్ తోనే ప్రత్యేక హోదా వస్తుందని తెలిపారు. అధికారంలో రాగానే 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని షర్మిల హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే 2.25లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. వృద్ధాప్య పెన్షన్ల ను 4 వేలు..వికలాంగుల పెన్షన్ 6 వేలు ఇస్తామని, రుణమాఫీ 2 లక్షలు చేస్తామన్నారు. ఇళ్లు లేని పేద కుటుంబానికి 5 లక్షలతో పక్కా ఇళ్లు కట్టిస్తామని తెలిపారు. ప్రతి పేద మహిళకు ఏడాదికి లక్ష ఆర్థిక సహాయం అందించే దిశగా కృషి చేస్తామని షర్మిల హామీ ఇచ్చారు.
రాజధాని కట్టలేని నేతలకు ఓట్లేందుకు?- రైతులకు అన్యాయం జరుగుతుంటే జగన్ ఏం చేస్తున్నారు: షర్మిల - YS SHARMILA ELECTION CAMPAIGN