Royal Bengal Tiger Died in Tirupati Zoo: తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో (Sri Venkateswara Zoological Park) సోమవారం మధు అనే రాయల్ బెంగాల్ టైగర్ మృతి చెందింది. 2018లో 11 ఏళ్ల వయస్సు ఉన్న ఈ పులిని బెంగళూరులోని బన్నెరగట్ట బయోలాజికల్ పార్క్ (Bannerghatta Biological Park) నుంచి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.
అప్పట్నుంచి సుమారు ఏడు సంవత్సరాల పాటు జూ సంరక్షణలోనే ఉంది. అయితే వృద్ధాప్యం కారణంగా రెండు సంవత్సరాల నుంచి సందర్శకుల ప్రదర్శనకు సైతం దీన్ని పెట్టలేదని జూ క్యురేటర్ సెల్వం తెలిపారు. గత రెండు నెలలుగా తగిన ఆహారం, నీరు తీసుకోవడం లేదని వెల్లడించారు. ఈ పులి కళేబరానికి తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ కాలేజ్ పాథాలజీ డిపార్ట్మెంట్ వైద్యుల బృందం ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారన్నారు. వృద్ధాప్యం, బహుళ అవయవాల వైఫల్యం కారణంగానే రాయల్ బెంగాల్ టైగర్ మృతి చెందినట్లు పోస్టుమార్టంలో నిర్ధరణ అయినట్లు తెలిపారు.
అయ్యో పాపం పులి - ఇప్పుడు ఎలా ఉందో ఏంటో?
"పత్తిచేనులో పెద్దపులి" - తాళ్లు తెంపుకుని ఊళ్లోకి పరిగెత్తిన ఎద్దులు