Daughter Appeal for Release Her Father : 'నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్న ఎలా ఉంటారో తెలీదు. నేను ప్రత్యక్షంగా చూసింది లేదు. ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడటమే' అంటూ 21 ఏళ్ల యువతి ఆవేదన వ్యక్తం చేసింది. బహ్రెయిన్ జైల్లో 5 నెలలుగా ఉంటున్న తన తండ్రిని విడిపించాలని వేడుకుంటోంది. వృద్ధాప్యంలో ఉన్న ఆయణ్ని దగ్గరుండి చూసుకోవాలని ఉందంటూ కన్నీటి పర్యంతమైంది.
ఖల్లివిల్లిగా మారి :నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం కొడిచెర్లకు చెందిన కంచు గంగయ్య అలియాస్ కంచు చిన్న నడ్పి గంగయ్య ఉపాధి కోసం 1999లో సౌదీ అరేబియాకు వెళ్లి 5 సంవత్సరాలు ఉన్నారు. అనంతరం మూడేళ్లు దుబాయ్‌లో పనిచేశారు. 2008లో భార్య లక్ష్మి, ఐదేళ్ల కుమార్తె శ్రుతిని వదిలి బహ్రెయిన్ వెళ్లారు. కంపెనీ వీసాపై వెళ్లినా చట్టవిరుద్ధంగా పనిచేసే అక్రమ నివాసి (ఖల్లివిల్లి)గా మారారు. అక్కడ ప్రభుత్వం చేపట్టిన తనిఖీల్లో పాస్‌పోర్టు, వీసా లేదనే కారణంతో పోలీసులు అరెస్టు చేసి జైల్లో వేశారు.
'ఉద్యోగమంటూ నన్ను దుబాయ్ ఎడారిలో వదిలేశారు' - 'గోట్ లైఫ్' మూవీని తలపించే ఘటన - DUBAI JOB FRAUD NEWS
ఈ విషయం తెలుకున్న శ్రుతి, తల్లిని తీసుకుని హైదరాబాద్‌లో వలసదారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మంద భీం రెడ్డిని కలిశారు. వారి సమస్యను వివరించగా ఆయన బహ్రెయిన్‌లో నోముల మురళి అనే సామాజిక కార్యకర్తతో సమన్వయం చేసుకుని బాధితుని వివరాలు సేకరించారు. బాధితుడి ఫొటో గుర్తింపు ధ్రువీకరణ చేసి పంపిస్తే అక్కడ తాత్కాలిక తెలుపు పాస్‌పోర్టు జారీ చేస్తామని బహ్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ తెలిపింది. దీనిపై హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి మెయిల్ చేసినా ఆర్సీవో నుంచి స్పందన లేదని గల్ఫ్ సంక్షేమ సంఘం ప్రతినిధులు టీపీసీసీ ఎన్నారై సెల్ ఛైర్మన్ వినోద్ కుమార్‌ను కలిసి వివరించారు.
బాధితులు మంగళవారం బేగంపేటలోని మహాత్మ జ్యోతిబాఫులే ప్రజాభవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రవాసి ప్రజావాణిలో వినతిపత్రం ఇచ్చారు. గంగయ్యను స్వదేశానికి రప్పించాలని, భార్య, కూతుర్ని కలిసేలా చూడాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు వలస కూలీల వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు భీంరెడ్డి ఈటీవీ భారత్‌కు తెలిపారు.
గొప్పగా బతుకుదామనుకుని వెళ్లి - నెల రోజుల్లోనే విగతజీవిగా - దుబాయ్‌లో మెదక్ వాసి మృతి - Telangana Man Died in Dubai
దుబాయ్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఐదుగురికి విముక్తి - కోర్టు క్షమాభిక్షతో 18 ఏళ్ల అనంతరం ఇళ్లకు