ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాడిపత్రిలో బరితెగించిన వైసీపీ కార్యకర్తలు - బాలింత అని చూడకుండా - YCP Leaders Attack - YCP LEADERS ATTACK

YCP Leaders Attack: తాడిపత్రి మండలం బొడాయిపల్లి గ్రామంలో తెలుగుదేశం కార్యకర్త కృష్ణమూర్తి పై వైసీపీ నాయకులు రాళ్లతో దాడి చేశారు. ఏడు రోజుల బాలింత అయిన తన భార్యను ఓటు వేయించడానికి తీసుకెళ్తున్న కృష్ణమూర్తి పై వైసీపీ నాయకులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కృష్ణమూర్తి తలకు తీవ్ర గాయమై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

YCP Leaders Attack
YCP Leaders Attack (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 13, 2024, 2:29 PM IST

YCP Leaders Attack: తాడిపత్రిలో ఉద్రిక్త పిరిస్థితులు నెలకొన్నాయి. ఓటు వేసేందుకు వచ్చిన వ్యక్తిపై వైసీపీ మూకలు దాడికి పాల్పడ్డిన ఘటన తాడిపత్రిలో చోటు చేసుకుంది. వైసీపీ నేతల అరాచకాలను నిరసిస్తూ, టీడీపీ నేతలు గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా, బాలింత రాలైన తన భార్యతో కలిసి ఓటు వేయడానికి వెళ్తున్న కృష్ణమూర్తి అనే వ్యక్తిపై, వైసీపీ నేతలు దాడికి పాల్పడారు. ఈ ఘటనలో కృష్ణమూర్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి.

తాడిపత్రి మండలం బొడాయిపల్లి గ్రామంలో తెలుగుదేశం కార్యకర్త కృష్ణమూర్తి పై వైసీపీ నాయకులు రాళ్లతో దాడి చేశారు. ఏడు రోజుల బాలింత అయిన తన భార్యను ఓటు వేయించడానికి తీసుకెళ్తున్న కృష్ణమూర్తి పై వైసీపీ నాయకులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కృష్ణమూర్తి తలకు తీవ్ర గాయమై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంఘటన స్థలంలో పోలీసులు ఉన్న కనీసం వైసీపీ రౌడీ మూకలను నిలువరించే ప్రయత్నం చేయలేదని బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. పైగా పోలీసులే కృష్ణమూర్తిని పట్టుకొని వైసీపీ నాయకులు దాడికి పాల్పడేలా చేశారని బంధువులు ఆరోపించారు. మరోవైపు తాడిపత్రి నియోజకవర్గంలో పోలీసుల నుంచి టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు రక్షణ లేదని టీడీపీ నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ జరుగుతున్న క్రమంలోనూ ఓం శాంతి నగర్ లో వైసీపీ నాయకులు రాళ్ల దాడికి తెగపడ్డారు. తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాళ్లదాడికి భయపడిన పోలీసులు చుట్టుపక్కల ఇళ్లలో దూరి దాక్కునే పరిస్థితి నెలకొంది. ఈ రాళ్ల దాడిలో కొంతమంది పోలీసులకు గాయాలయ్యాయి.

బరితెగించిన వైసీపీ కార్యకర్తలు - బాలింత అని చూడకుండా... (ETV Bharat)

ఓటరును కొట్టిన ఎమ్మెల్యే - ఎమ్మెల్యేను తిరిగి కొట్టిన ఓటర్ - MLA Beat Voter

దాడి చేసిన సమయంలో పోలీసులు పక్కనే ఉన్నా, మా తమ్ముడిని కొట్టారు. ఓటు కోసం వచ్చిన మా తమ్ముడిపై దాడి చేశారు. పారిపోతున్న తమపై దాడికి పాల్పడ్డారు. ఎవ్వరో దాడి చేస్తే మా తమ్ముడిని పట్టుకుని వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. మా తమ్ముడికి తీవ్ర గాయలయ్యాయి. అతనికి ఎమైనా జరిగితే ఎలా? ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. అతని భార్య బాలింత అని చూడకుండా దాడి చేశారు. సుమారు 70 మంది ఉన్నారు. వారంతా మా తమ్ముడిపైకి దాడికి పాల్పడ్డారు. దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలి. -కృష్ణమూర్తి సోదరి

వైఎస్సార్సీపీ నేతల బెదిరింపులు - భయాందోళనలో ఓటర్లు - clashes in ap elections

ABOUT THE AUTHOR

...view details