Yadadri Hundi Counting : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ హుండీని అధికారులు భక్తుల సమక్షంలో లెక్కించారు. శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మొత్తం 22 రోజుల్లో రూ. కోటి 77 లక్షల 99 వేల 734 రూపాయలను నగదను భక్తులు కానుకుల రూపంలో నరసింహ స్వామికి సమర్పించారని ఆలయ అధికారులు పేర్కొన్నారు.
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైభవంగా ఊంజల్ సేవ
నగదుతో పాటు 99 గ్రాముల మిశ్రమ బంగారం, 4.170 కిలో గ్రాముల మిశ్రమ వెండి సమర్పించారు. అలాగే విదేశీ కరెన్సీ రూపంలో 397 అమెరికన్ డాలర్లు, 20 యూఏఈ దిర్హామ్స్, 70 ఆస్ట్రేలియా డాలర్స్, కువైట్ 20 దినార్, ఇంగ్లాండ్ 5 పౌండ్స్, యూరోప్ 15 యూరోస్, మలేసియా 1 రింగిట్స్, న్యూజిలాండ్ 50 డాలర్స్, నేపాల్ 10 రూపీస్, 5 ఖతార్ రియల్స్, హుండీల్లో కానుకల రూపంలో వచ్చాయి. వీటిని ఆలయ ఖజానాలో జమచేశామని దేవస్థాన ఈవో రామకృష్ణారావు తెలిపారు.
యాదాద్రిపుణ్యక్షేత్రంలో ప్రధాన, అనుబంధ ఆలయాలలో హరి,హరుల ఆరాధనలు ఆయా ఆలయాల ఆచారంగా కొనసాగాయి. ప్రధానాలయంలో వైష్ణవ పద్ధతిలో పాంచారాత్రాగమ శాస్త్రరీత్యా పంచనారసింహులను కొలుస్తూ, నిత్య పూజలు నిర్వహించారు. మూలవరులను మేల్కొల్పి, హారతి సమర్పించి నిజాభిషేకం, తులసి అర్చన చేపట్టారు. మహాముఖ మండపంలో యజ్ఞ మూర్తులకు అష్టోత్తరం, స్వర్ణ పుష్పార్చనలు కొనసాగించారు.