Stone Attack on CM Jagan :ముఖ్యమంత్రి జగన్‌పై జరిగిన రాయి దాడి కేసులో నిందితుడు వేముల సతీష్ జైలు నుంచి విడుదలయ్యారు. నెల్లూరు కేంద్ర కార్యాలయంలో రిమాండ్ ఖైదీగా ఉన్న సతీష్‌కు కోర్టు షరతులతో కూడిన బైయిల్ మంజూరు చెయ్యడంతో జైలు నుంచి విడుదల చేశారు. రెండు రోజుల క్రితమే విడుదల కావాల్సిన సతీష్, కొన్ని కారణాలతో ఈరోజు జైలు నుంచి బయటకు వచ్చారు. తండ్రి దుర్గారావు, తల్లి రమణ, డిఫెన్స్ లాయర్ అబ్దుల్ సలీంలు నెల్లూరుకు వచ్చే సతీష్‌ను విజయవాడ తీసుకెళ్లారు.
చంద్రబాబుకు ఘన స్వాగతం - శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తమ్ముళ్ల సందడి - Chandrababu Return From Foreign
ఏప్రిల్ 13న సీఎం జగన్‌పై గులకరాయ దాడి జరిగింది. ఈ దాడి కేసు దర్యాప్తు చేసిన పోలీసులు సతీషే దాడి చేసినట్లు ఆరోపిస్తూ అరెస్ట్ చేశారు. బెయిల్‌పై బయటకు వచ్చిన సతీష్ ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులే కేసు ఒప్పుకోవాలని రివాల్వర్‌తో తనను భయపెట్టారని సతీష్ ఆరోపించారు. తన పుట్టినరోజు కావడంతో వేడుకలు చేసుకున్నందునే తనను అనుమానితులుగా అరెస్ట్ చేశారని చెప్పారు. చీకటి ప్రాంతంల్లో తిప్పుతూ తనకు రెండు లక్షలు ఇస్తామని గన్ పెట్టి పోలీసులు బెదిరించినా తాను కేసు ఒప్పుకోలేదన్నారు. సతీషే దాడి చేసినట్లు పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవని డిఫెన్స్ లాయర్ అబ్దుల్ సలీం వెల్లడించారు.
కాగా ముఖ్యమంత్రి జగన్‌పై రాయి విసిరిన కేసులో నిందితుడిని ఏప్రిల్ 18వ తేదీన అరెస్టు చేసినట్లు చూపించారు. అజిత్‌సింగ్‌నగర్ వడ్డెర కాలనీకి చెందిన వేముల సతీష్‌ని నిందితుడిగా తేల్చారు. అయితే ఏ1గా సతీష్‌ను చూపించిన పోలీసులు ఏ2 ప్రోద్బలంతో జగన్‌పైకి రాయి విసిరాడని చెబుతున్నారు. కానీ అలా ప్రోత్సహించిన వ్యక్తి ఎవరన్నది మాత్రం తేల్చకుండానే కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించారు. నిందితుడికి మే 2వ తేదీ వరకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.