తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇన్​స్టాగ్రామ్​లో పరిచయం - ప్రేమ పెళ్లిగా మారేలోపు యువకుడు ఆత్మహత్య- ఏమైందంటే? - Young Man Suicide due to Love - YOUNG MAN SUICIDE DUE TO LOVE

Young Man Suicide in Sangareddy : ఇన్​స్టాగ్రామ్​లో ఓ యువతితో పరిచయం ప్రేమగా మారింది. కొన్ని రోజులకి పెళ్లి చేసుకుందామని ఆ యువతి ఇంట్లో చెప్పింది. దీంతో ఆమె తండ్రి యువకుడిని కుటుంబసభ్యులతో రావాలని సూచించాడు. కానీ ఆ యువకుడు తన సోదరుడితో యువతి తండ్రిని కలిసేందుకు వెళ్లాడు. సీన్​ కట్ చేస్తే యువతి తరుఫు బంధువుల నుంచి ఆ యువకుడికి బెదిరింపు కాల్​​ వెళ్లింది. భయపడి ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది.

Crime News in Sangareddy
Young Man Suicide due to Love Failure (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 28, 2024, 8:30 PM IST

Updated : May 28, 2024, 8:37 PM IST

Young Man Suicide in Sangareddy : ప్రస్తుత రోజుల్లో కొంత మంది యువకులు చిన్న చిన్న విషయాలకు మనస్తాపం చెంది చనిపోయేందుకు సిద్ధమవుతున్నారు. మరికొందరు ప్రేమ విఫలమైతే ఆత్మహత్యను ఓ మార్గంగా ఎంచుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు తన ప్రేమ పెళ్లికి యువతి తండ్రి నిరాకరించాడని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారంసంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ మండలం ఆనెగుంటకు చెందిన పెద్దగొల్ల వెంకట్(30) నిజామాబాద్​ జిల్లాలోని బాల్కొండకు చెందిన యువతితో ఇన్​స్టాగ్రామ్​లో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. కొంతకాలం ఇన్​స్టాగ్రామ్​లో చాటింగ్​ చేసుకున్నారు. అనంతరం వారు ఇరువురు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆ యువతి తన తండ్రితో చెప్పింది. తరవాత వెంకట్​ను బాల్కొండకు రప్పించి, తన కుటుంబసభ్యులను తీసుకువచ్చి మాట్లాడాలని సూచించింది.

అనుమానాస్పద స్థితిలో యువకుడి ఆత్మహత్య - మృతికి అదే కారణమా? - YOUNG MAN SUICIDE In gundala mandal

Young Man Suicide due to Love: యువకుడు తన సోదరుడితో కలిసి బాల్కొండకు వెళ్లి యువతి తండ్రిని కలిశాడు. అయితే తండ్రిదండ్రులు లేకుండా వస్తావా అంటూ నిరాకరించి ఆయన వెనక్కి పంపించారు. గత మూడు రోజుల క్రితం వెంకట్​తో పాటు అతని తండ్రి జగన్నాథంకు యువతి తరుపు బంధువులు ఫోన్​ చేసి అమ్మాయికి చెందిన బంగారు ఆభరణాలు తీసుకున్నావని, దాని గురించి ఆదివారం(తరవాతి రోజు) మాట్లేందుకు రావాలని బెదిరించారు. ప్రేమ విఫలం కావడంతో పాటు బంగారం విషయంలో భయాందోళనకు గురి చేస్తున్నారని మనస్తాపంతో జహీరాబాద్​ సమీపంలోని పంట పొలాల్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

"ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిస్తే వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాం. విచారణ చేస్తే వెంకట్​​ అనే యువకుడు బాల్కొండకు చెందిన అమ్మాయిని ఇన్​స్టాగ్రామ్​లో పరిచయం చేసుకుని లవ్ చేసుకున్నారని తెలిసింది. వాళ్ల పెళ్లి అమ్మాయి ఇంట్లో ఇష్టం లేదు. తరవాత యువకుడు మసస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేశాం. దర్యాప్తు చేసి పూర్తి వివరాలు తెలియజేస్తాం." - ప్రసాద్ రావు, జహీరాబాద్ రూరల్ ఎస్ఐ

త్రినయని సీరియల్ నటుడు చందు ఆత్మహత్య - Serial Actor Chandu Suicide

Last Updated : May 28, 2024, 8:37 PM IST

ABOUT THE AUTHOR

...view details