Fishermen Catching Fish at Foundations of Amaravati Secretariat : అమరావతి సచివాలయ పునాదుల్లో ఉన్న నీటిని తొలగించడంతో అక్కడ భారీగా చేపలు బయటపడుతున్నాయి. వీటిని పట్టుకునేందుకు స్థానిక జాలర్లు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుంటున్నారు. గత 5 ఏళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమరావతి కట్టడాలను గాలికి వదిలేయడంతో బిల్డింగుల పునాదుల్లోకి భారీగా నీరు వచ్చి చేరింది. ఈ క్రమంలో అందులో చేపలు పెరిగాయి.
అయితే కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాజధాని అమరావతి ఊపిరందుకుంది. తిరిగి అమరావతిలో పనులు ప్రారంభించారు. అక్కడ ఉన్న ముళ్ల కంచెలను తొలగించి నీటిని తోడే పనులు చేపట్టారు. ఈ నీరు తోడటం దాదాపు పూర్తవడంతో అందులోని చేపలు బయట బడుతున్నాయి. అయితే వాటిని పట్టుకునేందుకు స్థానికులు వలలతో అక్కడికి ఎగబడుతున్నారు.
పునాదులలో పూర్తవుతున్న నీటి తొలగింపు: అమరావతిలోని శాశ్వత సచివాలయ పునాదులలో నీటిని తోడేయటం దాదాపు 75 శాతం పూర్తైంది. నీరు బయటకు వెళ్లిపోవడంతో సచివాలయ పునాదులు బయటపడ్డాయి. ఇప్పటి వరకు 3వ వంతు నీటిని తోడేయడం జరిగిందని మరో వారం రోజుల్లో మిగిలిన నీటిని తోడేయటం పూర్తవుతోందని గుత్తేదారు వెల్లడించారు.
నీటి మట్టం అడుగుకు చేరడంతో భారీగా మత్య్ససంపద బయటపడుతోంది. స్థానిక జాలర్లు వలలు తీసుకొచ్చి చేపలను పడుతున్నారు. చుట్టు పక్కల వాసులంతా తాజా చేపలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఒక్కో చేప కనీసం రెండు నుంచి మూడు కిలోల వరకు ఉంటుందని కొనుగోలుదారులు చెబుతున్నారు. తాజా చేపలకు మంచి ధర పలుకుతోందని జాలర్లు వెల్లడించారు.
ఏపీలో మెగా సిటీలుగా ఆ ప్రాంతాలు - అమరావతి ఓఆర్ఆర్తో మారనున్న రూపురేఖలు
వైఎస్సార్సీపీ అక్రమాలకు అడ్డుకట్ట - వీఎంఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్ పునఃపరిశీలన