తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇదెక్కడి దారుణం సామీ - వడ్డీ డబ్బుల కోసం అన్నావదినలను కట్టేసిన తమ్ముడు - Brothers fight for interest money

Conflict Between Brothers Over Interest Money : కేవలం వడ్డీ డబ్బులు చెల్లించలేదని అన్నా వదినలను తమ్ముడు రెయిలింగ్​కు​ కట్టేసి కొట్టిన అమానవీయ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు అన్నను విడిపించడంతో బాధితులు బయటపడ్డారు. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Conflict Between Brothers Over Interest Money
Conflict Between Brothers Over Interest Money (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 17, 2024, 8:47 AM IST

Younger Brother Tied his Older Brother to Railing in Siddipet : అన్నదమ్ముల బంధం అంటే జీవితాంతం కలిసిమెలసి ఒక్కటిగా ఉండటమే. వారి మధ్య ఎలాంటి తగాదా వచ్చినా ఆ క్షణానికి గొడవపడినా, కాసేపటి తర్వాత ఇద్దరూ కలిసిపోతారు. కానీ వేరే వ్యక్తులు వారి జోలికి వస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరు. ఇద్దరూ కలిసే ఆ సమస్యను ఎదుర్కొంటారు. ఇది ఒకప్పటి అన్నదమ్ముల అనుబంధం. కానీ ఈ మధ్యకాలంలో ఆ అన్నదమ్ముల అనుబంధం పూర్తిగా నాశనం అయిపోతోంది. కేవలం తాత్కాలిక సుఖాల మోజులో పడి, ముఖ్యంగా డబ్బు అనే విషయంలో వారి బంధం బీటలు బారుతుంది. ఇందుకు చాలానే ఉదాహరణలు ఉన్నా, తాజాగా సిద్దిపేట జిల్లాలో జరిగిన ఘటన అందరినీ కలచివేస్తోంది. తీసుకున్న అప్పు చెల్లించలేదని తోడబుట్టిన అన్ననే తాడుతో కట్టేశాడు తమ్ముడు.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, సిద్దిపేట జిల్లాలోని నాసర్​పురా వీధిలోని రెండు పడక గదుల ఇళ్ల సముదాయం (కేసీఆర్​నగర్​)లో నివాసం ఉండే దొంతరబోయిన పర్శరాములు భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని కుటుంబ అవసరాల నిమిత్తం తన తమ్ముడైన కనకయ్య వద్ద ఏడాది క్రితం రూ.1.20 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఆ అప్పును నాలుగు నెలల క్రితం రూ.1 లక్ష తీర్చేశాడు. మిగిలిన రూ.20 వేలతో పాటు అసలుకు వడ్డీ ఇవ్వాలంటూ తమ్ముడు నిత్యం అన్నను అడిగేవాడు.

ఈ క్రమంలోనే శుక్రవారం పంచాయతీ కోసం కౌన్సిలర్​ ఇంటికి అన్నదమ్ములు వారి కుటుంబ సభ్యులతో వెళ్లారు. అక్కడ కూడా వారిరువురు గొడవ పడటంతో వారిని కౌన్సిలర్​ ఇంటి నుంచి బయటకు పంపించేశారు. అక్కడి నుంచి వెళ్లిపోతున్న పర్శరాములును అతని సోదరుడు కనకయ్య, కనకయ్య భార్య భాగ్య, కుమారుడు భాను లాక్కొచ్చి సమీపంలోని ఆలయ ప్రాంగణంలోని రెయిలింగ్​కు తాడుతో కట్టేశారు. అనంతరం చేతులతో పర్శరాములును కొట్టారు.

ఈ అమానవీయ ఘటనను అడ్డుకోవడానికి ప్రయత్నించిన పర్శరాములు భార్య తారను సైతం రెయిలింగ్​కు కట్టేశారు. దీంతో అక్కడ కాసేపు భయానక వాతావరణం నెలకొంది. అక్కడికి చేరుకున్న స్థానికులు బాధితులను విడిపించారు. ఆ తర్వాత కనకయ్య కుటుంబీకులను మందలించారు. అనంతరం బాధితులు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందారు. ఈ ఘటనపై వన్​టౌన్​ పోలీసు స్టేషన్​లో పర్శరాములు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

చావులోనూ తమ్ముడుకి తోడుగా అన్న - ఒకే చితిపై ఇద్దరకీ దహన సంస్కారాలు

భూవివాదంలో రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు అన్నదమ్ముల పరస్పర దాడులు

ABOUT THE AUTHOR

...view details