ETV Bharat / state

అటు ఐటీ ఉద్యోగం ఇటు చేపల పెంపకం - రెండు చేతులా సంపాదన

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ చేపల పెంపకం - రెండు చేతులా సంపాదిస్తున్న కృష్ణా జిల్లాకి చెందిన వ్యక్తి

fish_farming_while_working_in_it
fish_farming_while_working_in_it (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 25, 2024, 9:20 PM IST

Fish Farming while doing Software job in Krishna district: ఒకవైపు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ మరోవైపు చేపలు పెంచుతూ రెండు చేతులారా సంపాదిస్తున్నారు కృష్ణా జిల్లా యనమలకుదురుకు చెందిన కన్నా విష్ణువర్ధన్‌ అనే వ్యక్తి. ఖాళీ సమయంలో అదనపు ఆదాయం సంపాదించడంపై దృష్టి సారించిన విష్ణువర్ధన్‌, ఆధునిక పద్ధతిలో చేపలు పెంచాలని నిర్ణయించుకున్నారు. వర్క్‌ ఫ్రం హోం ద్వారా ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తూనే చేపల పెంపకంపై అవగాహన పెంచుకున్నారు. సాధారణంగా చెరువుల్లో చేపల పెంపకం అంటే స్థలం, నీరు ఎక్కువగా ఉండాలి. ఈ క్రమంలో 10 ఎకరాల్లో పెంచే చేపలను తక్కువ నీటితో రీసర్క్యులేటింగ్‌ ఆక్వా కల్చర్‌ సిస్టం(రాస్‌) పద్ధతిలో కేవలం 10 సెంట్ల స్థలంలో చేపలు పెంచవచ్చని విష్ణువర్ధన్ తెలుసుకున్నారు.

రెండు సంవత్సరాల క్రితం 65 సెంట్ల స్థలాన్ని అద్దెకు తీసుకొని 25 సెంట్లలో అల్యూమినియంతో చేసిన 12 ట్యాంకులను విష్ణువర్ధన్ ఏర్పాటు చేశారు. ఒక్కో ట్యాంకులో 1000 చేప పిల్లలను సేంద్రియ పద్ధతుల ద్వారా పెంచుతున్నారు. ఒక బ్యాచ్‌ చేపలను అమ్మి లాభాలు చూసినా, రెండో బ్యాచ్‌ వచ్చేసరికి కృష్ణా వరదలతో ట్యాంకులన్నీ మునిగిపోయి చేపలు కొట్టుకుపోయాయి. దీంతో నష్టం వచ్చినా నిలదొక్కుకుని మళ్లీ చేపలు పెంచుతున్నారు. ప్రస్తుతం 40 టన్నుల వరకు పెరిగాయి. చేపలు పెరిగాక వాటిని గ్రేడింగ్‌ చేసి పెద్దవాటిని ఒక ట్యాంకులోకి చిన్న వాటిని మరో ట్యాంక్ లోకి మార్చాలని తెలిపారు. అలా మార్చకపోతే మేత మొత్తం పెద్దచేప తినేస్తుందని విష్ణువర్ధన్‌ చెబుతున్నారు. ఈ చిట్కా పాటించక చేపల పెంపకందారులు నష్టపోతున్నారని విష్ణువర్ధన్ తెలిపారు.

45 రోజులు పెరిగిన చేపను చూపుతున్న విష్ణువర్ధన్‌ (ETV Bharat)

భారీగా జింక చర్మాలు స్వాధీనం - కర్ణాటకకు తరలిస్తుండగా పట్టివేత

"సీఐడీ కస్టడీ మిస్టరీ" - ఈ కేసులో పెద్ద చేపలు త్వరలో తెరపైకి : RRR

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.