తెలంగాణ

telangana

ETV Bharat / state

ఊరంతా ఒక్కటై అంత్యక్రియలు నిర్వహించారు - ఎవరికో తెలిస్తే షాక్ అవుతారు

మానవత్వం చాటుకున్న కొంతమంది యువకులు - టపాసులు కాలుస్తూ, డప్పు చప్పులతో వానరానికి ఘనంగా అంత్యక్రియలు

MONKEY FUNERAL IN NALGONDA DISTRICT
Youth Conducted Funeral for Monkey in Nalgonda (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 26, 2024, 10:50 PM IST

Youth Conducted Funeral for Monkey in Nalgonda : ఒకప్పుడు అయితే బంధువులో లేక తెలిసివారో అనారోగ్యానికి గురైతే తెలిసిన వెంటనే పండ్లు తీసుకుని పలకరించడానికి వెళ్లేవాళ్లం. కానీ ప్రస్తుతం ఎవరికి వారు బిజీ బిజీగా ఉంటున్నారు. కొందరికి అయితే బంధువుల్లో ఎవరు ఏం అవుతారో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇలాంటి బిజీ లైఫ్​లో కొంతమంది జంతువుల పట్ల సానుభూతి, ప్రేమ చూపిస్తుంటే ఇప్పటికీ మానవత్వం, ప్రేమానురాగాలు బతికే ఉన్నాయని అనిపిస్తోంది. కనీసం రోడ్డు ప్రమాదంలో ఎవరైనా గాయపడినా, చనిపోయినా మనకెందుకులేనని వెళ్లిపోయే ఈరోజుల్లో ఓ వానరానికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించిన ఘటన హృదయానికి హత్తుకుంటోంది.

కొంతమంది యువకులు వానరానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. నల్గొండ జిల్లాలోని తిప్పర్తి మండలం నూకలివారి గూడెం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శనివారం గ్రామంలో ఓ కోతి పిల్లా విద్యుత్ షాక్​కు గురై చనిపోయింది. ఇది గమనించిన కొంతమంది యువకులు, మృతి చెందిన కోతి కోసం పాడె కట్టారు. ఈ నేపథ్యంలో గ్రామంలోని టపాసులు కాలుస్తూ, డప్పు చప్పులతో మనుషులకు అంత్యక్రియలు ఏ విధంగా అయితే నిర్వహిస్తామో అదే విధంగా కోతికి కూడా అలానే ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు.

అందరి మన్ననలు పొందిన యువకులు : కోతి మృతదేహాన్ని గ్రామంలో ఊరేగిస్తూ చివరిగా సంప్రదాయబద్ధంగా ఓ ప్రదేశంలో ఖననం చేశారు. ప్రస్తుతం కోతి అంత్యక్రియల వీడియో సోషల్​ మీడియాలోనూ వైరల్​ అయింది. దీంతో నెటజన్లు సైతం కోతికి అంత్యక్రియలు నిర్వహించిన యువకులను ప్రశంసిస్తున్నారు. అయినవారు చనిపోతేనే పట్టించుకోని నేటి సమాజంలో ప్రమాదవశాత్తు మృతిచెందిన ఓ వానరానికి అంత్యక్రియలు నిర్వహించడం చాలా గ్రేట్​ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరోవైపు ఇటీవలే ఓ గ్రామంలోని ఇళ్ల పైకప్పులపై దూకుతూ అక్కడి ప్రజలను కాస్త ఇబ్బందులకు గురి చేసిన కోతిని అక్కడి గ్రామస్థులు చేరదీశారు. కోతి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుందని గమనించిన వారు, దానికి చికిత్స చేయించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పశువైద్యులను గ్రామానికి పిలిపించి గత కొంత కాలంగా వైద్యం అందించారు. అయితే కోలుకుంటున్నట్లే అనిపించినా ఆ వానరం ఉన్నట్టుండి ఒక్కసారిగా ప్రాణాలు విడిచింది. దీంతో గ్రామస్థులందరూ ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అందరూ చందాలు వేసుకొని హిందు సంప్రదాయం ప్రకారం చివరి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వీడియో కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

దాహంతో కిటికీ వద్ద దీనంగా వానరం - నీళ్లు తాగించి మానవత్వం చాటుకున్న భక్తుడు - man gave monkey water Video

Monkey funeral Bhupalpally : భవనంపై నుంచి కిందపడి కోతి మృతి.. వానరానికి యజమాని కన్నీటి వీడ్కోలు

ABOUT THE AUTHOR

...view details