ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా ఆటపాటలతో అలరించిన సంక్రాంతి సంబరాలు - STATE WIDE SANKRANTI CELEBRATIONS

ముగ్గుల పోటీలు, ఎడ్ల బలప్రదర్శనలతో పల్లెలు కళకళ-ఆత్మీయులంతా ఒకేచోట చేరి విందు ఆరగింపు

state_wide_sankranti_celebrations
state_wide_sankranti_celebrations (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 15, 2025, 8:36 AM IST

State Wide Sankranti Celebrations : సంబరాల సంక్రాంతితో పల్లెల్లో సందడి నెలకొంది. రంగురంగుల ముగ్గులతో పండుగకు ఆహ్వానం పలికారు. ఘుమఘుమలాడే పిండివంటలతో అతిథి మర్యాదలు అదరహో అనిపించాయి. పండుగ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు సంక్రాంతి శోభను రెట్టింపు చేశాయి.

రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు హోరెత్తుతున్నాయి. ఊరూవాడా చిన్నాపెద్దా ఆటపాటలతో ఆనందంలో మునిగి తేలుతున్నారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం కరవంజలో జిల్లాస్థాయి బలప్రదర్శన పోటీలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వస్తాదులు పోటీల్లో పాల్గొన్నారు. నరసన్నపేటలో కలింగ కోమట్ల సామాజికవర్గం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

సందడిగా గ్రామీణ ప్రాంతాలు - కోడిపందేల్లో చేతులు మారుతున్న కోట్లు

Sankranti Cultural Programs in Andhra Pradesh : కృష్ణా జిల్లా పామర్రు మండలం పెరిశపల్లిలో చెరుకూరి కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి సంక్రాంతి పండుగ ఘనంగా నిర్వహించుకున్నారు. వివిధ దేశాల్లో స్థిరపడిన చెరుకూరి వంశీయులంతా ఈ పండుగకు తరలివచ్చారు. నెల్లూరులో పెద్దల పండుగ వేడుకగా జరిగింది. బోడిగాడితోట శ్మశాన వాటికకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు తమ ఆత్మీయులను తలచుకుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, ఆనం రాంనారాయణరెడ్డి పాల్గొన్నారు.

తిరుపతి జిల్లా నాయుడుపేట గాంధీపార్కు వద్ద సంక్రాంతి సందర్భంగా మహిళలకు ముగ్గులపోటీ నిర్వహించారు. ఎమ్మెల్యే విజయశ్రీ, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యం పోటీలను ప్రారంభించారు. పుట్టపర్తి శిల్పారామంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జబర్దస్తు టీం ఆకట్టుకుంది. కదిరి మండలం పట్నంలో ఎడ్లబండ్ల పోటీలు కోలాహలంగా సాగాయి. కర్నూలు జిల్లా పెద్దహుల్తిలో మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించారు.

మకర సంక్రాంతిని పురస్కరించుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం వద్ద మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారు జామున అభిషేకం చేపట్టి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం సంక్రాంతి పండుగ ఉట్టి పడేలా హరిదాసు, గంగిరెద్దు చిత్రపటాలు, చెరుకు గడలు, గాలిపటాలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు

కత్తి కట్టొద్దని పోలీసులు హెచ్చరించినా పందెం రాయుళ్ల పంతమే నెగ్గింది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.